రుచి

తియ్య తియ్యగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమావాస్య చీకట్లను చిచ్చుబుడ్లు, మతాబుల వెలుగులతో పున్నమి వెనె్నలగా మార్చే పండుగ దీపావళి. ఈ పండుగ తీపి వంటకాలకు ప్రసిద్ధి. పిల్లలకూ, పెద్దలకూ ఇష్టమైన రకరకాల హల్వాలతో పాటు మరికొన్ని తీపి పదార్థాలు చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇలా తీపి వంటకాలతో ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు అవుతుంది.

మాల్‌పువా

కావల్సినవి : శుభ్రమైన పిండి- ఒక కప్పు, చక్కెర పొడి- ఒక కప్పు, నెయ్యి- ఒక కప్పు, ఖోయా- ఒక కప్పు, సెమోలినా- అర కప్పు, పాలు- రెండు కప్పులు, పంచదార-ఒక కప్పు, కుంకుమ పువ్వు-చిటికెడు, నీరు- వేడి చేసినవి ఒక కప్పు, సోపు పొడి- ఒక చెంచా.

తయారుచేసే విధానం: పాన్ తీసుకుని మీడియం మంట మీద పెట్టాలి. అందులో వేడి నీరు, పంచదార వేసి కలపాలి. పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు కలియబెడుతూ ఉండాలి. అప్పుడు రెండు లేదా మూడు స్పూన్ల పాలు కలపండి. పాన్ మిశ్రమం అంతా కలిసే వరకు కలపండి. పంచదార పాకం చిక్కగా తయారైన తరువాత పొయ్యి మీద నుంచి తీసివేసి పక్కన పెట్టుకోండి. ఇందులో మైదా, రవ్వ, ఖోయా, ఫెనె్నల్ పొడి, యాలకుల పొడి, పాలు కలపండి. ఈ మిశ్రమం మందంగా ఉండకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. తరువాత నెయ్యి వేడిచేసిన తరువాత పైన కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కలపండి. అపుడు పాన్‌లో ఈ మిశ్రమం, నెయ్యి మొత్తం కలిసేలా చూసుకోండి. మంటను తగ్గించి బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఉడికించాలి. ఇలా ఉడికిన మాల్‌పువాను పాన్ నుంచి తీసివేస్తే అందులో ఇంకా మనకు నెయ్యి కనిపిస్తూనే ఉంటుంది. ఇలా ఉడికిన మాల్‌పువాను పంచదార పాకంలో వేసి పది నిమిషాలు ఉంచండి. పిస్తాపప్పులతో అలంకరించి వేడి వేడిగా వడ్డించండి.

గజార్ కా హల్వా

కావల్సినవి : క్యారెట్- 500 గ్రాములు, పాలు- అర లీటరు, పంచదార- 500 గ్రాములు, యాలకుల పొడి- రెండు చెంచాలు, ఖోయా- 300 గ్రాములు, బాదం- 30 గ్రాములు, రైస్నిన్స్- 30 గ్రాములు, నెయ్యి- రెండు చెంచాలు.

తయారు చేసే విధానం: పాన్‌లో నెయ్యి వేడి చేసుకోవాలి. తురిమిన క్యారెట్‌ను కలపండి. ఈ రెండింటిని నాలుగు నిమిషాల పాటు బాగా కలపండి. ఆ తరువాత క్యారెట్ మిశ్రమంలో పాలు పోసి బాగా కలపండి. తక్కువ మంటపై బాగా కలిపిన తరువాత తురిమిన ఖోయా, ఏలకుల పొడి వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. నట్స్‌తో అలంకరించి సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు.

కొబ్బరి శ్రీఖండ్

కావల్సినవి : కొబ్బరి కాయ, పెరుగు-అర లీటర్, పాలు- అర లీటర్, పంచదార- 300 గ్రాములు, కుంకమ పువ్వు - ఐదు గ్రాములు, యాలకులు- ఐదు, జాజికాయ-సగం కాయ, నెయ్యి- ఒక చెంచా.

తయారుచేసే విధానం: కొబ్బరి చిప్పని కోరుకుని నేతిలో వేయించి పెట్టుకోవాలి. పలచటి గుడ్డ తీసుకుని అందులో పెరుగు పోయాలి. నీళ్లన్నీ ఇంకిపోయేటట్లు చూడాలి. ఈ పని ఒకరోజు ముందుగా చేసుకోవడం మంచిది. పాలు మరగకాచి వేరుగా ఉంచుకోవాలి. ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని దాని అంచులకు పలచటి గుడ్డ కట్టాలి. దీనినే వాసెన అంటారు. పెరుగును ఇందులో వేసి పంచదార, పాలు కొంచెం కొంచెంగా చేరుస్తూ రుద్దాలి. ఇలా పాలూ, పంచదార పూర్తిగా అయిపోయే వరకు చెయ్యాలి. దీనిని ఒక పాత్రలోకి తీసుకుని కొబ్బరి కోరు, యాలకుల పొడి, కుంకుమ పువ్వును కలపాలి. పూరీతో ఇంటే బాగుంటుంది.

అనాస హల్వా

కావల్సినవి : అనాస పండు తురుము- 4 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము- ఒక కప్పు, పంచదార- రెండు కప్పులు, జీడిపప్పు- అరకప్పు, కోవా-అరకప్పు, పైనాపిల్ ఎసెన్స్- ఐదు చుక్కలు, నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాపప్పులు నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టాలి. అదే పాత్రలో అనాస పండు తురుము, కొబ్బరి తురుము విడివిడిగా పచ్చివాసన పోయే వరకు నేతిలో వేయించాలి. తర్వాత ఈ రెండింటిని కలిపి అందులో పంచదార వేసి ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి. ఈ మిశ్రమానికి కోవా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించాలి. దీనిపైన వేయించిన జీడిపప్పు, పిస్తాపప్పు, బాదంపప్పులను వెయ్యాలి. రుచికరమైన అనాస జీడిపప్పు హల్వా రెడీ.