రివ్యూ

ఇదో ఫిఫ్త్ జ’నేరేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

90ఎంఎల్ * బాగోలేదు
*
తారాగణం: ఓవియా, అనుసోన్‌పాల్, మోనిషారామ్, మసూమ్ శంకర్, బొమ్ము లక్ష్మి, శ్రీగోపిక, తేజ్‌రాజ్, సింబు తదితరులు
సంగీతం: శింబు
నిర్మాణం: నవీజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
కథ, కథనం, దర్శకత్వం: అళగియ అసుర
*
ఐదుగురు అమ్మాయిలు తాము జీవితంలో పొందిన చేదు అనుభవాలకు పరిష్కారం వాళ్లకు నచ్చిన ‘స్వేచ్ఛాయుత’(?) వాతావరణంలో కనుగొన్న సన్నివేశాల మాలికే.. 90ఎంఎల్ -ఇది చాలా తక్కువ. కానీ దాన్ని తెరపై ప్రతిబింబించిన తీరులో అన్నీ ఎక్కువై- ఇది ఏ బాపతు సేచ్ఛ? అసలు వాళ్లు కనుగొన్నవి వాస్తవ పరిష్కారాలేనా? అన్న అసంపూర్తి అభిప్రాయం కలిగింది. అసలు మ్యేటర్ (ఇదే పదాన్ని రకరకాల అర్థాలతో చిత్రంలో వాడారు)లోకి వెళ్దాం.
పెళ్లి అనే కానె్సప్టే సెట్‌కానీ రీటా (ఒవియా) తన బోయ్‌ఫ్రెండ్‌తో ఓ అపార్ట్‌మెంట్‌లో వుంటుంది. ఈమె చొరవా, కలివిడితనం చూసి ఆమెతో పక్క అపార్ట్‌మెంట్స్‌లో వున్న నలుగురు యువతులు తమతమ సమస్యల్ని చెప్పుకుంటారు. వాళ్లంతా కలిసి వాటిని రీటా నాయకత్వంలో ఓ కొలిక్కి తీసుకురావడంతో కథ ముగుస్తుంది.
‘ఇది చాలా తక్కువ’ చూస్తూంటే దర్శక నేతృత్వం వహించినవారికి కంటెంట్‌పై కనీస క్లారిటీ లేదనిపిస్తోంది. మగవాళ్లు గ్రూప్‌గాచేరి బాధల్ని మరిచిపోవడానికో, మరోదానికో కలిసి మందుకొట్టడం జరుగుతోంటే, అదే పంథా స్ర్తిల విషయంలో ఎందుకు కాకూడదన్న భావపరంపరతో సన్నివేశాలు అల్లారా? అన్నదో ప్రశ్న. అసలు ‘స్వేచ్ఛ’ అంటే అదే అన్న భావదారిద్య్రం ఎందుకు వీరికి కలిగిందో అర్థంకాదు. ఎందుకంటే విషయాన్ని సరిగ్గా ఆలోచించే ఎవరైనా సరే అలా దుర్వ్యసనాల బారిన పడటం, అదే స్వేచ్చ అనుకోవడం అన్నదాన్ని అంగీకరించరు? ఇదే సందర్భంలో ఒకచోట సినిమాలో భర్త, ఓ గూండా వద్ద పనిచేడం ఇష్టంలేక చెప్తున్న సంబంధిత సమస్యలూ, చెడ్డ వ్యసనాలకు అలవాటైన తీరునీ ఆలకించిన కౌన్సిలర్, ఆడవాళ్లు అలాగే రోజూ మందుకొడితే అది తట్టుకోలేక మగవాళ్లు మందు మానేస్తారా? అన్న ఓ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతుంది. అలాగే తను ప్రేమించిన వారి పెళ్లి జరిగిపోతోంది అని స్నేహితుల్ని పరుగులు తీయించిన అమ్మాయి, ఆమె ప్రేమించినది మరో అమ్మాయినేనని తెలియజెప్పడం సినిమాలో ఓ ఊహించని ట్విస్టే. కానీ దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ వివాహ అనంతర పరిణామాలూ, పిల్లలు.. అంటూ ఆ మాటున ఘాటు డైలాగులకు స్థానం కల్పించడం తదితరాలూ, విషయం అసలు సంగతినీ, స్ఫూర్తినీ వివరించే బదులు, దాని మాటున సినిమాకు కమర్షియల్ యాంగిల్‌ను కల్పిద్దాం అన్న తృతీయ శ్రేణి అభిరుచే కన్పడింది. విచిత్రమేమిటంటే ఇలాంటి, ఇంకొన్ని శ్రుతిమించిన సంభాషణలు వేటికీ ఆడియెన్స్ నుంచి చిత్ర బృందం ఆశించిన రెస్పాన్సు రాకపోవడం. దీన్ని బట్టి ప్రేక్షకులు