తెలంగాణ

సరైన ధ్రువపత్రాలుంటేనే గల్ఫ్‌లో అడుగుపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 12: ఇంటి పనుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే మహిళలు వీసా, పాస్‌పోర్టు, వర్క్ పర్మిట్ తదితర ధ్రువపత్రాలు సరిగా ఉంటేనే వెళ్లాలని, లేకపోతే వెళ్లవద్దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం మహిళలకు సూచించారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లైసెన్స్ లేని ఏజెంట్లను నమ్మి పేద మహిళలు గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ అనేక వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. ఈ విషయంలో మహిళల రక్షణ కోసం తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఇంటి పనుల కోసం విదేశాలకు వెళ్లే మహిళలకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని, ఎవరి ఇంట్లో పనిచేస్తున్నారో ఆ ఇంటి చిరునామా ఎంబసీ వద్ద ఉండాలని కోరినట్లు తెలిపారు. ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీలో వీరి వివరాలు నమోదు చేసుకుని తరచూ పర్యవేక్షించాలని, పనివారికి చెల్లించే జీతాలు ఎంబసీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధంగా చూడాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.