రుచి

బాదం.. ఆరోగ్యానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పు తింటున్న వారు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ, మ్యాంగనీస్ వంటివి పుష్కలంగా ఉన్నందున బాదం తీసుకునే పిల్లలు, పెద్దలు ఆరోగ్యవంతంగా కనిపిస్తుంటారని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి (అమెరికా) చెందిన పరిశోధకుడు అలిస్సా బర్న్స్ చెబుతున్నారు. అధ్యయనం సందర్భంగా 29 మంది దంపతుల, 29 మంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై 14 వారాల పాటు పరిశీలన చేశారు. 35 ఏళ్లు నిండిన దంపతులను, మూడు నుంచి ఆరేళ్ల లోపు వయసు కలిగిన పిల్లలను పరిశీలించారు. రోజూ కనీసం 15 గ్రాముల బాదం పప్పును తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. వీరిలో ఆరోగ్యకర ఆహార సూచీ (హెచ్‌ఇఐ) సంతృప్తికరంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. బాదం తీసుకున్న వారికి ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ బాగా అందుతున్నట్లు కనుగొన్నారు. బాదం కారణంగానే వీరిలో ‘ఆరోగ్యకర ఆహార సూచీ’ 53.7 నుంచి 61.4కు వృద్ధి చెందినట్లు గమనించారు. ఆకుకూరలు, చేపలు, ఇతర ఆహార పదార్థాల ద్వారా కంటే బాదం వల్ల ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు అధికంగా అందుతున్నట్లు గుర్తించారు. విటమిన్-ఇ, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా బాదం వల్ల లభిస్తున్నట్లు సర్వేలో తేలింది.
*