శిప్ర వాక్యం

అందమైన పేర్ల వెనక.. అరాచకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పేరులోనేమున్నది..? మల్లెను మల్లె అని గాక, మరొక పేరుతో పిలిచినా సువాసన తగ్గుతుందా?’ అన్నాడొక ఆంగ్లకవి. ప్రపంచంలో రకరకాల సంస్థలకు ఏవేవో పేర్లుంటాయి. వాటినిబట్టి మనం ఆ సంస్థ వౌలిక తత్త్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. కేరళలో ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థ ఉంది. పాపులర్ అంటే ప్రజాబాహుళ్యం ఆమోదం ఉన్న అని అర్థం. ఇందులో సభ్యులంతా ఉగ్రవాదులు, పచ్చిరక్తం తాగే కిరాతకులు. ఇప్పటికి వీరు ఐసిస్‌తో కలిసి కేరళలో ఇరవైఏడు హత్యలు చేశారు. ఇదొక పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ. ‘పాపులర్ ఫ్రంట్’ అనే మాట ఎంతో సౌమ్యంగా ఉన్నా, ఈ సంస్థ నిజ స్వరూపం ఉగ్రవాదం. ‘అల్‌ఖైదా’ అనే మాటకు ‘్భగవంతునికి సేవకుడు’ అని అరబ్బీ భాషలో అర్థం. భగవంతుడు ఉగ్రవాది కాదు. అతడు నిజంగా ఉగ్రవాది అయితే పాలకు బదులు ఆవుపొదుగు నుంచి రక్తం వచ్చేది. చెట్లకు మల్లెపూలకు బదులు బుల్లెట్లు పూచేవి. మరి దేవుని పేరుతో ఈ ఉగ్రవాద సంస్థ ఎలా అవతరించింది?
‘తాలిబన్’ అనే మాటకు విద్యార్థి అని అర్థం. తాలీమ్ అంటే చదువు-సంధ్యలు. ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థల్లో తాలిబన్ ఒకటి. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతికి పర్యాయపదమైన గౌతమబుద్ధుని అత్యున్నత విగ్రహాన్ని నేలకూల్చింది తాలిబన్లు. ఈ ఉగ్రవాద చర్య విద్యార్థుల పని అనుకుందామా? ఐసిస్ అంటే ఇరాక్ సిరియా సంస్థ. వీరి లక్ష్యం నేటికి 1500 సంవత్సరాలకు పూర్వం మక్కా మదీనాలలో ఉన్న వాహిబ్ ఇస్లామిక్ ఫండమెంటలిజం స్థాపన. వాహిబ్ అంటే ధ్యానం అని అర్థం. నరహత్యలు ధ్యానం కిందికి వస్తాయా? అభ్యుదయ రచయితల సంఘం అని ఒక తెలుగు రచయితల సంస్థ ఉంది. శ్రేయస్సు- అభ్యుదయం భారతీయ జీవన లక్ష్యం. ఇక్కడ అభ్యుదయం అంటే అది అర్థం కాదు. తీవ్రవాద భావజాలంలో సమాజంలో వర్గపోరాటాన్ని ప్రేరేపించే రచనలు చేయడం ఈ సంస్థ లక్ష్యం. విరసం అంటే రసహీనమైన, విప్లవ రచనలు చేయటం అని భావం. ప్రోగ్రెసివ్ ఫ్రంట్- ఫ్రీడం ఫ్రంట్- న్యూ డెమూక్రసీ వంటి పేర్లు వింటుంటాము. డెమొక్రసీ అంటే ప్రజాస్వామ్యం. న్యూ డెమొక్రసీ ‘అడవి అన్నలు’ పెట్టుకున్న అర్బన్ నక్సలైట్ల సంస్థ.
తెలుగుదేశం పార్టీలో కమ్మ, జనసేన పార్టీలో కాపు సామాజిక వర్గాల ఆధిపత్యం ఉంటుందనే ప్రచారం ఉంది. పుట్టిన కొన్నాళ్లకే అదృశ్యమైన ‘ప్రజారాజ్యం’ పార్టీలో సినీనటుడు చిరంజీవి అభిమానులు, కాపు కులస్థుల ప్రభావం ఎక్కువ అన్న మాట ఉండేది. ఇక వైకాపాలో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం, క్రైస్తవులు ఉన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసం, విదేశీ నిధుల కోసం కొందరు హిందువులు తమ మతాన్ని, పేర్లను మార్చుకుంటూ క్రైస్తవులుగా మారడం తెలిసిందే. రిజర్వేషన్ల ఫలాలను పొందేందుకు జనార్దన్ అనే పేరు గలవారు జాన్సన్‌లుగా మారతారు. కత్తి మహేశ్, కంచె ఐలయ్య వంటివారు హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాములవారిని తిట్టారు. రాముడు వీరికి ఏం అపకారం చేశాడు? అంటే హిందువులు రాముణ్ణి దేవుణ్ణిగా పూజిస్తారు కాబట్టి హిందూ విశ్వాసాలను అవమానించి క్రైస్తవ మత ప్రచారం చేయండి అని వీరికి వాటికన్ నుండి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అణగారిన సామాజిక వర్గాలను హిందూ మతానికి దూరం చేసే ప్రయత్నం దేశంలో ఏనాడో మొదలైంది. అందుకని టీటీడీ దేవస్థానం వారు దళిత గోవిందం అనే ఉద్యమం మొదలుపెట్టారు.
