శిప్ర వాక్యం

ముష్కరుల దుశ్చర్యలకు ముగింపు ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ కేంద్రంగా దాదాపు నలభై ఉగ్రవాద సంస్థలు మన దేశంలో నరమేధం సృష్టిస్తున్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహమ్మద్ నేతృత్వంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 44 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించడం పాక్ దుశ్చర్యలకు మరో తార్కాణం. ఈ దాడిని అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐతే, ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసిన వారికి ఇందులో విచిత్రం ఏమీ కనిపించదు. ఇలాంటి ఘటనలు గతంలో సిరియా, ఆఫ్ఘనిస్థాన్, ఫ్రాన్స్‌లలో చాలా జరిగాయి. మన దేశంలోని ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో చైనా ప్రోద్బలంతో మతోన్మాదులు, మావోయిస్టులు ఎంతోమందిని హతమారుస్తున్నారు.
మన దేశంలో గౌతమ బుద్ధుడు, బసవన్న, గాంధీజీ పుట్టారు. సహనమే సంస్కృతి అన్నాడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ‘పండితుడు చంప దగిన యట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు చేయరాదు పొసగ మేలుచేసి పొమ్మనుటే చాలు’ అని బోధించాడు వేమన. ఇదీ అనాదిగా మన దేశ సంప్రదాయం. గజినీ మహమ్మద్‌ను హిందువులు పదహారుసార్లు వదిలిపెట్టారు. పదిహేడవసారి వచ్చిన గజినీ సోమనాథ్ (గుజరాత్) ఆలయాన్ని ధ్వంసం చేసి వెళ్లిపోయాడు. ‘ఇన్నిసార్లు నిన్ను వదిలాము. ఈసారి మమ్ము వదిలి పెట్టు’అని హిందూ రాజులు ప్రార్థిస్తే ‘కాఫిర్లను వదిలితే దేవుడు మమ్మల్ని క్షమించడు’ అన్నాడు గజినీ మహమ్మద్. మన పార్లమెంటు మీద ఉగ్రవాది అఫ్జల్‌గురు దాడిచేస్తే అతడికి క్షమాభిక్ష పెట్టాలని వామపక్ష నాయకులు రాష్టప్రతిని అర్థించారు. ఇదీ మన దేశ చరిత్ర. అల్లాఉద్దీన్ ఖిల్జీ గుజరాత్, ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక ప్రాంతాలను దోచుకుంటే ఆయన కూతురు బీబీ నాంచారిని వెంకటేశ్వరస్వామి భక్తురాలు అని కాకమ్మ కథలు అల్లిన చరిత్రకారులను కన్న పుణ్యభూమి ఇది.
‘ఐదు నిమిషాలు సైన్యాన్ని పక్కన పెట్టండి.. నా తడాఖా చూపిస్తాను’ అన్న మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్న వీరుల దేశం మనది. భారత్‌ను ముక్కలు ముక్కలు చేయండని చైనా ప్రేరేపిత ఉగ్రవాద నాయకుడు కన్నయ కుమార్ న్యూఢిల్లీలో పిలుపునిస్తే అతడిని దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో సన్మానించిన రాజకీయ పార్టీల దేశం మనది. ముంబయిలో ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్ కళాకారులను కలకత్తాకు పిలిచి సన్మానం చేసిన వీరభూమి మనది. గతంలో యూరీలో జరిగిన ఉగ్రవాద దాడి కంటే పుల్వామాలో తాజా ఘటన దారుణమైనది. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా మొత్తం ప్రపంచం గుర్తించాలి. పాక్‌తో భారత్ ఎలాంటి దౌత్య సంబంధాలు పెట్టుకోకూడదు. కాశ్మీర్‌లోని అన్ని ఇస్లామిక్ మతోన్మాద సంస్థలపైనా నిషేధం విధించాలి. గతంలో, ఇప్పుడు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న నవ్‌జ్యోతిసింగ్ సిద్ధూ లాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలి.
లడఖ్- అరుణాచల్ ప్రదేశ్- టిబెట్- కరాచీల నుండి ఏకకాలంలో చైనా భారత్‌పై మెరుపుదాడి చేసే ప్రమాదం ఉంది. అందుకే ఆ దేశం న్యూక్లియర్ సబ్ మెరీన్‌ను మోహరించింది. సరిహద్దులలో చైనా, పాకిస్తాన్‌ల నుండి ఏకకాలంలో ఉగ్రవాద ముప్పును భారత్ ఎదుర్కొనబోతున్నది. దీనిని ఆసరాగా తీసుకొని మన గడ్డపై దేశద్రోహులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. భారత ప్రభుత్వం తాటాకు చప్పుళ్లుచేస్తే పాకిస్తాన్ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. ఆక్రమిత కాశ్మీరును ఇండియాలో కలపండి. బలూచిస్థాన్, సింధ్‌లను స్వతంత్ర దేశంగా ప్రకటించండి. సింధూ నదీ జలాలు పాకిస్తాన్‌కు చేరకుండా చూడండి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాల సహకారంతో పాకిస్తాన్ పూర్తిగా నిర్వీర్యం అయ్యేలా ప్రధాని మోదీ కృషి చేయాలి. ఆ తరువాతే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలి. ప్రజలకు ఎన్నికల కంటే దేశరక్షణ ముఖ్యం.
