శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అమరేంద్రు గర్వంబు హరియించివెల్గిన
ధన్యగోవర్థనో ద్ధర్త వీవు
వల్లవీజనముల వలువలు హరియించి
భాసిల్లు గోపికా భర్తవీవు
క్రౌర్య స్వరూపుడౌ కంసుని ప్రాణముల్
హరియించిన యసుర హర్తవీవు
ఆర్తజనంముల అఘముల బాపియు
కాచి రక్షించెడు కర్తవీవు
తే.గీ. మున్ను వ్రేపల్లె వాడలో వెన్నతిన్న
ముగ్ధమోహన రసరమ్య మూర్తి వీవు
నల్లనేరేడు పండన నడరునట్టి
నల్లనయ్య! నీ పదములె నాకు దిక్కు
భావం: అమరేంద్రుని గర్వాన్ని హరించిన గోవర్థనగిరి ధారివి నీవు. గోపికల వలువలు హరించి వారికి మార్గదర్శనం గావించిన గోపికా వల్లభుడవు నీవు, కంసుని మర్దించిన దానవ హర్తవీవు,. ఆర్తజనులను కాచి రక్షించే కమనీయ మూర్తివి నీవు. మునుపు వ్రేపల్లె వాడలో వెన్నతిన్నట్టి ముగ్ధ మోహనమూర్తివే నీవు. నల్లని నేరేడు పండులాగా మెరిసిపోయే మాపుణ్య ఫలమైన ఓ నల్లనయ్య నీపాద పద్మములే నాకుదిక్కు.

డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949