రివ్యూ

ఔను.. అంతంతమాత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** అర్జున్.. సురవరం
**
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠీ, వెనె్నల కిషోర్, తరుణ్ అరోరా, నాగినీడు, ప్రగతి, విద్యుల్లేఖ, రామన్, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: శ్యామ్ సిఎస్
కెమెరా: సూర్య
నిర్మాత: రాజ్‌కుమార్ ఆకెళ్ళ
దర్శకత్వం: టి సంతోష్
**
ఫేక్ సర్ట్ఫికెట్ల కారణంగా అనర్హులుగా ముద్ర (తొలుత అనుకున్న టైటిల్ ఇది) పడుతున్న అర్హులు, ‘ఫేక్’ దందా మూలాలను చర్చించిన చిత్రం -అర్జున్ సురవరం. ఈ కానె్సప్టును టచ్ చేసిన సినిమాలు ఉన్నాయిగానీ, పూర్తిస్థాయి ప్రయత్నం అ.సుతోనే జరిగిందనుకోవాలి. ప్రయోజక పూరిత కథాంశానే్న దర్శకుడు శ్రీనివాస్ తీసుకున్నా -సన్నివేశాల్లో సమర్థత కరవై ‘అర్జున్ సురవరం.. అంతంతమాత్రం’ అన్నట్టే ఉండిపోయింది.
**
నకిలీ ధ్రువపత్రాలను సృష్టించే గ్యాంగ్ చేసిన నిర్వాకంవల్ల అర్హమైన డిగ్రీలు ఉండీ లేనివాడైపోతాడు అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్ సిద్ధార్థ్). మరి అదెలా అయ్యిందో తెలుసుకునే క్రమంలో బయటపడిన దిగ్భ్రాంతికర అంశాలు, వాటిని పట్టుకున్న వైనం మిగిలిన కథ. ఈ జటిలమైన అంశాన్ని చేధించే కథానాయకుని వృత్తి జర్నలిజం కావడంతో -ఓ ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్టుగా దందా వరస తెలుసుకుంటాడు. అలా హీరోకు జర్నలిస్టు పోస్టును కట్టబెట్టినపుడు, ఆ రంగంలోని ప్రాథమిక అంశాలూ పోకడలపై సంతోష్ శ్రద్ధపెట్టివుంటే బాగుండేది. అలాకాకుండా ఏదో ఓ మామూలు ధోరణిలో కొన్ని సన్నివేశాలు లాగించేశారు. ఉదాహరణకు ప్రతిష్టాత్మకమైన మీడియా సంస్థ బిబిసిలో ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్టు జాబ్‌కు ఇంటర్వ్యూని ఓ ప్రహసనంలా చిత్రించారు. అభ్యర్థిగా వచ్చిన అర్జున్‌కు ఇంగ్లీషు రాదని ఇంటర్వ్యూ ప్యానల్‌లోని ఒక వ్యక్తి ఈసడించినప్పుడు, అతను నోరు మూసుకునేలా దడదడా ఇంగ్లీషులో వాయించేసినట్టు చూపించారు. ఈ తరహా ఆకస్మిక ఆంగ్ల వాయింపుల సీన్ల ధోరణి చాలా ఓల్డ్ టెక్నిక్. దీనిని పైకితీసి మళ్లీ ప్రజెంట్ చేయడంలో ప్లెజర్ ఏమిటో దర్శకుడే చెప్పాలి. అలాగే అప్పటివరకూ ఎంతో పకడ్బందీగా ఫేక్ సర్ట్ఫికెట్ల తతంగాన్ని నడుపుకొస్తున్న దురాజ్ సర్కార్ (తరుణ్ అరోరా) బృందం సభ్యుడి వద్దకు అర్జున్ వచ్చి నాకిప్పటికిప్పుడు బిటెక్ సర్ట్ఫికెట్ కావాలంటే వాళ్ల స్థావరానికి నేరుగా తీసుకువెళ్లడం, చాలా చిన్న పిల్లల ఆటలా కనిపించింది. ఎందుకంటే అప్పటికే వాళ్లు చేస్తున్న అక్రమ దందాను మరెవరో ఆరా తీస్తున్నట్టు అనుమానం ఆ గ్యాంగులో ఉంది. వాళ్లను పట్టుకోడానికి తీవ్ర ప్రయత్నాలూ చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో అర్జున్ ధోరణే అనుమానాస్పదంగా అనిపించిన ఆ వ్యక్తి -నేరుగా వాళ్ల శిబిరంలోకి ఏక్సెస్ ఇచ్చినట్టు చూపడం అసంబద్ధం. అదే రీతిలో కథానాయిక కావ్య (లావణ్యత్రిపాఠీ) కూడా దుండగుల భవంతి డేంజరస్ అని తెలిసీ లోపలికి ఒక్కర్తే వెళ్లిపోయినట్టు చూపడమూ హాస్యాస్పదం. ఇంకా చెప్పాలంటే లావణ్యత్రిపాఠీ డ్రెస్ విషయంలోనూ కాస్ట్యూమ్ డైరెక్టర్ శ్రద్ధ వహించలేదనిపించింది. ఆమె వెళ్లింది హీరో చేస్తోన్న పరిశోధనాంశానికి సహాయపడడానికి. ఛేజింగ్‌లూ, వగైరావంటి తీవ్ర అంశాలున్న ఆ సందర్భంలో దానికి తగిన దుస్తులను ఆమెకు రూపకల్పన చెయ్యాలి. అందుకు విరుద్ధంగా ఇందులో ఆమె ఏదో ఓ పెళ్లికి వెళ్తున్నప్పుడు ధరించే డ్రెస్‌ను ఉపయోగించినట్టు చూపారు. సన్నివేశం పండాలంటే అన్ని రకాలుగానూ సందర్భ స్పృహ ఉండాలి. అది ఇందులో కొరవడింది. అన్నిటికీ మించి నమ్మశక్యంకాని సంగతి -కొడుకు చేస్తున్న జాబ్ ఏమిటో కూడా తెలీని స్థితిలో అతని తండ్రి (నాగినీడు) ఉన్నట్టు చూపడం. అందులోనూ తండ్రి పాత్రను కూడా జర్నలిస్టుగానే చూపారు. ప్రతీదీ నిశితంగా చూసే జర్నలిస్టు జాబ్‌లోంచి వచ్చిన అతను కూడా కొడుకు అర్జున్ రిపోర్టర్‌గా చేస్తున్నట్లుకాక, ఐటి కంపెనీలోనే చేస్తున్నాడనుకోవడం ఏవిధంగానూ మ్యాచ్ కాలేదు. వాస్తవానికి ఈ చిత్రం 2016లో ఇదే దర్శకుని దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘కణితన్’ చిత్రానికి రీమేక్. మూడేళ్ల తర్వాత తెలుగురూపం పొందినప్పుడు కాలంలో వచ్చిన మార్పుల్నీ అనుసరిస్తే బాగుండేది. అవి పెద్దగా పట్టించుకోలేదు. అయితే మధ్యప్రదేశ్‌లో జరిగిన దాదాపు ఇదే తరహా కుంభకోణం ‘వ్యాపం’ను ఇందులో సంభాషణల్లో ప్రస్థావించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరకూ జరిగిన ఆర్టీసీ స్ట్రయిక్‌నూ ఓ డైలాగు ద్వారా సందర్భపరంగా టచ్ చేయడం బాగుంది. టీవీ ‘డిబేట్’ లైవ్ అంటూ ‘వెనె్నల’కిషోర్ ట్రూప్‌తో చేయించిన సన్నివేశాలు చిత్రం నిడివి పెంచి గ్రిప్ కోల్పోయేలా చేశాయి తప్ప ఏవిధంగానూ నవ్వు కలిగించలేదు. అంతకన్నా హీరో ఫ్రెండ్ పాత్ర పోషించిన సత్య వన్‌లైనర్ పంచ్‌లు బాగా అలరించాయి. అర్జున్‌గా నిఖిల్ సంభాషణాపరంగా, భావప్రకటనల పర్వంగా ఫర్వాలేని స్థాయిలో నటించారు. కానీ స్టంట్ సీన్స్‌లో ఆ భారీస్థాయి (దర్శకుడు మురగదాస్ స్కూల్‌నుంచి వచ్చాడు. పోరాట సన్నివేశాలు స్పెషల్‌గా ఉంటాయి)ని బేర్ చేయడానికి కావల్సిన బాడీని నిఖిల్ పెంచివుంటే అవి ఇంకా రాణించేవి. లావణ్యత్రిపాఠీ కథానాయికగా నాయకుడికి మంచి సపోర్ట్‌నే ఇచ్చింది. హీరో స్నేహితుడిగా సత్య మంచి టైమ్‌సెన్స్‌తో డైలాగ్స్‌ని పలికి నటించాడు. పోసాని పాత్ర సహజత్వానికి దూరంగా ఉన్నా, నటనపరంగా బాగుంది. దురాజ్ సర్కార్‌గా తరుణ్ అరోరా ఆ పాత్రకు ఏప్ట్. ట్రంప్ ‘కార్డ్’, ఒబామా ‘కార్డ్’ అంటూ వేసిన పంచ్ బాగాపేలింది. ‘ప్రోబ్లమ్స్ ఉంటేనే సాల్వేషన్స్ దొరుకుతాయి’ అన్న సంభాషణ బాగుంది. ‘మీరు కరెప్ట్ ఆఫీసర్ కావడానికి నిదర్శనం మీ అబ్బాయని గవర్నమెంట్ స్కూల్లో చదివించడమే’ అన్న డైలాగును ప్రయోగించిన సందర్భమూ సమంజసంగా ఉంది. ‘చెగువీరా.. నువ్వే నేడు’ అంటూ శంకర మహదేవన్ పాడిన పాట బాగుంది. కొన్నిచోట్ల పాటలోని మాటల్ని వాయిద్య ధ్వని మింగేయడం ఇబ్బందికరం. ఎలాటి తీవ్ర పరిస్థితులు తారసిల్లినా ‘సత్యం’ తన ధాటిని కోల్పోడు అంటూ పాట రాసిన విధానం ఎన్నదగింది. ‘మోసం విశ్వవ్యాప్తమైనప్పుడు నిజం చెప్పడం విప్లవాత్మక చర్య’ అంటూ చూపిన ప్రసిద్ధవాక్యంతో ఆరంభమైన ‘అర్జున్’ పోకడ సహజత్వం అంశాలనూ దృష్టిలో పెట్టుకునివుంటే బావుండేది.

-అనే్వషి