ఆంధ్రప్రదేశ్
సుజయకృష్ణను బుజ్జగించే యత్నాలు..!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 April 2016
విజయనగరం: తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును బుజ్జగించేందుకు వైకాపా నేతలు ఆఖరి ప్రయత్నాలు ప్రారంభించారు. సుజయకృష్ణను కలిసేందుకు వైకాపా నేతలు విజయసాయి రెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి గురువారం ఉదయం బొబ్బిలి వచ్చారు. సుజయకృష్ణ కోటలో లేరని అక్కడివారు చెప్పడంతో ఆయన కోసం వైకాపా నేతలు ఎదురుచూస్తున్నారు. బొబ్బిలి రాజులు టిడిపిలో చేరితే విజయనగరం జిల్లాలో తమ పార్టీకి గట్టి దెబ్బేనని వైకాపా నేతలు ఆందోళన చెందుతున్నారు.