తెలంగాణ

పిఇసెట్, పిజిఇసెట్, ఎడ్‌సెట్‌ల షెడ్యూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పిఇసెట్, పిజి ఇ సెట్, ఎడ్‌సెట్‌ల షెడ్యూళ్లను ప్రకటించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో చేరేందుకు పిఇసెట్‌ను, ఎంటెక్, ఎంఫార్మసీల్లో చేరేందుకు పిజిఇసెట్‌ను, బిఇడి కోర్సులో చేరేందుకు ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మూడు సెట్‌లను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించబోతోంది. ఆ
తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు -2016(పిఇసెట్) మే 11న జరుగుతుంది. బి.పిఇడి, డిపిఇడి రెండు కోర్సులు ఈ ఏడాది నుండి రెండేళ్ల వ్యవధి కోర్సులుగా మార్చారు. నోటిఫికేషన్ మార్చి 11న జారీ చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 14 నుండి అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 25 వరకూ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఎస్సీ-ఎస్టీలకు 400 రూపాయిలు, ఇతరులకు దరఖాస్తు ఖరీదు 700 రూపాయిలు అభ్యర్ధులు 2వేల రూపాయిల జరిమానాతో మే 2 నుండి 5వ తేదీలోగా, 5వేల రూపాయిల జరిమానాతో మే 6 నుండి 8వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. హాల్‌టిక్కెట్లను మే 2 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను వారం రోజుల్లో మే 20 నాటికి ప్రకటించనున్నారు. ఇతర వివరాలకు టిఎస్‌పిఇసెట్ డాట్ ఆర్గ్ వెబ్‌సైట్ చూడాలని కన్వీనర్ ప్రొఫెసర్ జె ప్రభాకరరావు పేర్కొన్నారు.
మే 30 నుండి పిజిఇసెట్
తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఇ, ఎంఆర్క్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి పిజిఇసెట్‌ను మే 30వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకూ రెండు దశల్లో జరగనుంది. ఇందుకు రెండు పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్‌ను ఏర్పాటు చేసినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం చెప్పారు. గత తొమ్మిదేళ్లుగా పిజిఇసెట్‌ను విజయవంతంగా ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. 181 ఇంజనీరింగ్ పిజి కాలేజీలు, 138 ఫార్మసీ పిజి కాలేజీలు ఉన్నాయని, నాలుగు కాలేజీలు ఆర్కిటెక్చర్ పిజిని ఆఫర్ చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారితంగానే ఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్ధుల ఫింగర్‌ప్రింట్‌లను సేకరిస్తామని పేర్కొన్నారు. పరీక్ష నోటిఫికేషన్ మార్చి 11న విడుదల అవుతుందని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను మార్చి 14 నుండి స్వీకరిస్తామని, ఆన్‌లైన్‌లో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 23 వరకూ, 500 జరిమానాతో మే 9 వరకూ, 2000 అపరాధరుసుంతో మే 16 వరకూ, 5వేల అపరాధ రుసుంతో మే 23 వరకూ, 10వేల అపరాధ రుసుంతో మే 28 వరకూ గడువు ఉంటుందని అన్నారు. అభ్యర్ధులు తమ హాల్‌టిక్కెట్లను మే 23 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ పేర్కొన్నారు. ఫలితాలను జూన్ 24న వెల్లడిస్తామని అన్నారు.
తెలంగాణ స్టెట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టును మే 27న నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ పడాల ప్రసాద్ తెలిపారు. మే 27న ఉదయం 11 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. నోటిఫికేషన్‌ను ఈ నెల 14న విడుదల చేస్తారు. అదే రోజు నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 7వ తేదీ వరకూ దరఖాస్తులు సమర్పించవచ్చు. 500 అపరాధ రుసుంతో మే 14 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇతర వివరాలకు టిఎస్‌ఎడ్‌సెట్ డాట్ ఆర్గ్ అనే వెబ్‌సైట్‌ను చూడవచ్చని కన్వీనర్ చెప్పారు. హాల్‌టిక్కెట్లు మే 21 నుండి వెబ్ సైట్‌లో ఉంచుతామని , ఫలితాలను జూన్ 12న ప్రకటిస్తామని అన్నారు.

