రివ్యూ

ఎటో వెళ్లిపోయాడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు*చుట్టాలబ్బాయి

తారాగణం: ఆది, నమితాప్రమోద్, యామినీ మల్హోత్రా, సాయికుమార్, అలీ, అభిమన్యుసింగ్, పృథ్వీ, రఘుబాబు, జీవా, కృష్ణ్భగవాన్, సురేఖవాణి, పోసాని కృష్ణమురళి.
నిర్మాత: రామ్ తలారి
సంగీతం: ఎస్‌ఎస్ థమన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్
***
‘చుట్టాలబ్బాయి’ చిత్ర ప్రచారంలో భాగంగా ఎలాగైనాసరే ఈసారి హిట్ కొట్టాలన్న కసితో చిత్రాన్ని తెరకెక్కించానన్న అభిప్రాయాన్ని దర్శకుడు వీరభద్రమ్ వ్యక్తపరిచాడు. ఎప్పుడైతే ‘ఎలాగైనా’ అన్న అజెండాతో చిత్రాన్ని రూపుదిద్దారో, అప్పుడు సహజత్వం దానంతటదే నీరుగారిపోతుంది. ఈ చిత్రం విషయంలోనూ అచ్చంగా అదే జరిగింది. చిత్రానికి పేరుపెట్టడం దగ్గర్నించీ సన్నివేశాల పోకడ, దాని ముగింపు అన్నీ కృత్రిమంగానే ఉన్నాయి. అదెలాగంటే...
మొండి బాకీలు వసూలు చేసే ఉద్యోగంలో ఉన్న రికవరీ బాబ్జీ (ఆది)కి అనుకోకుండా ఓ సందర్భంలో ఏసీపీ గౌతమ్‌కృష్ణ (అభిమన్యుసింగ్) సోదరి కావ్య (నమితాప్రమోద్) తారసపడుతుంది. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారేమోనన్న అనుమానంతో బాబ్జీని ఎదుర్కోమని తన సిబ్బందిని పంపుతాడు. అనంతరం కావ్యే, పెళ్లి ఇష్టంలేక ఇంటినుంచి పారిపోబోతుంది. ఆమెవల్ల తనకెదురైన కష్టాలను పోగొట్టమని అదే సందర్భంలో బాబ్జీ, కావ్యను కలుస్తాడు. ఈ కలయికను చూసిన ఆమె అన్నయ్య మరింతగా వాళ్లను అపార్ధం చేసుకుంటాడు. మరి ఇలాంటి అపార్ధాల జాతర ఎలా పరిష్కారమైందీ అన్నదీ మిగతా కథ. సినిమాని తనకలవాటైన కామెడీతో నడిపేయడంతోబాటు, ‘ఎలాగైనా’ అన్న శపథానికి ఆచరణగా క్రైమ్, ఛేజింగ్‌తో డైరెక్టర్ కలిపేయడంతో చిత్రం కావలసినంత గందరగోళాలను చూసింది. అసలు పోలీసు శాఖలో ‘ఎన్‌కౌంటర్’ అనేది విధిలేని పరిస్థితుల్లో ఉపయోగించే లేదా అనుసరించే విధానం. అలాంటిది దాన్ని ఓ అలవాటుగా మార్చుకున్నట్టు ఆయనో ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు’ అని పేరివ్వడం హాస్యాస్పదం. ఈ జాఢ్యం ఈ సినిమాకేకాదు చాలా తెలుగు సినిమాల్లో తటస్థపడుతున్న అంశం. అలాగే కేవలం తన చెల్లెల్ని కలిసాడన్న నెపంతో ఆ యువకుణ్ణి అంతలా ఎవరైనా, అదీ పోలీసు అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి తరుముతాడా? అన్నదీ సగటు ప్రేక్షకుడు చేసే కనీస స్థాయి వ్యాఖ్య. ఇదేమీ గమనించకుండా సినిమా యధేచ్ఛగా నడిచిపోతుంది. అదేరకంగా ఇంటినుంచి ఎంతో ఎదుగుదామని సంపన్న కుటుంబం నుంచి వచ్చిన బాబ్జీ, హైదరాబాదొచ్చి చేసే ఉద్యోగం ఈపాటిదా? అన్న భావన మనకి కలుగుతుంది. పోనీ ఆ సంపాదనతో జీవితంలో ఇప్పటి పోకడలకు తగిన ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోడం కోసం అనుకున్నా, ఆ పనేదో నేరుగా చేస్తే కాదా అన్న ఆలోచనా వీక్షకుడికి కలుగుతుంది కానీ, చిత్ర రూపకర్తలకు కలగదు. ఇక నాయిక పాత్రధారిణికిచ్చిన పోకడలు ప్రకారం పెళ్లంటే పొసగదు. ఓకే. అయితే అంకుముందు తనను రక్షించడానికి ఓ నాలుగు ఫైట్సు చేసినా మారని ఆమె, ఒక్కసారిగా అయిదో ఫైట్‌కు మారిపోవడం విచిత్రం. ఎంతో తెలివైన పోలీసు అనుచర బృందంగా చూపించిన గౌతమ్‌కృష్ణ అనుచరులు తన వెనకాల అంతమందిని సైలంట్‌గా ఎదిరించేసినా ఓ మామూలు వ్యక్తి బాబ్జీని గమనించకపోవడం, దానికో వివరణ సీనుని చూపడం వింతల్లో వింత. బాబ్జీగా సాంగ్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ మంచి ఈజ్‌ని కనపర్చడంతోపాటు డైలాగ్ మాడ్యులేషన్‌లో ముఖ్యంగా వాక్యాన్ని అంతం చేయడంలో తండ్రి సాయికుమార్ పద్ధతినే ఒడిసిపట్టేసి మెప్పించాడు. కానీ కథా కృత్రిమత్వం దీన్ని అంతగా రాణించనివ్వలేదు. కావ్యగా నమితాప్రమోద్ పరిధిమేరకు అభినయించారు. ఈగోరెడ్డిగా పృథ్వీ తనకలవాటైన కామెడీని పండించాడు తప్ప, వైవిధ్యం కోసం ప్రయత్నించలేదు. కిడ్నాప్ క్రిష్‌గా అలీ సినిమా అయిపోతుందనుకున్న టైమ్‌లో వచ్చి సందడి చేశారు. ప్రధాన పాత్రలో సాయికుమార్ అని సినిమాలో చూపినా, ఆయనకిచ్చిన దొరబాబు పాత్ర అంతా ప్రధానంగా వాస్తవానికి చూపలేదు. అసలు బాబ్జీ- దొరబాబు పాత్రల మధ్య ఓ రెండు బలమైన సన్నివేశాలు చూపే ప్రయత్నం చేస్తే సినిమాకు మేలు జరిగేది. బహుశా అలాచేస్తే ఆది పాత్ర పండదేమోనన్న భావంవల్ల ఇలా చేసి ఉండొచ్చు. థమన్ స్వరాల్లో ఈ సినిమాలో అలీయే ఓ సందర్భంలో చెప్పినట్టు డప్పుల దరువే అధికమైంది. సినిమా మొత్తానికి ఎక్కువ కష్టపడిందీ, దాదాపు ప్రతి డైలాగ్‌లోనూ ‘పంచ్‌‘వుండేలా ప్రతాపం చూపిందీ సంభాషణా రచయితలు. (చిత్రానికి సంభాషణా రచయితేకాక అదనపు డైలాగ్స్ అంటూ మరొకరి పేరూ చూపారు) సినిమా ప్రారంభ సన్నివేశంలో భార్య భర్తనుద్దేశించి ‘రాత్రంతా నిన్ను నిద్రపోనివ్వను అంటే ఏదేదో చేసేస్తాడనుకున్నాను కానీ, ఇలా గురక పెడతాడనుకోలేదు’ అన్న పంచ్ దగ్గర్నుంచీ ఎండింగ్‌వరకూ ఎక్కడోఅక్కడ అలాంటివి పడుతునే ఉన్నాయి. ఈ పంచ్‌ల సమూహంలో రాష్ట్ర విభజన, స్వచ్ఛ్భారత్, గ్రామాల దత్తత, ప్రత్యేక హోదా తదితరాలూ ఉన్నాయి. ‘నిన్ను గుండెలమీద పెట్టుకుని పెంచినవాణ్ణి, నీ గుండెల్లో ఏముందో తెలుసుకోలేనా అన్న డైలాగ్’ ఒక్కటే బాగా ప్రేక్షకుల్ని తాకింది. అటు కామెడీని, ఇటు క్రైమ్ ఎలిమెంట్‌నీ మిక్స్ చేయడంలో తడబాట్లుకు చోటివ్వకుండా ‘చుట్టాలబ్బాయి’ని వీరభద్రమ్ మలచివుంటే సినిమా బాక్సాఫీసుపరంగా ‘్భద్రమైన’ ఫలితాలనిచ్చి ఉండేదేమో.

-అనే్వషి