శిప్ర వాక్యం

కేరళ రాష్ట్రంలో కల్లోలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశానికి పూర్తిగా దిగువన సాగర తీరంలో ఉన్న సుందర నందనవనం కేరళ. దీనిని పూర్వం తిరువాన్కూరు సంస్థానం అనే వారు. ఏలకులు, మిరియాలు పండే దేశం కాబట్టి దీనికి ‘మలై ఆలం’ అని పేరు వచ్చింది. ఇంతటి సుగంధ భరితమైన ప్రాంతాన్ని రాజకీయ నాయకులు మతాధిపతులు కలుషితం చేశారు. సిపియం ప్రేరణతో ఇక్కడ రాజకీయ హత్యలు నిత్యకృత్యంగా మారాయి. ఆ మధ్య ఒక ఫిలిం టివి నటి తనపై రాజకీయ నాయకుని కుమారుడు చేసిన అత్యాచారం కేసును పత్రికల దృష్టికి తీసుకొని వచ్చింది.
ఇక్కడ పిఎఫ్‌ఐ అనే ఉగ్రవాద జీహాదీ పార్టీ ఉంది. దీని పూర్తి పేరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఇది ఐఎస్‌ఐఎస్ లాంటిది. ఇక్కడ రిక్రూట్ అయిన కార్యకర్తలు రాష్టవ్య్రాప్తంగా హత్యాకాండను కొనసాగిస్తున్నారు. విచిత్రమేమంటే పినరాయ్ విజయన్ తన రాజకీయ అస్తిత్వంకోసం పిఎఫ్‌ఐ ముస్లిం లీగుల మీద ఆధారపడ్డాడు. వారు హత్యలు చేసినా చూచిచూడనట్లు ఊరుకోవాలి. కేసులు నమోదుచేయవద్దు అని పోలీసు అధికారులకు సిపియం ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి.
రోహిత్ అనే వడ్డెర సామాజిక వర్గానికి విద్యార్థి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని మానవ హక్కుల సంఘాలు దళిత సంఘాలు అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొనిపోయి భారతదేశంలోప్రజలకు మోడీ పాలనలో రక్షణ లేదు అంటూ యుఎన్‌కు ఫిర్యాదుచేశారు. కేరళలోని ముస్లింలీగ్ రోహిత్ తల్లి రాధికుకు 25 లక్షల ద్రవ్యనిధిని అందించింది. సిపియం నాయకులు ఈమెను దేశమంతా తిప్పి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలిప్పించారు. కేరళలో కన్నూరు జిల్లానుండి పినరాయ్ విజయన్ అనే నాయకుడు వచ్చాడు. ఈయన హత్యారాజకీయాల ద్వారా రాజ్యాధికారం చేజిక్కించుకోవాలనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మినవాడు. ముఖ్యంగా హిందూ సామాజిక సాంస్కృతిక సంస్థలకు చెందిన కార్యకర్తలను పెద్దసంఖ్యలో హత్యచేయించాడు. ఈ చనిపోయిన వారిలో జాలారి, దర్జీ, దళిత, సామాజిక వర్గాలకు చెందినవారు కూడా ఉన్నారు.
కేరళలో క్రైస్తవులు పెద్దసంఖ్యలో ఉన్నారు. కేరళ కాంగ్రెసు అనే రాజకీయ పార్టీ ఉంది. ఎ.కె.ఆంటోనీ లాంటి నాయకులు ఇక్కడినుండి వచ్చినవారే. క్రైస్తవ, ముస్లిం మైనారిటీవర్గాల మద్దతు లేకుండా అక్కడ కాంగ్రెసు లేదా కమ్యూనిస్టులు ప్రభుత్వం ఏర్పాటుచేయలేరు. ఓనం, దసరా వంటి హిందూ ఉత్సవాలపై ఈ వర్గాలు ఆంక్షలు విధించాయి. ప్రభుత్వ కార్యాలయాల ముందు ఓనం ముగ్గులు వేయరాదు అని పినరాయ్ విజయన్ శాసించాడు. భారతదేశంలో కార్పొరేటు విద్యారంగం వ్యాప్తిచెందింది. ముఖ్యంగా క్రైస్తవులు విద్యాసంస్థలను పెద్దఎత్తున స్థాపించారు. చర్చి, హాస్పటల్, స్కూలు మూడూ పక్కపక్కన అభివృద్ధి చెందాయి. మతం మార్పిడులకు ఈ సేవా కార్యక్రమాలు ముసుగుగా వాడుకున్నారు.
ఇటీవలి కాలంలో కేరళలో క్రైస్తవ సామాజిక వర్గం లైంగిక వేధింపుల కేసులలో ఇరుక్కున్నది. జెస్మీ అనే క్రైస్తవ సన్యాసినిపై ఒక బిషప్ అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆమె అందరికీ చెబితే జెస్మీకి తెల్లబట్టలతో రాత్రి కన్పడింది ఏసు ప్రభువు- అది తెలియక ఆమె ఎవరో బిషప్ వచ్చాడని భ్రాంతి పడింది అని చర్చి వ్యాఖ్యానించింది. జెస్మీకి పిచ్చిపట్టింది అని ఆరోపించి ఆమెను బహిష్కరించారు. జెస్మీ పూర్తి వివరాలతో రచించిన ఆత్మకథను పెంగ్విన్ ఆంగ్ల ప్రచురణ సంస్థ ఒక నవలగా ప్రచురించింది. ఇప్పుడు కేరళ ప్రభుత్వానికి చర్చి నిధుల దుర్వినియోగం కేసులు తలనొప్పిగా పరిణమించాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం మింగలేక కక్కలేక అల్లాడుతున్నది.
