రుచి

క్యాబేజీ అట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసినవి: క్యాబేజీ తరుగు -2కప్పులు, బియ్యపుపిండి -2 కప్పులు, కారం - తగినంత, ఉప్పు-తగినంత అట్టు కాల్చుకోవడానికి తగినంత నూనె
తయారీ విధానం: ముందుగా బియ్యపుపిండిలో క్యాబేజీ తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇపుడు ఇందులో కారం, ఉప్పు కలిపి కాసిని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఈ తడుపుకున్న పిండిముద్దను పదినిముషాలు తడిగుడ్డలో పెట్టాలి. ఆ తరువాత చపాతీలు చేసుకునే పెనం వేడి చేసుకోవాలి. తడిగుడ్డపైనే జామపండు సైజులోపిండిని ముద్దలు చేసుకొని మెల్లగా చేత్తో అట్టుగా చేసుకోవాలి. దీన్ని నెమ్మదిగా కాలుతున్న పెనం మీద వేసి రెండు వేపులా కాల్చుతూ చివర్లకు నూనె వేయాలి. ఇవి ఎర్రగా కాలేవరకు ఉంచి పెనం నుంచి వేరుచేసుకోవాలి. మధ్యాహ్నం పూట ఈ అట్లు తినడానికి పిల్లలు ఇష్టపడుతారు.