రివ్యూ

ఎఫ్‌బిలో దెయ్యం గోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు..ఫ్రెండ్ రిక్వెస్ట్

తారాగణం: ఆదిత్య ఓం, నితిష్‌చౌదరి, రోహిత్, పంకజ్, మనీషా కేల్కర్, అచింతకౌర్, శీతల్‌సింగ్, సాగరిక బెత్ర, రిచాసోనీ, ప్రకాష్ సుల్తాన్, నిషాగౌతమ్
సంగీతం: వీరల్-లావన్
నిర్మాతలు: మోడ్రన్ సినిమా,
ఘాన్‌భామ్లా, ఆదిత్యసింగ్
రచన-దర్శకత్వం: ఆదిత్య ఓం
**
సామాజిక అనుసంధాన వేదికలైన వాటిని మరో కోణంలో ఉపయోగించి నష్టపోతున్న యువతరానికి ఆ పద్ధతి తప్పని చెప్పడం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ చిత్రానికి స్థూలంగా అనుకున్న స్టోరీ లైన్. కానీ అదికాస్తా తెరమీదికొచ్చేసరికి దెయ్యాలగోల ఆరంభమై వాటినుంచి ‘విముక్తి’ అనే పతాక సన్నివేశ స్థితికి చేరి’పోయింది. అయితే ఈ మాదిరి ఆత్మల అలజడి, అంతమైన తీరు చూసి చూసి.. ఈ ‘రిక్వెస్ట్’ కాస్తా ‘రిజక్ట్’ అయి కూర్చుంది. విషయంలోకి వెళితే.. శీతల్‌సింగారియా (మనీషా కేల్కర్) చాలామందిలానే ‘ఫేస్‌బుక్’ ప్రక్రియలో చాలా బిజీ. ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఉంటుంది. ఆ ప్రొసెస్‌లోనే వారాంతపు పార్టీలు ‘ఎఫ్‌బి’ ఫ్రెండ్స్‌కిస్తూ ఉంటుంది. అలాంటి ఓ సమావేశంలో ఆమెకు విపత్కర పరిస్థితి ఎదురై మరణిస్తుంది. అయినా ఆమె ఫేస్‌బుక్ ఎకౌంట్ సజీవంగా (?) ఉంటుంది. శీతల్ ఆత్మ అందరినీ వేధిస్తూంటుంది. అలాంటి సందర్భంలో ఆత్మ- వేధింపు తదితర తతంగాలకు విముక్తి ఎలా లభించింది అన్నది మిగతా కథ. కథగా అర్ధంకావడానికి ఇలా ఒక వరసలో చెప్పవలసి వచ్చింది. కానీ వాస్తవానికి ఈ వరస తెరపై లేదు. పోనీ ఇది ప్రేక్షకునికి ఉత్కంఠ కలిగించడానికి అనుకున్నా, మొత్తానికి విషయం అర్థమయ్యేలా చెయ్యాలి. దాన్ని ఏమాత్రం ఇందులో పాటించలేదు. దాంతో సన్నివేశాలన్నీ గందరగోళానికి గురయ్యాయి. చిత్రం మొదటలోనే ఈ బాపతు అన్ని సినిమాలలో లాగానే ‘సన్నివేశాలన్నీ కేవలం కల్పితాలు...’ అన్న కార్డు వేయనే వేశారు కనుక ఆ జోలికి పోవడం కేవలం కంఠశోషే. అది వదిలి మిగతా విషయాలైనా సరిగా ఉన్నాయా? అంటే అదీ లేదు. దానికితోడు అనేకానేక అనవసర సన్నివేశాలు. చిత్రం కేంద్రం ఆత్మలు వగైరా కనుక అది డీల్ చేస్తే సరిపోతుంది అనుకుంటే... దానితోపాటు శీతల్ తల్లి, ఆమె బోయ్‌ఫ్రెండ్, వారిద్దరి మధ్య అతి సన్నిహిత దృశ్యాలూ చూపారు. ఆ బోయ్‌ఫ్రెండ్ కూడా ఆమెకన్నా ఎంతో వయస్సు తక్కువ ఉన్నవాడుగానూ చూపారు. చిత్ర సందర్భాన్నిబట్టి యువతీ యువకుల మధ్య జరుపుకున్న గేమ్‌లో ఓడినవారు మిగతావారు చెప్పిన పనిచేయాలన్న నియమం పెట్టుకున్నారు. ఆ నిబంధన ప్రకారం యువకుడు యువతిని స్ట్రిప్పింగ్ చేయమంటాడు. ఆ సీన్‌ని సంయమనంతో తీశారు. ఇది ఓకే! ఆత్మల మానసిక శాస్తవ్రేత్త (ఘోష్ట్ సైకాలిజిస్ట్) పాత్రకిచ్చిన హంగామా చాలా ఎక్కువైంది. బహుశా ఆ పాత్రను పోషించిన ఆదిత్య ఓం (చిత్ర దర్శకుడు కూడా)కు సినిమా విషయంలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇది జరిగి ఉండొచ్చు. అయితే వాటికి సన్నివేశాల్లో సరైన ప్రాతిపదిక లేకపోవడంతో ఆకట్టుకోలేక పోయాయి. చిత్రంలో ఏ పాత్రకీ ప్రతిభ చూపడానికి కథ ఆస్కారం ఇవ్వకపోయినా, ఉన్నంతలో మరాఠీ నటి మనీషా కేల్కర్ (శీతల్ పాత్రధారిణి) బాగా నటించింది. వీటి అన్నింటికంటే ముందు చెప్పుకోవల్సింది ఛాయగ్రాహకుడు సిద్ధార్థ పనితీరు. ఉన్న పరిమితి పరిధిలో చెప్పుకోతగ్గ రీతిలో తన కెమేరాకు పని కల్పించి సఫలీకృతులయ్యాడు. పాటలకంటూ సినిమా అవకాశం ఇవ్వకపోయినా నేపథ్య సంగీతంతో చిత్రం మూడ్‌ని చెప్పడానికి ప్రయత్నం జరిగింది. దెయ్యాల్ని డీల్ చేయడం ఈజీ, కానీ అమ్మాయిల్ని డీల్ చేయడం కష్టం అన్న ఈ సినిమా భాషలోనే చెప్పాలంటే దెయ్యాల చిత్రాల్ని చూడగలం కానీ, ఈ మాదిరిగా దెయ్యాల్ని సోషల్ మీడియా అంశాల్లో చొప్పించి చూపితే జీర్ణం చేసుకోవడం కష్టం. అసలీ గందరగోళాలు అన్నిటికంటే, విచక్షణారహితంగా ‘ఫేస్‌బుక్’ని వినియోగించడంవల్ల కలిగే అనర్థాల్ని సూటిగా చెప్పుంటే... ఈ రిక్వెస్ట్ యాక్సప్ట్ అయ్యేదేమో!

-అనే్వషి