శిప్ర వాక్యం

ఈ ‘మత సంక్షోభం’ ఏ తీరానికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళలో చర్చి ఫాదర్ కుడక్కల్ అకాల మృతిపై అనుమానాల నీలినీడలు కమ్ముకున్నాయి. ఈయనది సహజ మరణం కాదు, ఎవరో హత్యచేశారన్న వాదనలు చోటుచేసుకున్నాయి. చర్చిలో ఫాదర్‌గా సేవలందిస్తున్న మంచి క్రైస్తవుణ్ణి ఎవరు, ఎందుకు చంపారు? దీని వెనుక ఒక కథ ఉంది. పంజాబ్‌లోని జలంధర్ మండల క్రైస్తవ అధిపతి ఫ్రాంకో ములక్కల్ కేరళలోకి వచ్చాడు. ఈయనకు ధనమూ, కీర్తి సమృద్ధిగా ఉన్నాయి. అటు కాంగ్రెస్ నేతలు, ఇటు కమ్యూనిస్టులు ఫ్రాంకో ములక్కల్ అనుగ్రహం కోసం ప్రాకులాడుతుంటారు.
ఓ క్రైస్తవ సన్యాసిని (నన్) ధైర్యంగా బయటకువచ్చి, ఎంతోమంది నన్స్‌పై ములక్కల్ అత్యాచారాలకు పాల్పడ్డాడని ఆరోపించింది. మరికొంతమంది బాధితులు ముందుకు వచ్చి ములక్కల్ చేస్తున్న దుర్మార్గాలను బయటపెట్టారు. తనపై ఇతను ముప్పదిసార్లు అత్యాచారం చేశాడని ఒకామె కేసుపెట్టింది. ఈ ఆరోపణలతో క్రైస్తవ ప్రపంచం నివ్వెరపోయింది. జార్జి అనే ఒక పెద్దమనిషి ‘ఈ వేశ్యల మాటలకు విలువ ఏమిటి?’అని ఫ్రాంకో ములక్కల్‌ను వెనుకేసుకొని వచ్చాడు. ఫాదర్ కుడక్కల్ మాత్రం ఫ్రాంకో నేరస్థుడేనని సాక్ష్యం ఇచ్చాడు. కీలక సాక్షి కుడక్కల్ ఆకస్మికంగా మరణించడం సంచలనం రేపింది. నిందితుడు ములక్కల్ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ములక్కల్‌తోబాటు మరో నలుగురు బిషప్పులపై కూడా కేరళ హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి.
నిజానికి ఇలాంటి సంఘటనలు గతంలోనూ ఎన్నో జరిగాయి. ఐతే, మత ప్రచారకులు వాటిని వెలుగుచూడకుండా తొక్కిపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా హవా ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో మతం మార్పిడులు, క్రైస్తవ సమాజంలో అరాచకాలు పెచ్చుమీరిపోయాయని మిగతా పక్షాల ఆరోపణ. విదేశాల నుండి వచ్చే భారీ నిధులతో సేవాకార్యక్రమాల ముసుగులో మతం మార్పిడుల కార్యక్రమం ఒక ఉద్యమంగా సాగింది. ఇందుకు ‘వాటికన్ సిటీ’ పెద్దల ప్రోత్సాహం కూడా ఉందన్న ఆరోపణలు లేకపోలేదు.
