ఆంధ్రప్రదేశ్‌

చంద్రన్న తోఫా పంపిణీ 1 నుంచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 26 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉన్న ప్రతి ముస్లిం కుటుంబానికి ‘చంద్రన్న రంజాన్ తోఫా’ కిట్లను పంపిణీ చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రులు పల్లె రఘునాథరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి పల్లె ఆదివారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రంజాన్‌తోఫా పంపిణీపై సమీక్షించారు. ఈ సందర్భంగా రంజాన్ తోఫా పంపిణీ ఏర్పాట్లపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఫోన్ ద్వారా సూచనలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జూలై 1వ తేదీ ఉదయం 10 గంటలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాలన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఆయా స్టోర్ డీలర్లు, ఎంపిపి, జెడ్పీటిసి, సర్పంచ్‌లతో పంపిణీ చేపట్టాలని సూచించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల మరమ్మతులకు ఒక్కో జిల్లాకు రూ. 30 లక్షల చొప్పున మొత్తం రూ. 3.9 కోట్లు సిఎం మంజూరు చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మసీదులకు రూ. 10 వేలు, మండల కేంద్రాల్లో ఉన్న వాటికి రూ. 15 వేలు, మున్సిపల్ పరిధిలోని మసీదులకు రూ. 20వేలు చొప్పున ఇస్తామన్నారు. వక్ఫ్ బోర్డు గుర్తింపు ఉండి అతి తక్కువ ఆదాయం వస్తున్న మసీదుల్లో పని చేస్తున్న ఇమామ్‌లకు రూ. 5వేలు, మోజెలకు రూ. 3వేల మేరకు గౌరవ వేతనం అందించాలని కలెక్టర్లకు సూచించారు.
వీటిని ఆయా జిల్లాల్లో ఇఫ్తార్ విందు రోజున గానీ, లేదా ప్రత్యేకమేళా చేపట్టి పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడి చెరువులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓడి చెరువు, అమడగూరు, నల్లమాడ మండలాల రైతులకు మంత్రి పల్లె రుణమాఫీ ఉపశమన పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తూచ తప్పక అమలు చేస్తామన్నారు. రైతు కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సిఎం చంద్రబాబు ధ్యేయమన్నారు. రాష్ట్రంలో రూ. 697 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ వస్తే, అందులో ఒక్క అనంతపురం జిల్లాకే రూ. 567 కోట్లు మంజూరు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అలాగే పంటల సంరక్షణకు రాష్ట్రంలో 11 వేల రెయిన్ గన్నులు పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రూ. 450 కోట్లు విడుదల చేశారని, దాని ద్వారా జిల్లాలోని అన్ని చెరువులకు నీరందించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.

ఎసిటిఒకు ఘన స్వాగతం
జగ్గయ్యపేట రూరల్, జూన్ 26: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే కృషికి ఉద్యోగులు, అధికారులు అందరూ సంపూర్ణ సహకారం అందించి అంకితభావంతో పని చేస్తామని అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారి (ఎసిటిఒ) మందడపు పద్మ చౌదరి అన్నారు. హైదరాబాద్‌లో ఎసిటిఒగా పనిచేస్తున్న పద్మ చౌదరి అక్కడి నుండి ప్రారంభించిన సైకిల్ యాత్ర ఆదివారం సాయంత్రం జిల్లా సరిహద్దు గరికపాడు చేరుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, స్థానికులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాదులో తాను పనిచేసిన కాలంలో అక్కడి ఉద్యోగులు, ప్రజలు స్నేహభావంతో సహకరించారని అన్నారు. చారిత్రక ప్రదేశమైన అమరావతిని ఎపి రాజధానిగా నిర్ణయించడం, శాఖల తరలింపులో భాగంగా అమరావతికి తొలిసారిగా వెళుతున్నందున తాను సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ రెండు రోజుల యాత్రలో తెలంగాణ ప్రాంత వాసులు మంచి ఆదరణ చూపించారని, సరిహద్దులో తనకు అపూర్వ స్వాగతం పలకడం అదృష్టంగా పేర్కొన్నారు.