Others

శునకాలతో యోగా విన్యాసాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శారీరక, మానసిక ఉల్లాసానికి ఉదయానే్న యోగాసనాలు వేయడం అందరికీ తెలిసిందే. అయితే, పెంపుడు శునకాలతో కలిసి ‘యోగా’ చేయడం ఇపుడు చాలాదేశాల్లో సరికొత్త ‘క్రేజ్’గా మారింది. శునకాలతో కలిసి యోగా విన్యాసాలు చేయడాన్ని ‘డోగా’ అని వ్యవహరిస్తున్నారు. హాంకాంగ్‌లో సోమవారం నాడు 270 మంది యజమానులు తమ పెంపుడు శునకాలతో కలిసి పలురకాల యోగాసనాలు ప్రదర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. సుమారు గంటసేపు జరిగిన ఈ విన్యాసాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. పెంపుడు జంతువులతో కలిసి యోగాసనాలు వేయడం వింత అనుభూతిని కలిగిస్తుందని, వాటితో మన అనుబంధం మరింతగా పెరుగుతుందని ప్రముఖ ‘డోగా’ శిక్షకురాలు సుజెట్టె అకెర్మన్ అంటున్నారు. హాంకాంగ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ‘డోగా’కు ఆదరణ పెరుగుతోందంటున్నారు. దైనందిన జీవితంలో అలసట, ఒత్తిళ్లకు గురయ్యేవారు పెంపుడు జంతువులతో కొంతసేపు గడిపితే మానసిక విశ్రాంతి లభిస్తుందని ఆమె చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం వేళ ఓ గంటసేపు పెంపుడు జంతువులతో గడిపితే అందులోని ఆనందం అనుభవ పూర్వకంగా తెలుస్తుందని ఆమె భరోసా ఇస్తున్నారు. మనతో పాటు పెంపుడు జంతువులకూ శారీరక శ్రమ ఎంతో అవసరం అని సుజెట్టె చెబుతున్నారు. టీవీ, ఇంటెర్నెట్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లతో గంటలకొద్దీ కాలక్షేపం చేసేవారు పెంపుడు జంతువులతో కొద్దిసేపైనా ఆత్మీయంగా గడపాలని ఆమె సలహా ఇస్తున్నారు. ‘డోగా’తో ప్రపంచ రికార్డు సృష్టించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, పెంపుడు శునకాలతో అనుబంధాన్ని పెంచుకునేందుకు ఇది ఒక అద్భుత అవకాశమని ఈ ప్రదర్శనలో పాల్గొన్న సుశాన్ చాన్ ఉబ్బితబ్బిబ్బవుతోంది. తాము సాధించిన ఘనతను ప్రపంచం అంతా చూసిందని, ‘గిన్నిస్ రికార్డు’ రావడం లాంఛన ప్రాయమేనని ‘డోగా’ నిర్వాహకులు ప్రకటించారు. గత ఏడాది జనవరి 25న సాన్ డీగోలో 265 పెంపుడు శునకాలతో నమోదైన ‘డోగా’ రికార్డును ఇపుడు తాము అధిగమించామని వారు చెబుతున్నారు. ‘హాంకాంగ్ గైడ్ డాగ్ అసోసియేషన్’ నిబంధనల ప్రకారం ‘డోగా’ విన్యాసాల ప్రదర్శన జరిగిందని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. *