శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అన్నదాతల కాశ్రయమవని లేదు
కూడువెట్టెడి వానికి ఁ గూడు లేదు
పడుదురే యష్టకష్టాల కడలులందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ కాలంలో అన్నం పెట్టే అన్నదాత రైతన్నకు కూడులేక ఆశ్రయం దొరకడం లేదు. అష్టకష్టాలనే సముద్రాలలో పడిపోతున్నారా రైతులంతా. పంటలకు పట్టే చీడపీడలను వదిలించు కోవడానికి వాడుతుండే మందులను ఆర్థిక కష్టాలను తట్టుకోలేక వాటిని వారే మింగి ప్రాణాలను దూరం చేసుకొంటున్నారు. కర్మసాక్షివైన ఓసూర్యదేవా! చూడవయ్య.
తే.గీ. కనుల ముందున్న దైవాలఁ గాన రాయె
వారి సేవయె పూజనుకోరు గాంచ
దైవ పూజలు దేనికో తెలుసుకొనరె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను చక్కగా చూడరు. అట్టి తల్లిదండ్రులకు చేసే సేవను మించిన పూజ మరొకటి లేదనుకోరు. దైవ పూజలు దేనికి చేస్తున్నారో తెలుసుకొనరు. చిత్తశుద్ధి లేకుండా కేవలం ఆర్భాటం కోసం పూజలు చేస్తూ పూజించాల్సిన వారిని కష్టపెడుతుంటారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262