ఆంధ్రప్రదేశ్‌

రైతుల కష్టాలు తీర్చేందుకే రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: గత ఎన్నికల ముందు తాను పాదయాత్ర చేసిన సందర్భంగా రైతుల కష్టాలను స్వయంగా చూశానని, కొందరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. రైతులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకే రుణమాఫీని అమలు చేస్తున్నామని ఆయన ఒంగోలులో బుధవారం రెండో విడత రుణమాఫీ పత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా వివరించారు. రెండో విడత రుణమాఫీలో 3,500 కోట్ల రూపాయలను రైతులకు అందజేస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే రైతులకు రుణాలు, ఎరువులు, పురుగు మందులు, మార్కెటింగ్ సౌకర్యాలు, గోదాములు వంటివి అందుబాటులో ఉంచాలన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని రైతులు లాభాలను ఆర్జించాలన్నారు.