ఆంధ్రప్రదేశ్‌

తండ్రి తుప్పు.. కొడుకు పప్పు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేశ్‌ను మంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తండ్రి తుప్పు అని, కొడుకు పప్పు అని ఎమ్మెల్యే, వైకాపా మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా విమర్శించారు. అసెంబ్లీలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి యనమల రామకృష్ణుడు వెటకారంగా మాట్లాడటం మినహా అతనికి కేంద్రం నుంచి రెవెన్యూలోటు భర్తీ, రైల్వే జోన్ సాధన వంటివి పట్టవని విమర్శించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధనకు వైకాపా నేత అమర్‌నాథ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఆదివారానికి నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద ఆమె మాట్లాడుతూ కాల్‌మనీ తదితర అంశాల్లో విమర్శలు ఎదుర్కొంటున్న కొంతమంది భజనపరులు లోకేశ్‌ను మంత్రిగా చేయమని చెపుతున్నారని, అందుకు తమ పదవులకు కూడా రాజీనామా చేస్తామని అంటున్నారని, కానీ ఇప్పటి వరకూ ఎవరూ రాజీనామా చేయలేదని ఎద్దేవా చేశారు. రైల్వే జోన్‌పై బిజెపి, టిడిపిలు వౌనంగా ఉన్నాయని ఆరోపించారు. దీనిపై రెండేళ్లుగా దొంగాట ఆడుతున్నారని, ప్రజల మనోభావాలపై గౌరవం లేదన్నారు. ఓటు-నోటు కేసులో దొరికిపోయిన ముఖ్యమంత్రి ఏమీ చేయలేక దద్దమ్మగా మిగిలారని ఆరోపించారు. వివిధ నగర పాలక సంస్థల ఎన్నికలు, పార్టీ మారిన నియోజక వర్గాల్లో ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదని విమర్శించారు. రాష్ట్రంలో మరోసారి కరవు, నీటి ఎద్దడి నెలకొనడానికి చంద్రబాబు లెగ్ కారణమని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఖరి వలన కేంద్రం నిధులు విడుదల చేయడం లేదన్నారు. నిధులు దుబారా చేయడం చూసి నిధుల అవసరంలేదని కేంద్రం భావిస్తూ నిధులు కేటాయించడం లేదన్నారు. రాష్ట్ర మంత్రులు అయ్య న్న, నారాయణకు గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడి పట్టడం లేదని ఆరోపించారు. రైల్వే జోన్ విషయాన్ని ఒకటి, రెండు రోజుల్లో తేల్చకపోతే ఎమ్మెల్యేలను, ఎంపీలను కాలర్ పట్టుకుని నిలదీయండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైకా పా నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కోసం అసెంబ్లీలో తీర్మా నం చేశామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్ర యోజనాలకు సంబంధించిన ఈ అం శంపై ముఖ్యమంత్రి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రైల్వే, సాధారణ బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యా యం జరుగుతున్నా, ఎంపీలు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు.

కొనసాగుతున్న ఎండల తీవ్రత

ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్‌లో 45 డిగ్రీలు
అనంతపురం, కర్నూలు, జంగమేశ్వరంలో 43 డిగ్రీలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రంగా ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలో 45 డిగ్రీల ఉష్ణోత్ర చేరుకుంది. ఇంతేకాకుండా మిగిలిన ప్రాంతాల్లోనూ అధికంగానే ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నాం మూడు గంటల వరకు హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగాయి. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడటంతో కాస్త చల్లబడి ప్ర జలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ జిల్లాలతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనా, వేడి, వడగాల్పులు తీవ్రంగానే కొనసాగాయి. అనంతపురం, కర్నూలు, జంగమేశ్వరంలో 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది.
జంతువులకూ వడదెబ్బ
నిప్పుల వాన, వడగాల్పుల ప్రభా వం ప్రజలపైనే కాదు, జంతువులపైనా పడుతోంది. వడదెబ్బ తాకిడికి జంతుజాలం సైతం తట్టుకోలేక పోతోంది. దీంతో హైదరాబాద్‌లోని నెహ్రూ జూ లాజికల్ పార్కులో జం తువులు వడదెబ్బతినకుండా సం బంధిత అధికారులు సత్వర ఉపశమన చర్యలు చేపట్టారు. జంతువులకు అందించే తాగు నీరు సహా అవి నివాసం ఉండే ప్రాంతం చల్లదనంగా ఉంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. జంతువులు ఉండే ఎంక్లోజర్ల వద్ద 250 జల్లులు పడే యంత్రాలు, రెయిన్ గన్స్, నీడ ఉండే విధంగా తుంగతో చేసిన పై కప్పులను అమర్చి జంతువులను సంరక్షించుకునేందుకు అధికారులు అవస్థలు పడుతున్నారు. జంతువులు నీటిలో మునిగి తేలే విధంగా అవసరమైన నీటిని కూడా సమకూర్చుతున్నారు. జంతవుల్లో అధిక వేడిని తగ్గించేందుకు థెర్మోకేర్ లిక్విడ్‌ను అన్ని జంతువులకు అందిస్తున్నారు.