రుచి

క్యాప్సికంతో కమ్మని బ్రేక్‌ఫాస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యాప్సికం ఒక కమ్మని కూర. వంకాయలాగే ఇందులో కూడా వివిధ పదార్థాలను కూర్చి కమ్మని వంటలు వండుకోవచ్చు. ఇలాంటివి చాలా రకాలు మీరు ట్రై చేసుంటారు. ఈ కొత్తరకం మరింత ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి చూడండి.

ఇడ్లీ స్ట్ఫడ్ క్యాప్సికం

కావాల్సిన పదార్థాలు
క్యాప్సికంలు - 4
ఇడ్లీ పిండి - 6 గరిటలు
మిరపపొడి - అర టీ స్పూను
ఉప్పు - రుచికి సరిపడినంత
కొత్తిమీర - ఒక కట్ట
నూనె - రెండు టీ స్పూన్లు

క్యాప్సికంలను శుభ్రంగా కడిగి, తొడిమలను ట్రిమ్ చేసి, ఒక్కో క్యాప్సికంను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు ఎనిమిది ముక్కలు లేదా క్యాప్సికం కప్పులున్నాయన్నమాట. వీటిలో గింజలు తీసేయండి. అన్ని కప్పుల్లో ఇడ్లీపిండిని సమానంగా సర్దండి. ఇడ్లీ పిండితో ఉన్న క్యాప్సికం కప్పులను జాగ్రత్తగా ఇడ్లీ పళ్ళెంలో పెట్టండి (క్యాప్సికంల సైజువల్ల ఇడ్లీ ప్లేట్స్ అన్నీ సెట్ అవకపోతే ఒకటి రెండు ప్లేట్స్ తీసి పక్కన పెట్టుకోండి). ఇడ్లీ పిండి నిండిన క్యాప్సికం కప్పులను ఇడ్లీ పాత్రలో పెట్టి సుమారు పది నిమిషాలు ఇడ్లీలాగే ఉడికించండి. క్యాప్సికం కప్పుల్లోని పిండి ఉడికి ఇడ్లీ అయ్యాక దింపేయండి. కప్పులు కొద్దిగా వేడి తగ్గాక వాటిని నిలువుగా కట్ చేయండి.
వెడల్పాటి బాండీలో రెండు టీ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కుతుండగా, కట్ చేసుకున్న క్యాప్సికం ఇడ్లీ ముక్కలను వేసి, స్టవ్ సిమ్‌లో పెట్టి, మీ టేస్ట్‌ను బట్టి 2 నుండి 5 నిమిషాలపాటు, నిదానంగా వేపండి. దింపే ముందు మిరప్పొడి చల్లి, స్ట్ఫ్ ఆఫ్ చేసి, ఇంకో అర నిమిషంపాటు స్పూనుతో తిప్పండి. కొత్తిమీర కట్ చేసి చల్లండి.
పళ్ళెంలోకి తీసుకుని మీ ఫేవరిట్ చట్నీ లేదా సాస్‌తో తింటే రుచిగా ఉంటాయ.

టొమాటోతో...

నూనెలో క్యాప్సికం ఇడ్లీ ముక్కలతోపాటు నాలుగు స్పూన్లు తరిగిన టొమాటో ముక్కలు వేయండి. రెంటినీ ఒకటి రెండు నిమిషాలు ఎక్కువసేపు వేయించండి. అంతే, ఇడ్లీ క్యాప్సికం ఫ్రైతో టమాటా రెడీ. ఇది కూడా రుచిగా ఉంటుంది.