తెలంగాణ

గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంకలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం ఘటనలో మూడో నిందితుడు రాకేష్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి మీడియా ముందు హాజరు పరిచారు. ఈ కేసులో ఇప్పటికే అంజయ్య, శ్రీనివాస్ అనే యువకులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి బంధువులు దాడి చేయడంతో గాయపడిన ఈ ఇద్దరు నిందితులను వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో పోలీసులు చేర్పించారు. వైద్య చికిత్స ముగియడంతో అంజయ్య, శ్రీనివాస్‌లను ఈరోజు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. యువతిపై అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వేధింపులు ప్రారంభించడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.