రివ్యూ

ఎక్కడో జామైపోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు-- ఒక్క అమ్మాయి తప్ప!

తారాగణం:
సందీప్ కిషన్, నిత్యామీనన్, రవికిషన్, అలీ, తాగుబోతు రమేష్, సప్తగిరి సంగీతం: మిక్కీ జె.మేయర్
ఫొటోగ్రఫీ: చోటా కె నాయుడు
నిర్మాత: అంజిరెడ్డి
రచన, దర్శకత్వం: రాజసింహా

2012 -నాటి నుంచీ ఈ కథ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోందన్నది సందీప్ స్టేట్‌మెంట్. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ అంటే -నాలుగైదేళ్ల సుదీర్ఘ కాలాన్ని అధిగమించి.. ఎన్నో కష్టనష్టాలకోర్చి తెర కెక్కిందిట. ఉత్కంఠతని కల్గించటానికి.. 400 వాహనాలూ.. వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టుల ప్రహసనాన్ని కూడా పనిలో పనిగా తెర వెనుక చెప్పిన దర్శకుడు.. రచయితగా తనకంటూ ఓ శైలితో తళుక్కున మెరిసి.. ‘రుద్రమదేవి’తో తానంటే ఏమిటో నిరూపించి.. దర్శకుడిగా అవతారమెత్తడం వరకూ ఓకే. అయితే- ఒక్క అమ్మాయి తప్ప -టైటిల్‌కీ.. ఫ్లైఓవర్ బాంబుకీ పొంతన కుదరక -కథ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. తాను చూసిన ఫ్లైఓవర్ ట్రాఫిక్ జాం యధార్థ సంఘటనకి కథారూపం కల్పించి.. ఓ ఎనిమిది గంటలపాటు కథని ‘బాంబు’ నేపథ్యంలో నడిపించిన దర్శకుడు కథ అనే ‘ట్రాఫిక్’ని సరిగ్గా కంట్రోల్ చేయగలిగాడా? లేదా? అన్నది చూద్దాం.
-నగరంలోని ఓ ఫ్లైఓవర్. నిరంతరం రద్దీగా ఉండే ఆ ఫ్లైఓవర్ ట్రాఫిక్ జామ్‌తో మరింత గందరగోళాన్ని సంతరించుకొంది. ఆ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కొన్న కృష్ణవచన్ (సందీప్ కిషన్).. పక్కనే ఆటోలో ఉన్న అమ్మాయి (నిత్యా మీనన్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. స్కూల్‌లో మ్యాంగో అని గారాబంగా పిలుచుకొనే సత్యికి ‘ఐ లవ్ యూ’ చెప్పి తన మనసు గెలిచేసిన కృష్ణవచన్.. ఆటోలో తన మనసుని దోచేసిన అమ్మాయి సత్యనే అని త్వరలోనే గ్రహిస్తాడు. కొద్ది సమయం గడిచాక.. అసలు విషయాన్ని తెలుసుకొన్న సత్య అతనితో క్లోజ్‌గా మూవ్ అవుతుంది. ఈ తొలిచూపు పరిచయం.. చిన్ననాటి స్నేహం కలగలిసి గంటల గడుస్తున్నా ట్రాఫిక్ ఏమాత్రం క్లియర్ కావటంలేదన్న సంగతి తెలుసుకోటానికి కొద్దిగా టైం పడుతుంది. విషయాన్ని కనుక్కొన్న కృష్ణకి అసలు నిజం తెలుస్తుంది. ఫ్లైఓవర్‌పై మూడు బాంబులు అమర్చి.. ట్రాఫిక్‌ని స్తంభింపజేసి బ్లాస్ట్ చేయాలన్నది ఉగ్రవాదుల ప్లాన్. ఈ నేపథ్యంలోకి కృష్ణవచన్ ఎలా ఇరుక్కున్నాడు? అన్వర్ (రవికిషన్) అనే వ్యక్తి కృష్ణ ద్వారా బాంబు ప్లాన్‌కి సక్సెస్ చేయగలిగాడా? ఉగ్రవాదుల ప్లాన్‌ని కృష్ణ ధైర్యంగా ఎదుర్కొని.. వందలమంది జనాన్ని రక్షించగలిగాడా? సత్య ప్రేమని గెలుచుకో గలిగాడా? క్లైమాక్స్‌లో వీటన్నిటికి సమాధానాలు చెబుతూ వచ్చాడు దర్శకుడు.
కానె్సప్ట్ వరకూ ఓకే. ఉగ్రవాదులు ఫ్లైఓవర్‌పై బాంబులు పెట్టడం.. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న జనం పడిన పాట్లు -ఇవన్నీ పేపర్ వర్క్ వరకూ ఫర్వాలేదు. వినడానికి బాగుంటుంది. అయితే- వచ్చిన చిక్కల్లా ‘ఒక్కటే’. రెండు గంటల సినిమా అంతా ఒకే లొకేషన్‌లో అంటే విసుగు కలుగుతుంది. పోనీ అదీ అధిగమించామంటే.. సన్నివేశాలన్నీ అక్కడక్కడే తిరుగుతూ.. ఏమాత్రం ‘్ఫల్’ని కలిగించవు. ఉత్కంఠతని రేకెత్తించవు. ఇటువంటి కథల్లో స్క్రీన్‌ప్లేతో సన్నివేశాల్ని పరిగెత్తించగలగాలి. కానీ అంతటా ‘ట్రాఫిక్’ స్తంభించిపోయింది. ఆ ‘జామ్’ నుంచీ కథని ఏ రీతిన బయటికి తేవాలన్నది తేల్చుకోవటానికి దర్శకుడికి ఫస్ట్ హాఫ్ అంతా సరిపోయింది. తరచూ హాలీవుడ్.. బాలీవుడ్ చిత్రాలు తిలకించే ప్రేక్షకులకు ఈ కథని ‘్ఫన్ బూత్’ - ‘ఎ వెడ్నస్ డే’ చిత్రాల్తో పోల్చుకోవటం మొదలవుతుంది. ఆ కథలో ఇలా ఉంది. ఈ కథలో ఇలా లేదే? అన్న బేరీజు స్టార్ట్ అవటంతో.. ప్రేక్షకులకు ఆలోచనల ‘ట్రాఫిక్’ ముప్పిరిగొంటుంది. హీరో ద్వారా విలన్ ‘బ్లాస్ట్’ ఆపరేషన్ మొదలెట్టడంతో సగటు ప్రేక్షకుడు కుదురుగా సీట్లో కూర్చొంటాడు. కానీ -కామెడీ సన్నివేశాల్తో కనెక్ట్ కాలేక.. మధ్యమధ్య వచ్చే మీడియా అప్‌డేట్స్‌పై మనసు పెట్టలేక.. మరోవైపు తనికెళ్ల భరణి వివరించే ‘మత సామరస్యం’ బోధలవైపు దృష్టి సారించలేక.. ‘మంతెన’ ప్రకృతి వైద్యం సెటైర్ల విషయంలో జోక్యం కలుగజేసుకోలేక.. ఆలీ పెళ్లిచూపుల ప్రహసనాన్ని చూడలేక.. ఎటు చూసినా ‘ట్రాఫిక్’ స్తంభించినట్టై.. ఎప్పటికి ట్రాఫిక్ క్లియర్ అవుతుందన్న దిశలోనే ఆలోచనలు పెట్టడంతో మధ్యలో ‘ఒక్క అమ్మాయి’ మిస్సయింది. ఫ్లైఓవర్ బాంబు బ్లాస్ట్‌కి తోడు.. వీటన్నిటినీ జోడించటంవల్ల స్క్రీన్‌ప్లేలో ‘పస’ తగ్గింది.
నటనాపరంగా -సందీప్ కిషన్‌కి మంచి మార్కులే పడతాయి. అంతా తానై.. అన్నింటా తానై.. ప్రతి సన్నివేశంలోనూ తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటాడు. క్లైమాక్స్‌లో అతని నటనతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. నిత్యామీనన్ పాత్ర పరిధి తక్కువ కావటంవల్ల ఆమె నుంచీ ఆశించతగ్గది ఏమీ లేదు. విలన్‌గా రవికిషన్ ఫర్వాలేదనిపిస్తాడు. విలన్ నుంచీ కామెడీ రాబట్టడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ఈ ట్విస్ట్ బాగుంది. పృథ్వీ, తాగుబోతు రమేష్, అలీ మిగతా కమెడియన్లందరూ నవ్వించటానికి తంటాలు పడ్డారు. శాయశక్తులా కృషి చేశారు కూడా. నవ్వితే నవ్వండి.. లేదా మీ ఖర్మ అన్నట్టుంది కామెడీ ట్రాక్ అంతా. ఇక -్ఛటా కె నాయుడు ఫొటోగ్రఫీ బాగుంది. ఒక్కటే లొకేషన్ అయినప్పటికీ.. ఎక్కడా బోర్ కొట్టకుండా.. సూపర్ విజువల్స్‌ని తెచ్చాడు. కథకి ఛాయాగ్రహణం ప్రాణం పోసింది. దర్శకుడు ‘ఫ్లైఓవర్’ కానె్సప్ట్‌పై, స్క్రీన్‌ప్లేపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బావుండేది. అలాగని దర్శకుడు తన పనితనాన్ని చూపించలేకపోయాడని మాత్రం అనలేం.

ప్రనీల్