ఆంధ్రప్రదేశ్‌

ఒడిశా వైపు‘రోను’: కోస్తాంధ్రకు తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రోను’ తుపాను ఒడిశా తీరం వైపు పయనిస్తోంది. దీంతో కోస్తాంధ్ర జిల్లాలకు ముప్పు తప్పినట్టేనని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో తుపాను స్థిరంగా కదులుతోంది. ఇది ఈరోజు రాత్రికి ఒడిశా తీరంలో బలమైన తుపానుగా మారే అవకాశం ఉంది. ‘రోను’ ప్రభావంతో ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ఒడిశాలో తీరం దాటే వరకూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కళింగపట్నంలో 15, విశాఖపట్నంలో 8, మచిలీపట్నంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.