రుచి

పుచ్చకాయతో పెరిగే సౌందర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవికాలంలో పుచ్చకాయలకు మంచి గిరాకీ వుంటుంది. శరీరానికి చల్లదనం కలిగించటమే కాక దాహార్తిని కూడా ఈ పుచ్చకాయ తీరుస్తుంది. అంతేకాక, చర్మ సౌందర్యానికి, ముఖ సౌందర్యానికి పుచ్చకాయ ఎంతో మంచిది. ఒక కప్పు పైతొక్క, గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు, ఒక చెంచా కలబంద జెల్ తీసుకుని బాగా కలిపి ముఖానికి రాసుకుని రెండు నిముషాలపాటు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల ముఖ కాంతి పెరిగి వెలిగిపోతున్నట్లవుతుంది. రెండు అరటిపండ్ల ముక్కలకు, రెండు చెంచాల పుచ్చకాయ గుజ్జు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15-20 నిముషాల తరువాత కడిగేసుకోవాలి. ఈ విధంగా చేయడంవల్ల ఎండిపోయినట్లుగా వుండే ముఖం, ముఖ చర్మం మృదువుగా మారి మెరుస్తుంది. జిడ్డు చర్మం సమస్యతో బాధపడేవారు రెండు చెంచాల పుచ్చకాయ ముక్కల గుజ్జుకు, ఒక చెంచా పెరుగు కలిపి ముఖానికి పట్టించుకుని కొంచెంసేపటి తరువాత కడిగేసుకుంటే, ముఖంపైన వుండే జిడ్డు పోయి, ముఖానికి మంచి నిగారింపు వచ్చి ముఖారవిందం పెరుగుతుంది. కొందరికి ముఖ చర్మంపైన పసుపురంగు మచ్చలుంటాయి. వీటివల్ల వారు నలుగురిలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడతారు. ఇందుకోసం ఒక చెంచా ఆవపొడికి, ఒక చెంచా పుచ్చకాయ ముక్కల రసం కలిపి ముఖానికి రాసుకుంటే, ఆ మచ్చలు పోయి ముఖం కాంతిమయమవుతుంది. ఎండిపోయినట్లుగా వుండే కురులు పట్టుకుచ్చులా మారాలంటే పుచ్చకాయ గింజలు, పెసర పిండి, శీకాయ 100 గ్రా. చొప్పున, ఇంకా 20 గ్రాముల వట్టివేరులు (ఎండబెట్టినవి) పిండిలా విసిరించుకుని ఈ మిశ్రమ పిండితో వారానికి ఒకసారి తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మారిపోతుంది. ఒక కప్పు పుచ్చకాయ రసం తీసుకుని అందులో దూదిని నానబెట్టాలి. కొంచెం సేపటి తరువాత ముఖంపైన ఆ దూదితో గట్టిగా ఒత్తుకోవాలి. పది నిముషాల తరువాత ముఖం కడుక్కోవాలి. ఈ విధంగా రోజూ చేస్తూంటే వయసుపైబడిన కారణంగా ముఖంలో ఏర్పడే ముడతలూ అవీ పోతాయి. ముఖానికి కొత్త నిగారింపు వస్తుంది.

- మనస్విని