కురువి లండన్‌కు చెందిన ఒక క్రైస్తవ సన్యాసిని 30-6-2018నాడు బిషప్ ఫ్రాంకో ములక్కర్‌పై లైంగిక నేరారోపణ చేసింది. ఆయన కోర్టు కాథలిక్ మత శాఖకు (జలంధర్) చెందినవాడు. మే 2014 నుండి తనమీద ఫ్రాంకో ములక్కర్ అత్యాచారం చేస్తున్నాడని మొరపెట్టుకున్నది.
నీరనం (సిరియన్ ఆర్థాడాక్స్ చర్చి)లో ఐదుగురు మతాధికారులు పాప పశ్చాత్తాప ప్రకటన (కన్‌ఫెషన్) సందర్భంగా జరిపిన లైంగిక వేధింపులు మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
రిజూకుంజుక్కరన్ వెలుగులోకి తెచ్చిన ఈ అంశం కేరళ చర్చి అధిపతులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. కొట్టాయం జిల్లాకు చెందిన సిరియా మలబార్ చర్చిలో 42 ఏండ్ల బంగ్లాదేశీ లైంగిక అత్యాచారానికి గురిఅయింది. ఆర్చిడియోసియన్ మూవ్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పియెన్సీకి (ఎ.ఎం.టి.) చెందిన ఈ రిజూకుంజుక్కరన్ పోలీస్‌స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేసింది.
2018 జూన్ 22వ తేదీనాడు పోప్ ఫ్రాన్సిస్‌గారు ఈ ఉదంతం పరిశీలించి ఎర్నాకులం ఆర్చిబిషప్ అధికారులను పలక్కాడ్ ఆర్చిబిషప్ మర్‌జాకబ్ మరతోదత్‌కు బదలాయించారు. కన్‌ఫెషన్ అనేది చర్చి పశ్చాత్తాపకాండలో చాలా ముఖ్యమైన అంశం. ఒక గృహిణి పాప పరిహారార్థం కన్‌ఫెషన్ చేయగా ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి దుర్మార్గానికి ఒడికట్టడం తగునా? ఇలా లైంగిక వేధింపులు ఆర్థిక దుర్వినియోగాలు పత్రికలకు ఎక్కడంతో కేరళలో చర్చి అధికారులు కుడితిలోపడ్డ ఎలుకల వలె గిలగిల కొట్టుకుంటున్నారు. ఉత్తర భారతదేశంలో కొందరు బాబాల బాగోతం లోగడ వెలుగులోకి వచ్చినప్పుడు వీరంతా సంతోషించారు. రాం రహీం బాబాలవంటి వారి దురంతాలను చర్చి ప్రచారంకోసం ఉపయోగించుకుంది. ఇప్పుడు చర్చిలలో జరిగే ఈ లైంగిక వేధింపుల కేసులు కేరళ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసింది.
ఈ కేరళ ప్రభావం భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలోని చర్చి కార్యకలాపాల మీద కూడా పడుతుందని రోమన్ కేథలిక్ అధికారులు భయపడుతున్నారు.
కొద్దికాలం క్రితం గుజరాత్‌లోని అహమ్మదాబాద్ ఆర్చిబిషప్ ‘మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి’ అంటూ భారత రాజకీయాలల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నాడు. కేంద్రంలో భారత జాతీయ ప్రభుత్వం ఉంటే తమ మతం మార్పిడి కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని ఈ ఆర్చి బిషప్పులు భావించారు. ఎన్.జి.ఓ సంఘాలకు అందే నిధులను కేంద్రం ఆపివేయటంతో చర్చి అధికారులు క్లిష్టపరిస్థితిలో ఉన్నారు. ఇండియాలో క్రైస్తవులను వేధిస్తున్నారు అంటూ కేరళకు చెందిన అరుంధతీరాయ్ అనే లెఫ్టిస్టు అమెరికాకు వెళ్లి ప్రచారంచేసి వచ్చింది. ఇప్పుడీ ఆర్థిక అవినీతి లైంగిక వేధింపులు వెలుగులోకి రావటంతో కేరళ చర్చి అధికారులు ఎలా సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికలలో క్రైస్తవ-దళిత క్రైస్తవ వర్గాల ఓట్లమీద కాంగ్రెసు పార్టీ ఆశపెట్టుకున్నది. ఇప్పుడీ సంఘటనలు జరగటంతో తమ విజయావకాశాలు దెబ్బతింటాయని పార్టీవర్గాలు భయపడుతున్నారు. కేరళ ప్రభుత్వం ముఖ్యంగా తమిళనాడులోని చర్చిలపై పడుతున్నది. లోగడ తిరుక్కొరళ్ రచించిన తిరువళ్లువర్ జీసస్ క్రైస్ట్‌గారి పాదాల దగ్గర కూర్చొని జ్ఞాన బోధ పొందాడని సెర్మన్ ఆన్ ది వౌంట్ -తిరుక్కొరళ్ గ్రంథంగా మారిందని ప్రచారం చేశారు. ఇప్పుడు కేరళలో జరిగిన పరిణామాలు తమిళనాడులో క్రైస్తవ మతవ్యాప్తికి ఇబ్బందికరంగా మారింది. ఒక విశే్లషకుడు వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నాడు. ‘‘నిజానికి ఇవేవీ కొత్త విషయాలుకావు. చాలా దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. కేవలం ఇప్పుడు ఈ ఐదుగురు మతాధికారుల దుర్మార్గం పత్రికల దృష్టికి వచ్చింది- అంతే’’.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్