రుచి

వానల్లో.. వేడి వేడి సమోసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనుకుంటారు. బజ్జీలు, పకోడీలు, సమోసాలు, చాట్.. ఇలా వర్షపు జల్లుల్లో వేడివేడిగా తింటుంటారు. అయితే ఈ ఆహార పదార్థాలను బయట తినడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. పైగా షాపుల వాళ్లు ఏఏ ఆయిల్స్, ఆహారపదార్థాలు వాడతారో, ఎలా తయారుచేస్తారో అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందువల్ల ఈ సమోసాలను ఇంట్లోనే తయారుచేసుకుంటే వర్షపు జల్లుల్లో ఆనందంగా సమోసాలు ఆస్వాదించవచ్చు. ఆరోగ్యానికీ ఆరోగ్యం. మరి ఈ సమోసాలు ఇంట్లో ఎలా తయారుచేయాలో చూద్దామా!

చికెన్‌తో..

కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ : అరకిలో మైదా: ఒకటిన్నర కప్పు, గోరువెచ్చని నీళ్లు: పిండి కలిపేందుకు సరిపడా.., ఉల్లిపాయలు: మూడు, పచ్చిమిర్చి: ఐదు అల్లం తరుగు: రెండు చెంచాలు, పసుపు: పావు చెంచా మిరియాలపొడి: అర చెంచా, చికెన్ మసాలా: రెండు చెంచాలు, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర: ఒక కట్ట, నూనె: వేయించేందుకు సరిపడా
తయారీ విధానం: ఒక గినె్నలోకి మైదాను తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, చెంచా నూనె వేసి కలపాలి. తరువాత గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై బాణలిని పెట్టి రెండు చెంచాల నూనెను వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి బంగారు రంగులోకి మారాక, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. రెండు నిముషాలు వేయించాక పసుపు, మిరియాలపొడి, చికెన్ మసాలా, ఉడికించి సన్నగా కోసి పెట్టుకున్న చికెన్‌ను వేసి వేయించాలి. చికెన్ మెత్తగా కలిసిపోయిన తరువాత తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాణలిని దించేయాలి. దీన్ని చల్లారనివ్వాలి. పక్కన ఉంచిన మైదాపిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని చపాతీలా వత్తుకోవాలి. ఈ చపాతీని కత్తితో నిలువుగా కోయాలి. అందులో ఒక భాగాన్ని త్రికోణాకృతిలో చుట్టి అందులో రెండు చెంచాల చికెన్ మసాలాను ఉంచి అంచుల్ని మూసేయాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా సమోసాల్లా తయారుచేసుకున్న తరువాత కాగుతున్న నూనెలో ఈ సమోసాలను వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి. అంతే.. రుచికరమైన, ఆరోగ్యవంతమైన చికెన్ సమోసాలు రెడీ!

చిరుధాన్యాలతో..

కావలసిన పదార్థాలు: మైదాపిండి: పావుకిలో, పెసలు: పావు కప్పు, రాజ్మా: పావు కప్పు, సెనగలు: పావు కప్పు, మినుములు: పావు కప్పు, బొబ్బర్లు: పావు కప్పు, పచ్చి బఠాణీ: పావు కప్పు, గరంమసాలా: టేబుల్ స్పూన్, నిమ్మరసం: కొద్దిగా, ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: ఐదు, అల్లం వెల్లుల్లి ముద్ద: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా..
తయారీ విధానం: ముందుగా మైదాలో కొంచెం ఉప్పు, కాస్త నూనె, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. పెసలు, రాజ్మా, సెనగలు, మినుములు, బొబ్బర్లు, పచ్చి బఠాణీలు అన్నీ ఉడికించుకుని ఉంచాలి. తరువాత బాణలిని స్టవ్‌పై ఉంచి రెండు చెంచాలు నూనె పోయాలి. నూనె వేగాక ఉల్లిపాయల ముక్కల్ని వేసి రెండు నిముషాలు వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కల్ని వేయాలి. ఇవి వేగాక అన్ని రకాల పప్పుల్ని వేసి ఉప్పు, గరంమసాలా వేయాలి. తరువాత దీనిలో కాస్త నిమ్మరసం కలపాలి. తరువాత మైదాపిండిని చపాతీల్లా ఒత్తుకుని, దాన్ని సగానికి కోసి కోన్‌లా చుట్టుకోవాలి. అందులో వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని ఉంచి అంచుల్ని తడిపి మూసేయాలి. ఇలా అన్ని సమోసాలను చేసుకుని కాగుతున్న నూనెలో ఈ సమోసాలను వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యవంతమైన చిరుధాన్యాల సమోసాలు తయారు.

అటుకులతో..

కావలసిన పదార్థాలు: మైదా: ఒకటిన్నర కప్పు, ఉప్పు: తగినంత, నిమ్మరసం: ఒకటిన్నర చెంచా, ఉల్లిపాయలు: రెండు కారం: అరచెంచా, అటుకులు: అరకప్పు, కొత్తిమీర: ఒక కట్ట, నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం: ఒక గినె్నలో మైదా, ఉప్పు, నిమ్మరసం, నూనెను వేసి గోరువెచ్చని నీళ్లతో చపాతీపిండిలా కలుపుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి అందులో రెండు చెంచాల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేయాలి. అవి ఎర్రగా వేగాక కొద్దిగా ఉప్పు, కారం వేసి దించేయాలి. తరువాత ఇందులో అటుకులు, కొత్తిమీర తురుము వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మైదాపిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఈ చపాతీలను మధ్యకు కోసం కోన్ షేప్‌లో చేసుకుని అందులో అటుకుల మిశ్రమాన్ని ఉంచి సమోసాల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనెపోసి కాగాక చేసుకున్న సమోసాలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే.. ఎంతో రుచికరమైన అటుకుల సమోసాలు రెడీ..

చైనీస్ సమోసా

కావలసిన పదార్థాలు: మైదా: కప్పు, గోరువెచ్చని నీళ్లు: పిండి కలపడానికి సరిపడా, నూడుల్స్: కప్పు, క్యారెట్ తురుము: కప్పు, ఉల్లితురుము: కప్పు, క్యాబేజీ తురుము: రెండు కప్పులు, సోయాసాస్: ఒక చిన్న చెంచా, అజినిమోటో: అర చెంచా, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం: ఒక గినె్నలో మైదాపిండి, ఉప్పు, నూనె వేసుకుని గోరువెచ్చని నీళ్లతో చపాతీపిండిలా కలుపుకోవాలి. నూడుల్స్‌ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచుకుని అందులో రెండు స్పూన్ల నూనెను వేసి వేగాక క్యాబేజీ, ఉల్లి, క్యారెట్ తరుము, అజినిమోటో వేసి బాగా వేయించాలి. తరువాత ఇందులో నూడుల్స్, సోయాసాస్, ఉప్పు వేసి కలిపి రెండు నిముషాల పాటు ఉడికించి దించేయాలి. తరువాత మరో బాణలి పెట్టుకుని అందులో నూనె పోసుకుని వేడిచేయాలి. ఈలోగా మైదాపిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఒత్తుకోవాలి. దీన్ని సగానికి కట్‌చేసి కోన్‌లా చేసుకుని అందులో ఈ నూడుల్స్ మిశ్రమాన్ని వేసి చివర్లను అంటించుకోవాలి. కాగుతున్న నూనెలో ఈ సమోసాలను వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేయిస్తే కరకరలాడే చైనీస్ సమోసాలు తయారు.