రివ్యూ

లైఫ్ చూపిన చే‘రన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు-- రాజాధిరాజా

తారాగణం:
శర్వానంద్, నిత్యామీనన్, ప్రకాష్‌రాజ్, సంతానం, జయప్రకాష్ తదితరులు
కెమెరా: సిద్ధార్థ్
సంగీతం: జివి ప్రకాష్‌కుమార్
నిర్మాత: ఎన్ వెంకటేష్
దర్శకత్వం: చేరన్

సుదూర ప్రయాణానికి సిద్ధమైన వలస పక్షులు గమ్యాన్ని చేరేదాకా విశ్రమించవు. వేల కిలోమీటర్లు ప్రయాణించే సమయంలో ఏ పక్షికైనా తనకు మరణ ఘడియలు వచ్చాయని తెలుసుకుంటే, దాని ప్రవర్తనలో మార్పొస్తుంది. క్రమంగా గుంపునుంచి వెనకపడుతూ వేరవుతుంది. చివరికి ఏకాకిగా మరణిస్తుంది. సహజ మరణం పొందిన పక్షి ఎక్కడా కనిపించకపోవడం ప్రపంచంలో ఒక వింత. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా పక్షిలా మాయమయ్య ప్రవర్తనను మనిషిలో చూస్తే ఎలా ఉంటుంది? అచ్చం రాజాధిరాజు చిత్రంలా ఉంటుంది.
కథేంటి:
జెకె (శర్వానంద్) సాధారణ ఉద్యోగిగా కొలీగ్స్‌తో కలిసి ఆనందంగా గడిపేస్తుంటాడు. ఓరోజు అనుకోకుండా ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. వ్యాపారం మొదలెడతాడు. సృజనాత్మక రంగంలో ప్రతిభను పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని కోట్లకు విస్తరించే పనిలో నిమగ్నమవుతాడు. జెకె రియల్ ఎస్టేట్ కంపెనీపై కన్నువేసిన రుద్రాక్ష (ప్రకాష్‌రాజ్), ఆ స్థలాన్ని అప్పనంగా ఇవ్వాలని వార్నింగ్ ఇస్తాడు. అందుకు ప్రతిఫలంగా నాలుగు కోట్ల ఆదాయాన్ని అందిస్తాడు రుద్రాక్ష. ఇలా వ్యాపారం మొదలుపెట్టకుండానే కోట్లు సంపాదించిన జెకె, ఆ తరువాత మరెన్నో వ్యాపారాల్లో మునిగిపోతాడు. క్షణం తీరిక లేకుండా నిరంతరం శ్రమించే అతడిని చూసి, అతని స్నేహితురాలు నిత్య (నిత్యామీనన్) నిలదీస్తుంది. జీవితంలో డబ్బే ప్రధానమా? అని ప్రశ్నిస్తూనే ఎందుకు డబ్బుకోసం అలా పరిగెడుతున్నావంటూ ప్రశ్నిస్తుంది. అందుకు జెకె దగ్గర జవాబున్నా చెప్పలేని స్థితి. తనతోవున్న ఆరుగురు స్నేహితులకు వ్యాపారంలో భాగస్వామ్యమిచ్చి, వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు జెకె. గాలికన్నా వేగంగా పరిగెడుతూ సంపాదనే ధ్యేయంగా మార్చుకున్న జెకె అంతరంగం ఆవిష్కరిస్తే ఏముంది? అదే ప్రయత్నం చేస్తుంది స్నేహితురాలు నిత్య. తాను ఉద్యోగం చేసే సమయంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన ప్రమాదంలో స్నేహితుడిని పోగొట్టుకుంటాడు జెకె. అధ్వాన్నమైపోయిన స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాడు జెకె. కానీ ప్రమాదం తాలూకు నీడ జెకె జీవితంపైనా పడింది. అదే ప్రమాదంలో తలకు చిన్న గాయమై, ఇప్పుడది మెదడులో రక్తం గడ్డకట్టే జబ్బయ్యింది. దీనివల్ల జెకె మరణానికి చేరువవుతున్నాడు. అందుకే వలస పక్షిలా ఎక్కడా విశ్రమించకుండా కుటుంబం కోసం కోట్ల సంపాదనకు పరిగెడుతున్నాడు. పరుగులో అతను గెలిచాడా? విధి గెలిచిందా? అదే మిగతా కథ.
