శ్రీకృష్ణ లీలారింఛోళి

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోసములెన్ను వానికిని దోసములే గనిపించు నంచు నా
దోసము లెన్ను లక్షణము దోసమటంచు వచింతురమ్మ యా
దోసములెన్నకుండగను దోసములన్ సవరించుటెట్లు హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

ఊసర నేలలందు ఫలముండదు పంటపొలమ్ములట్లుగన్
ఊసుకబుర్లు నీ గుడిని యొప్పవు కావని యేయుపాసనల్
చేసెడు దీక్ష సత్యమయి శ్రేష్ఠము కావలె భక్తియుక్తమై
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!
ఈ సకల ప్రపంచమున నేదియు సత్యము కాదు కాదును
ద్భాసిత రూపమే క్షణిక వర్తన శీలమె, మాయయే కదా!
ఏ సవరింపు లేనియును నీయవునాత్మకు మోక్ష తత్వమున్
వాసర వాసినీ ప్రధ్తి వాగ్వరదాయిని! శ్రీ సరస్వతీ!

నీ సముపాసనమ్మె జననీ! తొలగించును కర్మబంధముల్
దోసపు జన్మ వాసనల దుష్కృతులేమొ యెరుంగలేము పే
రాసలు మోక్ష పాశముల యద్దరి జేరుట మాకు శక్యమే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీసరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342