ఆంధ్రప్రదేశ్‌

రాజధాని కోసం 34,142 ఎకరాల సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరాతి నిర్మాణానికి ఇంతవరకూ ప్రభుత్వం 34,142.74 ఎకరాల భూమిని సేకరించిందని, అందులో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిందే 28,264 ఎకరాలు ఉందని మున్సిపల్ మంత్రి డాక్టర్ పి నారాయణ చెప్పారు. బుధవారం శాసనసభలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇంతవరకూ భూ సమీకరణకు 94 శాతం రైతులు అంగీకరించారని అన్నారు. భూ సమీకరణకు సమ్మతింపచేయడానికి రైతులకు నచ్చచెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. బృహత్ ప్రణాళిక ఆవశ్యకతను బట్టి చిట్టచివరి చర్యగా 2013 భూ సేకరణ, పునరావాసం, పున:పరిష్కారంలోని సముచిత నష్టపరిహారం, పారదర్శకతకు హక్కు చట్టాన్ని అమలుచేస్తామని చెప్పారు.
సేంద్రీయ సాగు పద్ధతులకు ప్రోత్సాహం
వ్యవసాయంలో సేంద్రీయ సాగు పద్ధతులను ప్రోత్సహించి, భూసార పటిష్ఠత మెరుగుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రసాయన ఎరువుల వినియోగం పెరిగి, పురుగు మందుల వినియోగం తగ్గినట్టు ప్రభుత్వం గమనించిందని అన్నారు. ప్రభుత్వం సేంద్రీయ సాగును, సహజసిద్ధ సాగును ప్రోత్సహిస్తూ ‘సుస్థిర క్షేత్ర జీవనోపాధుల కల్పన’ అనే కొత్త ప్రాజెక్టును అమలుచేస్తున్నట్టు ఆయన చెప్పారు.

రూ.1465.41 కోట్లతో
వౌలిక సదుపాయాలు
ఉత్తర్వులు జారీ చేసిన ఏపి ప్రభుత్వం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9: పట్టణ స్థానిక సంస్థ (యుఎల్‌బి)ల్లో వౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఉద్దేశించిన పథకంలో భాగంగా ఎంపిక చేసిన కొన్ని పట్టణాలను గుర్తించి నిధులు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గుర్తించిన 37 యుఎల్‌బిల్లో రూ.1465.41 కోట్లతో మంచినీటి సరఫరా, అంతర్గత రోడ్లు, డ్రైయినేజీ, పారిశుధ్ధ్యం వంటి కనీస వౌళిక సదుపాయాలను కల్పించేందుకు ఈ నిధులను వినియోగిస్తారు. వౌళిక వసతుల ఏర్పాటుతోనే ఏ నగరమైనా, పట్టణమైనా అభివృద్ధిని సాధిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రకటించిన మొత్తం రూ.1465.41 కోట్లలో ఎపి ప్రభుత్వ వాటా రూ.480.40 కోట్లు కాగా, అమృత్ పథకం కింద రూ.180.70కోట్లు, ఎస్‌ఏసి కింద రూ.40.41 కోట్లు, ఇఇఎస్‌ఎల్ కింద రూ.25.77 కోట్లు, ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల కింద రూ.555.40 కోట్లు, యుఎల్‌బి వాటాకింద రూ.182.73 కోట్లు వచ్చినట్లు ఎపి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ నిధులను గుర్తించిన 37 యుఎల్‌బిల్లో వౌళిక సదుపాయాల ఏర్పాటు కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది.