తెలంగాణ

మృత్యుగని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, ఏప్రిల్ 13: సింగరేణి బొగ్గు గని మరో ముగ్గురు కార్మికులను బొగ్గు పొరల్లో ఇముడ్చుకుంది. విధుల్లోకి వెళ్లిన కార్మికులు ఊహించని విధంగా బొగ్గు బావిలో ప్రమాదానికి గురైన హృదయ విదారక సంఘటన శాంతిఖని బొగ్గు గనిపై కార్మికులను నివ్వెరపరిచింది. బుధవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ఏరియాలోని శాంతిఖని బొగ్గు గనిలో చోటుచేసుకున్న ఈ హఠాత్పరిణామంలో ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు బొగ్గు బావిలో ఏం జరిగిందో తెలియక హైరానా పడ్డారు. మొదటి షిఫ్టులో బొగ్గు బావిలోకి విధులు నిర్వహించేందుకు దిగిన కార్మికులు 52వ లెవెల్ వద్ద 1వ డిప్ ప్రమాదంలో బండ కింద చిక్కుకున్నారన్న విషయం ఒక్కసారిగా దావానలంలా వ్యాపించడంతో గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి గని కార్మికులు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... మందమర్రి ఏరియాలోని శాంతిఖని బొగ్గు గనిలో బుధవారం ఉదయం ఎప్పటిలాగే కార్మికులు విధుల్లోకి దిగారు. ఇంతలోనే 52వ లెవెల్ 1వ డిప్ వద్ద విధులు నిర్వహిస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు చీమల శంకర్‌తోపాటు పాలసాని హన్మంతరావు (టింబర్‌మెన్), కిష్టయ్య (టింబర్‌మెన్), పోశం (మేషన్) దాహం వేయడంతో నీళ్లు తాగేందుకు వెళ్లారు. అదే సమయంలో 12్ఫట్ల ఎత్తుగల విశాలమైన పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో వీరంతా మట్టిపెళ్ల్లల కింద చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న మందమర్రి ఏరియా జిఎం వెంకటేశ్వర్ రెడ్డి, బెల్లంపల్లి ఏరియా జిఎం రవిశంకర్‌తో పాటు శ్రీరాంపూర్ ఏరియా జిఎం సుబాని శాంతిఖని గని వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలానికి అధికారులు సింగరేణి రెస్క్యూటీమ్‌ను అప్రమత్తం చేసి గనిలోకి పంపించారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా బెల్లంపల్లి డిఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. మట్టిపెళ్లల మధ్య చిక్కుకున్న జనరల్ మజ్దూర్ కార్మికులు చీమల శంకర్‌ను రెస్క్యూటీమ్ సిబ్బంది బయటికి తీయగలిగారు. ప్రమాదంలో శంకర్‌కు స్వల్ప గాయాలు కాగా, అతన్ని బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. అతనితో పాటు ప్రమాదానికి గురైన మరో ముగ్గురిని బయటికి తీసేందుకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సింగరేణి రెస్క్యూటీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. బండ కింద చిక్కుకున్న బొగ్గు బావిలో ప్రమాదానికి గురైన కార్మికులను వెలికి తీసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నప్పటికీ అధికారులు, రెస్క్యూటీమ్ సిబ్బంది సాయంత్రం వరకు వారిని గని లోపలి నుంచి బయటికి తీసుకురాలేకపోయారు. కార్మికులు మృతి చెందారో లేక ప్రమాదంలో గాయపడి సజీవంగా ఉన్నారో అన్న విషయాన్ని అటు రెస్క్యూటీమ్ సిబ్బంది గానీ, ఇటు అధికారులు గానీ చెప్పలేకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యుల రోదనలతో గని ప్రాంతమంతా దద్దరిల్లింది. మద్యాహ్నం 2.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మరో రెండు బృందాల రెస్క్యూటీమ్ బృందాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సహాయక చర్యల్లో పాల్గొనడానికి గనిలోకి వెళుతున్న రెస్క్యూ టీమ్ సిబ్బంది

సాగర్ కుడి, ఎడమ కాల్వలకు
నీరు నిలిపివేత
నాగార్జునసాగర్, ఏప్రిల్ 13: నాగార్జునసాగర్ జలాశయం నుండి విడుదల చేస్తున్న నీటిని బుధవారం నిలిపివేశారు. ఈ నెల 1నుండి ఎడమకాల్వ పరిదిలో తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేస్తున్నారు. కాగా ఎడమకాల్వకు కేటాయించిన నీటి పరిమాణం పూర్తి అయిన కారణంగా బుధవారం సాయంత్రం వరకు నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమకాల్వకు 5.4 టిఎంసిల నీటిని విడుదల చేసినట్లుగా డ్యాం అధికారులు తెలిపారు. ఈ నెల 8నుండి కుడికాల్వకు విడుదల చేస్తున్న ఒక టిఎంసి నీరు బుధవారం రాత్రితో పూర్తకానున్న కారణంగా కుడికాల్వకు విడుదల చేస్తున్న నీటిని సైతం నిలిపివేయనున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 506.70 అడుగుల నీటిమట్టం ఉండగా శ్రీశైలం నుండి 6,050 క్యూసెక్కుల నీరు వస్తుండగా బుధవారం తెల్లవారు జాము వరకు కుడికాల్వకు 2,106, ఎడమకాల్వకు 5,061 క్యూసెక్కులను విడుదల చేశారు.