హైవేల అభివృద్ధి పథకం
డిపిఆర్‌ను కేంద్రానికి పంపండి

జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు
రోడ్ల పనులను వెంటనే చేపట్టాలి
ఆర్ అండ్ బి శాఖ సమీక్షలో మంత్రి తుమ్మల ఆదేశం

హైదరాబాద్, మార్చి 9: ఇటీవల ప్రకటించిన 1400 కి.మీల జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను కేంద్రప్రభుత్వానికి పంపించాలని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బి) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రాలను నుంచి మండలాలకు కలిపే రహదారుల అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని మంత్రి అన్నారు. బుధవారం నాడిక్కడ సచివాలయంలో మంత్రి తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌అండ్‌బి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గాల్లో శాసనసభ్యులకు నివాసం, క్యాంప్ ఆఫీస్‌గా వినియోగించుకునేందుకు సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.కోటి వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బి ఇంజినీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశించారు. ఇందుకు స్థల సేకరణ, ఇతర శాఖల అనుమతులను తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. శాఖలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, పదోన్నతులకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. పైప్‌లైన్లు, కేబుల్స్‌ను రోడ్లపైన కాకుండా పంటపొలాల్లో వేసేందుకు, అభివృద్ధి చేసిన రోడ్లను పాడు చేయకుండా ట్రాక్టర్ దమ్ము చక్రాలను, పార్టీ దిమ్మలను, విగ్రహాలను రోడ్డు స్థలాన్ని ఆక్రమించకుండా నిరోధించాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధిత ఎస్‌ఇలు, ఇఇలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని మంత్రి శాఖ కార్యదర్శిని ఆదేశించారు.

యూనివర్శిటీలుగా ఎస్‌సిఇఆర్‌టిలు
అవసరమన్న కేంద్ర ప్రభుత్వ సమీక్షా కమిటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9: రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థలను యూనివర్శిటీలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన సమీక్షా కమిటీ అభిప్రాయపడింది. ఉపాధ్యాయ విద్య, జాతీయ కౌన్సిల్ పనివిధానం, టీచర్ ట్రైనింగ్ తీరు తెన్నులపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సమీక్షా కమిటీని నియమించింది. కమిటీ బుధవారం నాడు సమావేశమై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది. కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు కమిటీతో సమావేశమై అభిప్రాయాలను చెప్పారు. ప్రైవేటు బిఇడి, డిఇడి కాలేజీలు తామరతంపరగా పెరిగిపోవడంతో ఉపాధ్యాయ విద్యలో నాణ్యతా ప్రమాణాలు దిగజారిపోయాయని, క్షాత్రోపాధ్యాయులు కాలేజీలకు హాజరుకాకపోయినా డబ్బులు తీసుకుని యాజమాన్యాలు పరీక్షలు రాయించి మరీ సర్ట్ఫికేట్లు ఇస్తున్నాయని స్కూల్ టీచర్సు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు నాగాటి నారాయణ పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీలను నియంత్రించి ప్రభుత్వ రంగంలోనే ఉపాధ్యాయ విద్యా కళాశాలలు నిర్వహించాలని సూచించారు. తెలుగుమీడియంతో పాటు ఇంగ్లీషు మీడియంలోనూ బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని, ఉపాధ్యాయ నియామకాలకు ఆర్మీరిక్రూట్‌మెంట్ విధానాన్ని పాటించాలని, విద్యార్హతలో ప్రతిభా పాటవాలతో పాటు ఆప్టిట్యూడ్ టెస్టును నిర్వహించి అర్హులైన వారికే అడ్మిషన్ ఇవ్వాలని అన్నారు. అలాగే శిక్షణ పూర్తయిన వారినే స్కూళ్లలో నియమించాలని, దేశంలో సమ్మిళిత అభివృద్ధి, బహుళ సంస్కృతి, సామాజిక న్యాయం, శాస్ర్తియ దృక్పథం వంటి రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే కరిక్యులమ్‌ను అమలుచేయాలని నారాయణ సూచించారు. భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ టీచర్ ట్రైనింగ్‌లో విద్యావ్యాపారాన్ని అరికట్టాలని, ఉపాధ్యాయ నియామకాలకు అవరోధంగా ఉన్న టెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాన్ని ఇక ఉపేక్షించవద్దు
మంచి చేస్తే మంచి అందాం
చెడు చేస్తే నిలదీద్దాం
35 అంశాలపై చర్చించిన సిఎల్‌పి
గవర్నర్ ప్రసంగం సంతృప్తికరంగా
లేకపోతే శాంతియుతంగా నిరసన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9: రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనాలని, చెడు చేస్తే ఖచ్చితంగా నిలదీయాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నిర్ణయించింది. గురువారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నందున బుధవారం సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టి రెండేళ్ళు కావస్తున్నందున, ప్రజా సమస్యలను నిలదీయడంలో ఇక ఏ మాత్రం ఉపేక్షించరాదని వారు నిర్ణయించారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు 35 అంశాలను ఎంపిక చేశారు. గురువారం గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో ప్రజా సమస్యల పరిష్కారం, ఇచ్చిన హామీల నెరవేర్చడం వంటి అంశాలు ప్రస్తావనకు రాకపోతే శాంతియుతంగా నిరసన తెలియజేయాలని వారు నిర్ణయించారు.

