శ్రీకృష్ణ లీలారింఛోళి
ఏకప్రాస బాసర సరస్వతీ శతకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 June 2019
-ఉమాపతి శర్మ 9246171342
స్థాణండు నీ తండ్రి శ్రమపెట్టలేను
ధ్యానమే ఆ దొరకు అన్ని కాలాలు
అందువా మాయమ్మ ఔను నిజమమ్మ
అందుకేనే అన్ని శమ్రలమ్మ నీకు
దేవతల కష్టాలె దీర్చినావంట
మానవులపైననా మాగన్ను నీకు
తల్లి ప్రేమకు తారతమ్యాలు కలవె
దీన మానవుల తీరిచి దిద్దరావె
మాయన్న గణపన్న మారాము సేసెనో
చిన్నన్న కొమరన్న చీకాకు వెట్టెనో
వేలుపులు నిను చుట్టి వెడలి రానీయరొ
జాల జూపగ నింత చలమేల నమ్మ
మిథ్యా ప్రపంచమె తథ్యమని తలచి
గాలి మేడలలోన కాపురమ్ముం
కూలిపోయెను కోరికల గాలి మేడ
జాలి జూపగరావె జనని! కాత్యాయని!