ఆంధ్రప్రదేశ్‌

న్యాయస్థానం తీర్పుపై సభలో చర్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సభలో చర్చిస్తామని చెప్పడం సరికాదని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రోజాను అసెంబ్లీ హాలులోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ట్యాంకు బండ్ చౌరాస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన వైకాపా నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోజాను పరామర్శించేందుకు వచ్చిన జగన్ పాత్రికేయులతో మాట్లాడుతూ చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకున్న 8 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని, అక్కడ ప్రజలు ఎవరికి ఆశీస్సులు ఇస్తారో తేలిపోతుందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరుగుతున్న అన్యాయం మీద తమ నిరసన తెలుపుతామని, వాకౌట్ చేస్తామని అంటుంటే మైక్ కూడా ఇవ్వని అధ్వాన్నమైన స్థితిలో చట్టసభ ఉందని అన్నారు. రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయడానికి ఏకగ్రీవంగా సభ ఆమోదం తెలిపిందని అంటున్నారని, ఇదే సభలో సోమవారం ఇదే అంశంపై చర్చిస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ఆదేశాలను ధిక్కరిస్తూ, దాని గౌరవాన్ని దిగజార్చారని, స్పీకర్, సభ వ్యవహరిస్తున్న తీరుకు తాము నిరసన తెలుపుతున్నామని జగన్ అన్నారు. ఒకవైపు చట్టసభలో వీళ్లు చేసింది అన్యాయం అంటూ న్యాయస్థానంలో విచారణ జరుగుతోందని, మరోవైపు న్యాయస్థానం తీసుకున్న తీర్పు మీద వీళ్లు చట్టసభల్లో విచారిస్తామనడం, ఏం పద్ధతి అని జగన్ ప్రశ్నించారు. హైకోర్టుకు వ్యతిరేకంగా వీరు మరో తీర్పు ఇస్తారా? అని ప్రశ్నించారు. కోర్టు నుండి ఉత్తర్వులు తీసుకుని ఒక మహిళా ఎమ్మెల్యే తన హక్కులు తనకు ఇవ్వమని కోరితే కోర్టుకన్నా తామే పెద్దవాళ్లమని, హక్కులు ఇవ్వాల్సిన పనే్లదని వాళ్లు చెబుతున్నారని, ఈ పరిస్థితి చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఎంతగా అవహేళన చేస్తున్నారో అర్ధం అవుతోందని అన్నారు. రానున్న రోజుల్లో టిడిపికి ప్రజలు, న్యాయవ్యవస్థలే గట్టిగా బుద్ధి చెబుతాయని అన్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్న వాళ్లను డిస్మిస్ చేసి, మళ్లీ ప్రజలలోకి వెళ్లే విశ్వాసం ఆయనకు లెకుండా పోయిందని, అందుకే ఆయన ఎన్నికలకు సిద్ధంగా లేరని అన్నారు. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్, కాన్ఫిడెన్స్ ఉండాలని, అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడవడమే చంద్రబాబు క్యారెక్టర్ అని, ఎన్నికలకు ముందు ప్రజలకు అబద్ధాలు చెప్పడం, ఆ తర్వాత ప్రజలను మోసం చేయడం ఆయన విశ్వసనీయత అని అన్నారు. ఈ రెండూ ఆయనకు లేవుకనుక ప్రజల్లోకి వెళ్లలేక అవినీతి డబ్బుతో వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే రోజా విషయంలో జరగుతున్నదంతా ప్రపంచం చూస్తోందని, ఒక అబల తనకు అన్యాయం జరుగుతోందని కోర్టకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నా దానిని కూడా అవమానిస్తున్నారని, దేవుడితో మాట్లాడి తాము చంద్రబాబుకు జ్ఞానోదయం చేయాలని కోరామని అన్నారు.