శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కృష్ణ! గోవర్థనగిరి ఎత్తిపట్టి
మోసి మోసియు నీ చిన్ని భుజములలసె
నేమొ నీకు సాయమ్ము గామేము గూడా
మోసెద మనియు తమ భుజములను జేర్చ
గోపబాలురు జూపించు కుతుకమునకు
కపట మెరుగునట్టి అమాయకత్వమునకు
సంతసించెడు వనమాలి శర్మమొసగు
భావం: గోకులాన్ని రక్షించడానికి ఇంద్రుడు కురిపించిన వడగండ్ల వాన నుండి గోకులాన్ని రక్షించడానికి గోపాల బాలుడు గోవర్దన గిరిని ఎత్తాడు. దాన్ని చూసిన మిగతా గోపబాలురు అంటే కృష్ణుని మీది ఇష్టంతో తాముకూడా గిరిని ఎత్తడంలో సాయం చేస్తామని తమ తమభుజాలను ముందుకు జరుపుతారు. వారి అమాయకత్వాన్ని చూసి శ్రీకృష్ణుడు నవ్వుకున్నాడు.
*
తే.గీ. మధురలోను వసియించు మాదు కనుల
కన్న గోపీజనంబుల కనులె మిన్న
ఏలయన బాల కృష్ణుని లీల లరసి
నవి పరవశత్వమందిన వవియోగాన
భావం: మా కన్నులెంత ఆకర్ణాంత దీర్ఘములై ఉన్నారమణీయంగా ఒప్పారుతున్నా, నంద వ్రజంలోని గోపికల యొక్క కన్ను లే సుందరమైనవి గొప్పవి కారణమేమంటే అవి బాలకృష్ణుని లీలలను చూచి పులకించి ఆనందించినవి. అనుకొంటూన్నారట మధురలోని స్ర్తిలు.

డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949