ఎంతగా పరిణతి చెందారో అర్థం అవుతుంది. ఆ అంచనాలను అందుకోవడానికి సృజనకారులు ప్రయత్నించాలి తప్ప ఈ మాదిరి తక్కువ స్థాయి ఆలోచనలు రుద్దడానికి ప్రయత్నించకూడదు. ఇంకో అనారోగ్యకర విషయమేమిటంటే- మామూలుగా ఏ చిత్రంలోనైనా సిట్యుయేషన్ డిమాండ్ చేసిందని ఆ సీను పెట్టాం అంటారు. కానీ ఇందులో సందర్భం అంతగా కుదరకపోయినా అసందర్భ ద్వందార్థ (అసలవి అన్నీ ఏకార్థ పదాలే) పదాలు పెట్టి, దానికనుగుణంగా సన్నివేశాలు చుట్టేశారు. ఉదాహరణకు అవయవ వర్ణన, వాటి పరిణామాలు చెప్పడం విషయంలో అన్ని పరిధులు దాటేశారు. అసలది ఏరకంగా చిత్రానికి కనెక్ట్ అవుతుందో అర్థంకాదు. అదేవిధంగా భర్త, అతని తల్లిదండ్రుల బలవంతంతో అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయితో వైవాహిక సంబంధం నెరపడు. దానికి కారణంగా నేను ముందు అమ్మాయిని మరువలేకపోతున్నానని చెప్తాడు. ఈ కారణం తెలుసుకునేముందు అతనికి ‘రిమోట్’ లేదా? బ్యాటరీ ఛార్జింగ్ చేయాలా? వంటి మోటు మాటలు వాడాలా? అసలవి సెన్సారు ఏ రీతిలో వదిలారో కూడా అన్నదీ అనూహ్యం. దానే్న అర్థమయ్యే రీతిలో సరళంగానూ చెప్పచ్చు. ఇక చివరలో అందరి సమస్యలూ తీర్చిన రీటా అభిప్రాయమైన పెళ్లి, ఆ కానె్సప్టు నచ్చనితనం, నేనూ అదే భావాలతో వున్న వ్యక్తి చెంతే ఉంటానన్నదీ సింబు పాత్ర ప్రవేశంతో తీరడం చూపారు. మరి ఆ కాస్సెప్టూ, పరిణామాల్ని కూడా విశే్లషిస్తే బావుండేది. అక్కడా డైరెక్షన్‌లో ఎస్కేపిజమే కనిపించింది. పాత్రధారుల్లో వాస్తవానకి రీటా పాత్రధారిణి (ఒవియా) తెలుగు అనువాద చిత్రంలో ఆమె పాత్ర పేరునే నటి పేరుగా చూపారు)దే పూర్తి స్థాయిలో ఉన్న రోల్ అయినా, అపర్ణ పాధ్రారణి నటనే ఆకట్టుకుంది. మిగతావారంతా పాత్రల పరిధుల మేరకు నటించారు. చివర్లో ప్రముఖ నటుడు సింబు కనిపిస్తాడు. ఆయనే స్వరపర్చిన పాటల్లో అన్నీ చిత్ర మూలం (90 ఎంఎల్ అన్న తమిళ చిత్రానికి తెలుగు రూపం) బాపతు వాసనలే ఆద్యంతం దోబూచులాడాయి. ‘మందుకొట్టు.. మందుకొట్టు’ పాటలో అయితే ఆ లక్షణం మరీ విజృంభించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ పాట కూర్పులో ఒక చోట ‘ఇవాళ నైట్, ఏదైనా రైట్’ అన్నది కొత్త సంవత్సరపు ఉత్సవాల తీరుతెన్నుల వికృతాన్ని చెప్పేసింది. సంభాషణలు ఇందాక చెప్పుకున్నట్లు అనేకచోట సభ్యతా ప్రమాణాల్ని దాటేసినా కొన్నిచోట్ల మంచివి వాడారు. ‘ఏఅమ్మాయి అయినా పడిపోయేది నిజం చెప్తేనే’, ‘ప్రేమలోనైనా విఫలముంటుందేమో కానీ, ఫ్రెండ్‌షిప్‌లో విఫలత ఉండదు’ వంటివి అందుకు ఎగ్జాంపుల్స్. కానీ చిత్రంలో రీటాపాత్ర చేత ‘నేను బిగ్‌బాస్‌నే మీటయ్యిందాన్ని’ (వాస్తవ జీవితంలో రీటా పాత్రధారిణి ఓవియా తమిళ బిగ్‌బాస్ టీవీ షోలో పాల్గొన్నవారు) లాంటివి అనవసరమనిపించాయి. ఓపాటలో ‘అమ్మా నాన్నలతోఏమి చెప్పం, ఫ్రెండ్స్‌తో ఏమీ దాచం’ అన్న పద స్ఫూర్తిని ‘ఇది చాలా తక్కువ’లో సక్రమ రీతిలో చూపి ఉంటే ...తక్కువను మక్కువతో చూడగల్గేవారు.

-అన్వేషి