ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో అరుణక్క అరెస్ట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 5: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం కూడా కాకముందే మావోయిస్టుల కదలికలు చోటుచేసుకుంటున్నాయి. ఇది పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే అనారోగ్య కారణంగా రాజధాని ప్రాంత ఉద్దండరాయునిపాలెంలో తన సోదరి ఇంట రహస్య జీవితం గడుపుతున్న మావోయిస్టు భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణక్కను, ఆమె సోదరి పద్మక్కను మంగళవారం గుంటూరు రూరల్, జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అరుణక్క పార్టీలో డిప్యూటీ కమాండర్‌గా కూడా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఆమెపై మొత్తం 9 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తన సోదరి ఇంట ఉంటున్నట్లుగా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిని చుట్టిముట్టి అదుపులోకి తీసుకుని తమ వెంట తీసుకెళ్లారు. చత్తీస్‌గఢ్ ఏరియాలో పేరొందిన మావోయిస్టు నరసింహారావు అలియాస్ జగ్గన్న అరుణక్క భర్తగా భావిస్తున్నారు.