గోల్డ్‌మెడల్ సాధించిన
వరుణ్‌ను అభినందించిన డిజిపి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9: స్విమ్మింగ్‌లో మూడు గోల్డ్‌మెడల్స్ సాధించిన ఇనె్స్పక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి నవీన్ చంద్ కుమారుడు వరుణ్ చంద్‌ను తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె ఆనురాగ్ శర్మ అభినందించారు. కొలంబోలో ఈ నెల 3 నుంచి 7 వరకు జరిగిన 50, 100, 200 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో వరుణ్ పాల్గొన్నారు. వరుణ్ చంద్ 25-30 కేటగిరీలో గోల్డ్ మెడల్స్ సాధించినందుకు డిజిపి ప్రశంసించారు.

కానిస్టేబుల్ మోసం..
యువతి ఆత్మహత్య
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానన్న కానిస్టేబుల్ మోసం చేశాడన్న మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని భరత్ గార్డెన్‌కు చెందిన తులసికి ఇద్దరు సంతానం కుమారుడు సీతారాం, కూతురు శారద. కాగా కుమారుడు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్, కుమార్తె శారద కోఠిలోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే సీతారాంతోపాటే ఎస్పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజేష్, శారదల మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. కొంత కాలం నుంచి రాజేష్ తన తల్లిదండ్రులు వేరే సంబంధం చూస్తున్నారని పదేపదే మెస్సేజ్‌లు పంపడంతో విద్యార్థిని శారద తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

మంచో, చెడో
రాష్ట్రాలు విడిపోయాయి

పరస్పరం సహకరించుకుని, శరవేగంగా అభివృద్ధి చెందండి
తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ నరసింహన్ సలహా

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9: మంచో, చెడో ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది, ఇక ఆ సంగతి మర్చిపోయి పరస్పసరం సహకరించుకుని శరవేగంగా అభివృద్ధి చేయాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఉభయ రాష్ట్రాలకు సలహా ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధిపై దృష్టిసారించి పోటీపడాలని కోరారు. బుధవారం నాడిక్కడ రవీంద్రభారతిలో జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ అండ్ గైడ్స్ అసోసియేషన్స్ తెలంగాణ, ఎపిల కామన్ కౌన్సిల్ సమావేశంలో గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ఇరు రాష్ట్రాలు పోటీపడి అమలు చేయాలని అన్నారు. ఇందుకు భారత్ స్కౌట్స్, గైడ్స్ ఇరు రాష్ట్రాల బాధ్యులు తగిన శ్రద్ధ తీసుకోవాలని కోరారు. విద్యార్థిదశ నుంచే సేవా భావాన్ని పెంపొందించే విధంగా స్కౌట్స్ ఉద్యమాన్ని ప్రోత్సహించే విధంగా బాధ్యులు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపి, తెలంగాణ రాష్ట్ర భారత్ స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్ కె.కవిత మాట్లాడుతూ గవర్నర్ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారత్ స్కౌట్స్, గైడ్స్ సింగరేణి కాలరీస్ సభ్యులు రాష్ట్రానికి విశేష సేవలు అందిస్తున్నారని అన్నారు. స్కౌట్స్ రెండు అసోసియేషన్లుగా విడిపోయినా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు రాష్ట్రాలు కృషి చేస్తాయని అన్నారు. ఉభయరాష్ట్రాల కామన్ అడ్మినిస్ట్రేటర్ కె.పి.మిశ్రా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.