తెలంగాణ

భీమవరంనుంచి పోటీ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: వచ్చే ఎన్నికల్లో తాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రాజులతో గురువారం కెటిఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొంటే ఆంధ్రుల నుంచి వచ్చిన స్పందన మీకు తెలిసిందే అని గుర్తు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన ఒకరు వివాహ ఆహ్వాన పత్రం అందించేందుకు వచ్చి అమరావతిలో మా ముఖ్యమంత్రి కన్నా మీ ముఖ్యమంత్రి మాట్లాడేప్పుడే ఎక్కువ చప్పట్లు కొట్టారని అన్నారని కెటిఆర్ తెలిపారు. ఇప్పుడు టిఆర్‌ఎస్ పేరు మారుతుందని, తెలుగువారి పార్టీ అవుతుందని, ఆంధ్రలో కూడా పోటీ చేస్తామని తాను చెప్పినట్టు తెలిపారు.
తాను ఇప్పటికే ఆంధ్రలో నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నానని అన్నారు. ‘్భమవరం నుంచి పోటీ చేస్తాను. అక్కడి రాజుల అభిమానం సంపాదించడం చాలా సులభం’ అని అన్నారు. కోళ్ల పందాలను చట్టబద్ధం చేస్తామనే హామీ ఇస్తే చాలు గెలిచేస్తామని కెటిఆర్ చమత్కరించారు. 18నెలల తెలంగాణ పాలనలో ఏ ప్రాంతం వారి పట్ల వివక్ష చూపలేదని, వ్యతిరేకత చూపలేదని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం వల్ల రెండు ప్రాంతాలకు ప్రయోజనం కలిగిందని గుర్తు చేశారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. వేసవిలో విద్యుత్ కోత అనేది సాధారణ విషయం అని కానీ టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయగలుతున్నామని చెప్పారు. పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. అన్ని ప్రాంతాల వారు ఆనందంగా జీవించగల అద్భుత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషికి అండగా నిలవాలని కెటిఆర్ కోరారు.