శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. బ్రతుకుటకు బాటలెన్ని యో పరచుకొనియె
వాటిఁ బట్టిచుఁ బోవంగ ఁ బాటికాదు
పరుల బాగుకు నొకబాటఁ బట్టునటులఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ రోజుల్లో బ్రతకడానికి మనముందు ఎనె్నన్నో దారులున్నాయి. ఆయా దారులలో పోయి బ్రతికేయడం ఏమంత గొప్పతనమూ కాదు, న్యాయం కూడా కాదు. ఇతరుల బాగును కోరుకునే విధంగా సరైన బాట పట్టేలా కర్మసాక్షివైన ఓ సూర్యదేవ నీవే చూడాలి ప్రభూ!
తే.గీ. ప్రాణమున్నది యొకనాడు పారిపోవు
దేహము శవమై యానాడు దేలిపోవు
మంచియునుఁ జెడునవి రెండు మనుచు నుండుఁ
జూడుమా కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ప్రాణమనేది యోదో ఒకనాడు చెప్పాపెట్టకుండా పారిపోతుంది. అదేరోజు దేహం కూడా శవమై పైకి లేచిపోతుంది. మంచి చెడు ఈ రెండే కలకాలం జీవిస్తూ ఉంటాయి. ఈ సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నేవే చాటి చెప్పాలి ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262