ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు తనను సస్పెండ్ చేయడంపై రోజా హైకోర్టును గతంలో ఆశ్రయించగా, స్పీకర్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో సుప్రీం కోర్టులో అపీల్ చేయాలని వైకాపా యోచిస్తున్నట్లు సమాచారం.