శాంతిని కాపాడాలంటే దేశం నిరంతరం జాగృతమై ఉండాలి. శక్తి అనేది లేకుండా శాంతి నిలువదు. ఐసిస్ ఉగ్రవాదులు అణ్వాయుధాలతో దూకుతుంటే మనం భజనలు చేసుకుంటూ పోతే దేశం రక్షింపబడుతుందా? ఆర్టికల్ 370 రద్దు చేయండి. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు మద్దతిస్తున్న మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కట్టడి చేయండి. అవసరమైతే అణ్వస్త్ర ప్రయోగం ద్వారానైనా పాకిస్తాన్‌ను అణచివేయాలి.
పుల్వామా వద్ద నలభై మంది జవానులను చంపేందుకు ఉపయోగించిన పేలుడు పదార్థాలు అమ్మోనియం నైట్రేట్‌తో నిర్మింపబడి, సరిహద్దుకు అవతలి నుండి ఇండియాలోకి ప్రవేశించాయి. చైనాలోని మావోయిస్టులు, పాక్‌లోని జీహాదీ ఉగ్రవాదులు కలిసి భారత సైనికులను హతమార్చేందుకు ఉమ్మడి వ్యూహరచన చేశారు. పేలుడు పదార్థాల నిర్మాణంలో ఈ రెండువర్గాల ప్రత్యక్ష హస్తమూ ఉంది. అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఉగ్రవాద చర్యలను ఖండించగా- చైనా, పాకిస్తానీయులు బహిరంగంగా ఉగ్రవాదులను సమర్ధించారు. వీర జవాన్ల మరణాన్ని మన దేశంలోని మానవ హక్కుల సంఘాలు నిరసించడం లేదు. పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన చైనాకు కమ్యూనిస్టులు, మానవ హక్కుల సంఘ నేతలు వంత పాడుతున్నారు.
ఇక, భారత్ పాకిస్తాన్‌ను ఏకకాలంలో నాలుగైదు రంగాలల్లో ఎదుర్కొనవలసి ఉంది. రాజకీయ రంగానికి సంబంధించి- దేశంలోని అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కూడగట్టాలి. సహకరించని పార్టీలను చట్టబద్ధంగా నిషేధించాలి. ప్రపంచంలోని దేశాలన్నిటి మద్దతును, ఐక్యరాజ్య సమితి సంఘీభావాన్ని కూడగట్టాలి. మద్దతునివ్వని చైనావంటి దేశాలతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలి. పాకిస్తాన్‌లో భారత రాయబార కార్యాలయాలు మూసివేయాలి. ఇండియాలోని పాక్ కార్యాలయాన్ని ఖాళీ చేయించాలి.
పాక్‌తో ఎగుమతులు, దిగుమతులు ఉండకూడదు. పాక్ విమానాలు ఇండియా గగనతలంపై ప్రయాణం చేయకుండా చూడాలి. పాక్‌కు ఏ దేశం నుంచీ చమురు, ఆహారం, ఆర్థిక సహాయం అందకుండా చూడాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగాను, పాక్ ఆగడాలను ప్రచారం చేయడంలోను మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. కొన్ని స్వదేశీ పత్రికలు మోదీ ప్రభుత్వంపై విషం కక్కుతున్నాయి. వాటిని అదుపుచేయాలి. మేధావులు, మానవ హక్కుల సంఘాల ముసుగులలో ఉన్న దేశద్రోహులను అరెస్టు చేయకపోతే వారు యుద్ధ సమయంలో శత్రువులకు సహాయం చేస్తారు. చైనా, పాక్ న్యూస్ చానళ్లను, పత్రికలను ఇండియాలో స్థానం లేకుండా చూడాలి. ఆర్మీకి తోడుగా ఇజ్రాయిల్ తరహాలో పౌర సైన్యాన్ని కోట్ల సంఖ్యలో సమీకరించాలి. ఏకకాలంలో ఇండియా, అమెరికా, రష్యా, ఫ్రాన్సు లాంటి దేశాలు పాకిస్తాన్‌పై దాడి చేయాలి. టెర్రరిస్టులను ఏరివేయటంతోపాటు వారికి మనీ లాండరింగ్ వంటి ప్రక్రియల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నవారి మూలాలు కూడా నిర్మూలించవలసి ఉంది.
‘మోస్ట్ ఫేవర్‌డ్ నేషన్’ హోదాను పాకిస్తాన్‌కు భారత్ ఉపసంహరించింది. దీనివల్ల పాకిస్తాన్ ఆర్థికమూలాలకు అంతా నష్టం ఉండదు. పాకిస్తాన్‌కు ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాలను స్తంభింపజేయటం ద్వారా మన ప్రతీకారం తీరుతుంది. పాక్‌లోని రావల్పిండిలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యాలయాన్ని క్షిపణుల ప్రయోగంతో ధ్వంసం చేయాలి. మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా చైనా గుర్తించి తీరాలి. లేకుంటే చైనా దిగుమతులను వెంటనే భారత్ నిలిపివేయాలి. విద్య, ఉపాధి కోసం చైనా, పాకిస్తాన్‌లకు వెళ్లిన కశ్మీర్ విద్యార్థులను వెనక్కి రప్పించాలి. ఆ తర్వాతే పాక్‌పై భారత్ మిలటరీ ఆపరేషన్ మొదలుపెట్టాలి. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ద్వారా పాకిస్తాన్‌ను ఏకాకి చేయాలనే దేశ ప్రజల ఆకాంక్ష వ్యక్తమయింది. అందుకు ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనే అంశాలు సైన్యం నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజలు నిర్ణయించేవి కొన్ని ఉన్నాయి. అగ్రరాజ్యాలు నిర్ణయించేవి మరికొన్ని ఇంకొన్ని ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించడమే విశ్వశాంతికి ఏకైక మార్గం.
*

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్