తెలంగాణ

దుర్గమ్మ రథోత్సవం శోభాయమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: శైవ భక్తులు, అమ్మ ఆరాధకులు భక్తి శ్రద్ధలతో మొక్కులు నిర్వహించుకునే మహా శివరాత్రి జాతర ఉత్సవాలు మెదక్ జిల్లాలో అట్టహాసంగా కొనసాగాయి. మూడు రోజుల జాతరలో భాగంగా ఏడుపాయల్లో బుధవారం నాడు వనదుర్గా మాత రథోత్సవం కన్నుల పండువగా శోభాయమానంగా కొనసాగింది. మహా శివరాత్రి పర్వదినం రోజున శివాలయాల్లో జాతర కొనసాగనుండగా అందుకు భిన్నంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా మహా శివరాత్రికి దుర్గ్భావాని జాతర ఉత్సవాలు ఒక్క ఏడుపాయల్లోనే కొనసాగుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సుమారు 600 సంవత్సరాలుగా అమ్మవారి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో ఏడుపాయల్లో నీటి జాడ కనుమరుగైనా మొక్కవోని భక్తితో లక్షలాది మంది వనానికి తరలివచ్చి దుర్గామాతకు మొక్కులు తీర్చుకోవడం విశేషం. శివసత్తులు, పోతరాజుల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బోనాలు, ఎడ్ల బండ్ల ఊరేగింపు, రథోత్సవ కార్యక్రమం అందరిని అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అడుగడుగునా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించారు. కాగా మహా శివరాత్రి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 1.5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మంజూరైన నిధులు దేనికి ఖర్చు చేసారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మడుగుల్లో ఉన్న నీటిని మోటార్లతో దిగువకు పంపింగ్ చేయగా గతంలో చేపట్టిన ఏర్పాట్లనే పునరుద్ధరించారు. కొత్త పనులు ఎక్కడ కూడా కనిపించకపోగా నిధుల ఖర్చు వివరాలను అధికారులు ఇప్పటి వరకు బహిరంగ పర్చకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు ఏడుపాయల ఉత్సవాలను శాసించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలావుండగా దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నాడు స్వామి కల్యాణోత్సవం కమనీయంగా కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన కల్యాణోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖకు కోట్లాది రూపాయల ఆదాయం చేకూరిందని చెప్పవచ్చు.
భక్తుల విశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ వచ్చే ఏడాది పుష్కళమైన వర్షాలు కురిపించాలని కేతకేశుడిని, అమ్మలగన్న అమ్మ వనదుర్గా మాతలను వేడుకుందాం.ఒ

ఏడుపాయలలో రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తజనం