రివ్యూ

సైనిక వ్యవస్థపై సామాన్యుడి యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎయిర్‌లిఫ్ట్
*** బాగుంది

తారాగణం:
అక్షయ్‌కుమార్, నిమ్రత్ కౌర్, కుముద్ మిశ్రా, పూరబ్ కోహ్లి, ఇనాముల్‌హక్ తదితరులు
సంగీతం: అరిజిత్ దత్తా
సినిమాటోగ్రఫీ:
ప్రియా సేత్
దర్శకత్వం:
రాజా మీనన్

ఏ కథ అయినా- స్క్రీన్‌పై అందంగా పరచుకోవాలంటే- కథకి తగిన స్క్రీన్‌ప్లే ఉండాలి. అదీగాక సజీవ సంఘటనల సమాహారాన్ని వెలువరించాలంటే ఇంకొంచెం ఎక్కువే ఉండాలి. చరిత్ర తాలూకు యధార్థ దృశ్యాలు మనసులోకి చొరబడేలా చేయటానికీ- ఆయా సన్నివేశాలు అనుభూతుల దొంతరల్లో నాటుకోవటానికీ దర్శకుడూ, కథానాయకుడూ ఎంతగా శ్రమించాలో-శ్రమించారో.. ‘ఎయిర్ లిఫ్ట్’ చూస్తే తెలుస్తుంది. వాస్తవిక కథకి ‘మెలోడ్రామా’ ఉండదు. అలా నాటకీయత లేకుండా తీసినా.. డాక్యుమెంటరీలా మారుతుంది. ఈ రెండింటి మధ్యనున్న ‘వ్యత్యాసం’ అర్థం చేసుకొన్న రాజా మీనన్ ఈ సినిమా ఆకాశపు అంచులు తాకేలా చేశాడు.
కథ -కువైట్‌లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త రంజిత్ కత్యాల్ (అక్షయ్‌కుమార్) తన భార్య పిల్లలతో ఇండియాకి తిరిగి రావటానికి అన్ని ఏర్పాట్లూ చేసుకొంటాడు. ఆ అందమైన సాయంత్రం బెల్లీ డాన్స్‌తో.. వైన్ గ్లాసుల గలగలలతో ఎంతో ప్రశాంతంగా ఆరంభమవుతుంది. ఆ రోజు ఆగస్ట్ 1, 1990. ఇరాకీ సైన్యం కువైట్‌పై దాడి చేసిన రోజు. కువైట్‌లో నివసిస్తున్న లక్ష పైచిలుకు భారతీయులకు చేదు అనుభవాన్ని మిగిల్చిన రోజు. ఆనందోత్సాహాలతో సాగే వారి జీవితాల్లో అనుకోని మలుపు. ఆ సాయంత్రం విషాదఛాయలు అలముకొని.. రంజిత్ జీవితాన్ని ఎటువైపు పయనించేలా చేసిందో చాటిన రోజు.
తన స్వార్థం చూసుకొని -్భర్యాపిల్లల్తో కువైట్ నుంచీ ఏదో రీతిన భారతదేశానికి తిరిగి వెళ్లొచ్చు. కానీ- తన కుటుంబం కంటే దేశం ముఖ్యం.
భారతీయులు, వారి జీవితాలు ముఖ్యం అనుకొని వారందరినీ ఇండియా రప్పించటానికి ‘రంజిత్’ అనే ఓ సామాన్యుడు సైనిక వ్యవస్థపై చేసిన తిరుగుబాటు ప్రధాన ఇతివృత్తం. పూర్తి యాక్షన్ చిత్రం. సన్నివేశాలన్నీ తెరపై ఒక్కొక్కటిగా కదలి వెళ్తూ ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. హాలీవుడ్ చిత్రం చూస్తున్నామా? అన్న భ్రాంతి కలుగుతుంది. ఇరాక్ -కువైట్ చరిత్రలో జరిగిన యుద్ధాన్ని కళ్లకు కట్టేందుకు చేసిన ప్రయత్నమిది. గల్ఫ్‌లో సద్దాం హుస్సేన్ తాలూకు నీలి నీడల్ని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రం. మధ్య ఈశాన్య ప్రాంతంలో 1990లో నెలకొన్న పరిస్థితులను మనసు తెరపై నిలిపే చిత్రమిది. ఈ చిత్రం గురించి ప్రత్యేకించి విమర్శించానికీ.. విశే్లషించటానికి ఏమీ లేదు. చిత్రమంతా ‘వన్ మేన్ ఆర్మీ’లా నడుస్తుంది.
అక్షయ్‌కుమార్ ఈ చిత్రానికి డబుల్ ప్లస్. యుద్ధం పట్ల.. సమాజం పట్ల.. రాజకీయ అనిశ్చితి.. అధికారుల నిర్లిప్తత పట్ల ఏవగింపు.. తన అసహనాన్నీ.. వేదననీ హావభావాల్లో చక్కగా ప్రదర్శించాడు. అక్షయ్‌కీ.. నిమ్రత్ కౌర్‌కీ మధ్య ‘కెమిస్ట్రీ’ బాగా వర్కవుట్ అయింది. భర్త చేయబోయే సాహసోపేత నిర్ణయానికీ.. ఒక్కడూ ఒక సైన్యంపై తిరుగుబాటు ఎలా చేస్తాడన్నది.. ముఖంలో బాగా ప్రకటించింది.
ఒక చరిత్ర తాలూకు చేదు అనుభవాన్ని నెమరువేసుకోవాలన్నా.. ఒక మంచి యాక్షన్ చిత్రాన్ని చూశామన్న అనుభూతికి లోనవ్వాలన్నా.. ‘ఎయిర్‌లిఫ్ట్’ ఓకే. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకండా.. ఉన్న నిజాన్ని ఉన్నదున్నట్టు చూపటంలో దర్శకుడు తన శైలిని చూపాడు. స్క్రీన్‌ప్లేకి తగ్గట్టు నేపథ్య సంగీతం చక్కగా సమకూరింది.

-ప్రనీల్