కేరళలో రాజకీయ హత్యలు కొత్తకాదు. సిపిఐ, సిపిఎం కార్యకర్తలు గత యాభై సంవత్సరాలుగా హత్యా రాజకీయాలు సాగిస్తూనే ఉన్నారు. 1960వ దశకంలో జరిగిన రామకృష్ణ అనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్యలో సిపిఎంకు చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన ముద్దాయి. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించండనేది కమ్యూనిస్టుల మూ ల సిద్ధాంతం. అందుకనే కేరళ, బెంగాల్, ఝార్ఖండ్, త్రిపుర రాష్ట్రా ల్లో కమ్యూనిస్టులు జరిపే హత్యా రాజకీయాలకు ప్రజలు ‘అలవాటు’ పడ్డారు. ఐతే- మతవ్యాప్తి కోసం క్రైస్తవులు సైతం హత్యలు చేస్తారని ఇప్పుడిప్పుడే దేశ ప్రజలకు తెలుస్తున్నది. నన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వాటితో పోల్చి చూచినప్పుడు ఫ్రాంకో ములక్కల్ ఉదంతం ‘టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్’లాంటిది. బెయిల్‌పై బయటకువచ్చిన ఫ్రాంకో తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను నిర్మూలించటం మొదలుపెట్టాడనేది ఆరోపణ.
ప్రస్తుతం క్రైస్తవ ‘నన్స్’ వ్యవస్థ సంక్షోభంలో ఉంది. పూర్వం హిందూ సమాజంలో దేవదాసీలు ఆలయ సేవికలుగా ఉండేవారు. వీరు అవివాహితలు. కాలక్రమేణా ఈ వ్యవస్థ భ్రష్టుపట్టింది. క్రైస్తవ సమాజంలో ఈ సన్యాసినీ వ్యవస్థ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి పరిష్కారం ఏమిటి? వివాహితులే మత ప్రచారంలోకి వస్తే ఇలాంటి లైంగిక వేధింపులకు అడ్డుకట్ట పడుతుందా?
***
కేరళకు చెందిన అయ్యప్ప దేవాలయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. ‘ఇండియాలో అయోధ్య వివాదం వలె అయ్యప్ప వివాదం మొదలైంది..’ అని పతాక శీర్షికలు పెట్టి విదేశీ పత్రికలు వార్తలు ప్రచురించాయి. ఇంతకూ ఈ వివాదాంశంలోని లోతుపాతులను అరమరికలు లేకుండా పరిశీలించడానికి ఎవరూ ప్రయత్నించటం లేదు. అందరూ తమ తమ రాజకీయ కోణాల నుండి రంగురంగుల కళ్లద్దాలతో చూస్తున్నారు. అయ్యప్ప ఆలయంపై సుప్రీం తీర్పు తర్వాత కేరళలో ఇపుడు పినరయి విజయన్ ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. ఇటీవల వచ్చిన వరదల్లో సరైన రీతిలో సహాయక చర్యలు అందించలేక వామపక్ష ప్రభుత్వం అపఖ్యాతి పాలైంది. దీనిని కాంగ్రెస్, బి.జె.పి. నాయకులు సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు అయ్యప్ప ఆలయం వివాదం వారికి మరొక రాజకీయ ఆయుధంగా మారింది.
అయ్యప్పస్వామి బ్రహ్మచారి. అందుకని ఆలయం లోపలికి యువతులకు ప్రవేశం లేదు. ఇదొక స్థానికాచారం. యాబది సంవత్సరాలు దాటిన స్ర్తిలకు మాత్రమే అయ్యప్ప సన్నిధిలోకి ప్రవేశార్హత ఉంది. ఇది చిరకాలంగా కొనసాగుతున్న మత సంప్రదాయం. దాదాపు నలభై రోజులు అయ్యప్ప భక్తులు కఠోర బ్రహ్మచర్యం పాటించి, నేలపై పడుకొని, ఇరుముడితో దైవదర్శనానికి వస్తారు. అప్పుడు యువతులు అక్కడికి వస్తే పురుష భక్తులు చిత్తచాంచల్యం కలుగవచ్చు. మహిళ ప్రవేశంపై ఆంక్షలకు ఇదొక కారణం. కొంతకాలంగా భారతదేశాన్ని విభజించాలనే ఉద్యమాలు నడుస్తున్నాయి. అందుకోసం ముస్లింలను, క్రైస్తవులను, దళితులను, స్ర్తిలను, విద్యార్థులను కొందరు ‘సెక్యులర్’ నేతలు రెచ్చగొడుతున్నారు. ఈ పనికి చైనా-పాకిస్తాన్ ఏజెంట్లు కూడా సహకరిస్తున్నారు.
