తెలంగాణ

క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: క్రమబద్ధీకరణ పేరిట రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం మూసి వేసే కుట్ర చేస్తున్నదని బిజెపి నూతన అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. కార్పొరేట్ విద్యా సంస్ధలకు ప్రభుత్వం కొమ్ముకాస్తున్నదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. రాష్ట్రంలోని 398 పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థి లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతున్నదని ఆయన తెలిపారు. ఒకవైపు గ్రామీణ అక్షరాస్యతలో మన రాష్ట్రం (57 శాతం), బీహార్ (60 శాతం) కంటే దారుణంగా ఉంటే ఇంకో వైపు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే వరకూ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఆయ న విమర్శించారు. ఈ ప్రభుత్వానికి పేదల పట్ల, వారి విద్య పట్ల ఎంత చిన్న చూపు ఉన్నదో స్పష్టమవుతున్నదని అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యార్థి ఉపాధ్యాయుడు నిష్పత్తి ఆధారంగా కాకుండా తరగతికి కనీసం ఒక్క ఉపాధ్యాయుడైనా తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాం డ్ చేశారు.
రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేకపోవడంతో, యుజిసి నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల విశ్వవిద్యాలయాల విద్యా వ్యవస్థ నిర్వీర్యం కావడమే కాకుండా ఉస్మానియా, కాకతీయ వంటి విశ్వవిద్యాలయాలు న్యాక్ గుర్తింపు లేక ప్రాభవాన్ని కోల్పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు కలుపుకుని మొత్తం 2753 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోనియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు మంజూరైతే ఇప్పటి వరకు 1249 మాత్రమే భర్తీ చేశారని, 1504 ఖాళీల్లో (55 శాతం) నియమాకాలు చేయాల్సి ఉందని అన్నారు. 11 వర్సిటీలలో తెలంగాణ, ఓపెన్ వర్సిటీ మినహాయిస్తే మరే వర్సిటీలోనూ 50 శాతం మించి నియమాకాలు జరగలేదని ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ, శాతావాహన వర్సిటీల్లో కేవలం ఒక్కొక్క ప్రొఫెసరే ఉన్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యుజిసి నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని, ఒక్కో వర్సిటీకి కనీసం 30 నుంచి 50 కోట్ల రూపాయల వరకు నిధులు కోల్పోతున్నామని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఖాళీగా ఉన్న 1504 ఉద్యోగాల భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
టిఆర్‌ఎస్‌లో చేరాలని ఒత్తిడి
ప్రతిపక్షాలకు చెందిన సర్పంచులు, ఎంపిటీసిలు, జెడ్‌పిటిసీలను టిఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు వత్తిడి తెస్తున్నారని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. చేరకపోతే అభివృద్ధికి నిధులు కేటాయించేది లేదని బెదిరిస్తున్నట్లు తమ పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపిటిసీలు తమ దృష్టికి తెచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రి టి. హరీశ్‌రావు సొంత నియోజకవర్గంలోనే తమ పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరేసి ఎన్నికయ్యారని ఆయన తెలిపారు. అందుకే విర్రవీగ వద్దని సూచించారు.