భీం-కోరెగామ్ అల్లర్ల సందర్భంగా అరెస్టుచేయబడిన రోనావిల్సన్ అనే అర్బన్ నక్సలైటు నాయకుని లాప్‌టాప్‌లో ఒక రహస్య లేఖ పూణె పోలీసులకు దొరికింది. దానిని వారు కోర్టుకు సమర్పించారు. అందులో రెండు ప్రధానాంశాలున్నాయి. హిందువులకు ప్రాధాన్యం వహించే నరేంద్ర మోదీని ఆయన మంత్రివర్గ సహచరుల్లో ముఖ్యులను ఎన్నికల రోడ్ షోలో హతమార్చాలి. దళితులను భారతీయ సమాజానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి సివిల్ వార్ సృష్టించాలి... ఇవీ వారి లక్ష్యాలు.
మహారాష్టల్రో శివసేన పార్టీ ఛత్రపతి శివాజీ పేరుమీద ఏర్పాటైంది. శివాజీ మహారాష్ట్ర వీరుడే అయినా ఆయన ఆశించింది కేవలం మహారాష్ట్ర సామ్రాజ్యం కాదు. మొగలుల నుండి భారతదేశాన్ని విముక్తం చేసి హిందువులను కాపాడాలని ఆయన అనుకున్నాడు. కాని శివసేన ముంబయి నుండి బిహారీలను, తమిళులను తరిమివేస్తున్నది. వామపక్ష పార్టీలకు చెందిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ సంస్థలు రష్యా, చైనా మార్గదర్శకాలతో నడుస్తుంటాయి. కోల్‌కతలో మిషనరీ ఛారిటబుల్ ట్రస్టు అనే సంస్థను మదర్ థెరిసా స్థాపించింది. దీని శాఖలు రాంచీ వంటి ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఈ శాఖల నుంచి శిశు విక్రయాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ నిర్వాహకురాలు నిర్మలను రాంచీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమెరికాలో చాలా తెలుగు సంస్థలున్నాయి. ఆటా-నాటా-బాటా-తానా-ఇలా చాలాచాలా పేర్లతో ఇవి పనిచేస్తున్నాయి. ఇటీవల మోదుగుపూడి క్రిష్ణ అలియాస్ చెన్నుపాటి రాజు ఆయన భార్య చంద్రకళ హైదరాబాద్ నుండి కళాకారిణులను అమెరికా తీసుకువెళ్లి వారితో అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వీరిని అమెరికన్ పోలీసులు పట్టుకున్నారు. అక్కడి శిక్షలు తీవ్రంగా ఉంటాయి. చెన్నుపాటి రాజుతో తమకు ఎటువంటి సంబంధాలు లేవని అమెరికా తెలుగు సంఘాలు ప్రకటించాయి. అగ్రిగోల్డ్, దివ్యశక్తి, శారదా వంటి సంస్థలు సామాన్య మానవుణ్ణి నిలువునా ముంచాయి. శారదా అంటే సరస్వతి. ఇదొక చిట్‌ఫండ్ కంపెనీ. దీనిని స్వయంగా బెంగాల్ ముఖ్యమంత్రిణి మమతాబెనర్జీ నడుపుతున్నది. ఈ కంపెనీ మునిగిపోవడంతో లక్షలాది మధ్యతరగతి ప్రజలు వీధినపడ్డారు. దివిసీమలో ఉప్పెన వచ్చి పాతిక వేల మంది తెలుగువారు కొట్టుకుపోయినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ సేవా కార్యకలాపాలు నిర్వహించింది. తమిళనాడులో వేళాంగిని అనేచోట క్రిస్టమస్ నాడు సునామీ వచ్చి క్రైస్తవులు సముద్రంలో కొట్టుకొనిపోతే సోనియాగాంధీ కన్నీళ్లు పెట్టుకొని వారిని ఆదుకున్నది. ఇవన్నీ చారిత్రకాంశాలు.
దాదాపు 14 మైనింగ్ లైసెన్సుల కుంభకోణాల్లో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఇరుక్కున్నాడు. అతనిని అరెస్టుచేస్తే ఉత్తరప్రదేశ్‌ను తగలబెడతామని సమాజ్‌వాదీ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. సోషలిస్టు పార్టీని రాంమనోహర్ లోహియా 1950వ దశకంలో స్థాపించారు. ఆయన గొప్ప దేశభక్తుడు. చాలా సరళ జీవనశైలి కలవాడు. ఆనాటి సోషలిస్టు పార్టీకి ఈనాటి సమాజ్‌వాదీ పార్టీకి ఎట్టి సంబంధం లేదు. ఇదొక అరాజక శక్తులకు అడ్డా.
అగ్రకులాలపై విద్వేషం ప్రకటించే మాయావతితో అఖిలేశ్ యాదవ్ ఎన్నికల పొత్తు పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. ఎన్నికల దృష్ట్యా అఖిలేశ్‌పై కేంద్రం కేసులు పెడుతోందని సమాజ్‌వాదీ నేతలు ఆరోపిస్తున్నారు. అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్‌పై పాకిస్తాన్ ఏజెంటు అనే ముద్ర ఉంది. ‘అయోధ్యలోని రామభక్తులను (కరసేవకులను) చంపితే పుణ్యం వస్తుంద’ని గతంలో పేర్కొన్న ములాయంకు ఎన్నికల సమయంలో మాత్రం హిందువుల వోట్లు కావాలి.
*

ప్రొ. ముదిగొండ శివప్రసాద్