ఎలా వుంది?
సినిమా ఎత్తుకున్నది సృజనాత్మక రంగంలో సరికొత్త విషయాన్ని పరిచయం చేసే దిశగా. అందులో దర్శకుడు చూపించిన చాకచక్యం స్క్రీన్‌పై ప్రేక్షకుడికి నచ్చుతుంది. జెకె తర్వాత తర్వాత చేస్తున్న వ్యాపారాలన్నీ సరికొత్తగానే కనిపిస్తాయి. పట్టణాల్లో అందరూ ఉద్యోగాలకు వెళ్లేవారే. హౌస్‌కీపింగ్ అనేది వారికి అందని పండు. అసలు టైమంటూ ఉంటే కదా? ఇంటిని చక్కబెట్టుకోవటానికి. ఈ దారిలోనే జెకె తన వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. తర్వాత సరికొత్త బొకేలను తయారు చేస్తాడు. షర్ట్ డిజైనింగ్స్‌లో ఆరితేరిన నిత్య రూపొందించిన డిజైన్ చొక్కాల వ్యాపారం తదితర విషయాల్లో దర్శకుడు కొత్తదనాన్ని చూపాడు. కానీ సినిమా స్లోనేరేషన్ అవడం, ఎడిటింగ్ సరిగా లేకపోవడంతో ప్రేక్షకుడు సినిమా కథనంలో మమేకం కాలేదు. దానికితోడు ఇంటిలెక్చ్యువల్ స్క్రీన్‌ప్లే మంచి సన్నివేశాలు కళ్లముందు పరిగెడుతున్నా, దాని గాఢత ప్రేక్షకుడికి వేగంగా అందలేదు. కథను ప్రేక్షకుడికి ఎలా అందించాలన్న విషయంలో దర్శకుడు చేరన్ ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్‌మెమరీస్’తో సక్సెస్ అయితే, రాజాధిరాజా చిత్రంలో ఆ రేంజ్ అందుకోలేకపోయాడు. ఇక శర్వానంద్, నిత్యామీనన్ పోటీపడి నటించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో మెలో డ్రామాని బాగా రక్తికట్టించారు. మిగతా వాళ్లల్లో ప్రకాష్‌రాజ్ పేరుకేగానీ చేసిందేం లేదు. సంతానం నటన సోసో. కెమెరా పనితనం సినిమాకు హైలెట్. ‘వెయ్ నిచ్చెన వెయ్, ఫేస్‌బుక్ లాగించెయ్, మనసా ఓ మనసా’ లాంటి మూడు పాటలు ఆకట్టుకుంటాయి. సమయాల మాయ అంటే ఎప్పుడు ఎవరు ఎలా మాయమైపోతారో ఎవరికీ తెలియదు అంటూ, ఈ బిజీ జీవితంలో మనం నిజంగా బ్రతికేదెప్పుడు అని ప్రశ్నించిన విధానం నచ్చుతుంది. నన్ను నాకు కొత్తగా పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్, మిమ్మల్ని కన్నోళ్లని మోసం చేయద్దు, ప్రాణం విలువ ఉన్నప్పుడు తెలియదు, కన్నతండ్రి బాధ్యత కొడుకులకు అర్థంకాదు, క్రియేటివ్‌తో బాటుగా ఉద్యోగంలో జాబ్ శాటిస్‌ఫై ఉంటేనే బావుంటుంది’ లాంటి మాటలు ఆలోచింపచేస్తాయి. చివరగా ఓ మంచి కథనాన్ని చక్కగా చిత్రీకరించినా అది ఓ పొందికకు రాకపోవడంతో రాజాధిరాజు సామంతరాజుగానే మిగిలిపోయాడు.

-శేఖర్