ఉమెన్ లిబ్ మూవ్‌మెంట్ అమెరికాలో పుట్టి వైరస్‌లాగా ప్రపంచమంతా వ్యాపించింది. ఎంతో పురాతనమైన భారతీయ గృహవ్యవస్థ దీని కారణంగా విచ్ఛిన్నమయింది. స్ర్తిలకు సమస్యలు లేవు అనికాదు. కాని మత పరమైన కొన్ని వివక్షలు ఉన్నంత మాత్రాన వ్యవస్థలనే విచ్ఛిన్నం చేస్తామంటే ఎట్లా? చూరులో ఎలుకలు ఉన్నాయని ఇంటికే నిప్పుపెట్టడం అంటే ఇదే! తృప్తిదేశాయ్ మహిళా ఉద్యమ నేత. ఈమె ఎన్నిసార్లు దేవాలయాలకు వెళ్లింది? ఈమె వెనుక విదేశీ విచ్ఛిన్నకర శక్తులు ఉన్నాయనేది కొందరి ఆరోపణ.
‘మహిళలకు సమాన హక్కులు ఉంటాయని’ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. నిజమే! ఇందులో కొత్త ఏముంది? భారత రాజ్యాంగం స్ర్తి, పురుషులిద్దరికీ సమాన హక్కులు ప్రసాదించింది. అంతమాత్రాన పురుషులు గర్భధారణ చేసుకొని, స్ర్తిల బరువును తగ్గించలేరు కదా?? ‘దేవాలయాలలో దేవుళ్లకు మనుషులకు ఉన్నట్లే కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి’- అని లోగడ ఈ సుప్రీం కోర్టులోనే ఒక తీర్పు వెలువడింది. మరి అయ్యప్పస్వామి హక్కులను కూడా కాపాడవలసి ఉంటుంది. యాభై సంవత్సరాలు వచ్చేవరకు స్ర్తిలు అయ్యప్ప దర్శనం కోసం ఆగలేరా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మక్కా చూడాలనుకుంటున్న హిందువులను సౌదీ అరేబియా ప్రభుత్వం అనుమతిస్తుందా? ఇంతకూ న్యూ యార్క్ టైమ్స్‌కు చెందిన మహిళా విలేఖరికి అయ్యప్ప దేవాలయంతో ఏమిటి సంబంధం? నెత్తిమీద ఇరుముడి లేకుండా కాళ్లకు చెప్పులు వేసుకొని, చూయింగ్‌గమ్ నములుతూ ఈమె అయ్యప్ప దేవాలయంలోకి ప్రవేశించాలని ఎందుకు కోరుకుంటోంది? క్రైస్తవ సన్యాసినులపై అరాచకాలను అడ్డుకోలేని విజయన్ ప్రభుత్వం హిందూ మహిళలకు సమానత్వం ఇస్తామని అనడం విడ్డూరం. కేరళలో ప్రస్తుత వివాదానికి ‘హిందూ శక్తులు’ ఆజ్యం పోస్తున్నాయని వామపక్ష నేతలు ఎదురుదాడి చేయడం సమంజసమేనా? కేరళలో పరిస్థితులపై జీసస్ ప్రభువు, అయ్యప్ప కంట తడిపెడితే అక్కడ ఇటీవల వరదలు వచ్చాయని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల సంగతెలా ఉన్నా, ఆలయాలు పిక్నిక్ స్పాట్లు కావు, టూరిస్టు రిసార్టులూ కావు.. అని ‘అయ్యప్ప గుడి’ని వివాదంలోకి లాగుతున్న వారు గ్రహిస్తే ఏ సమస్యా ఉండదు.
*

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్