రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం.. 95 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన పరివారంతో కలిసి భరతుడు భరద్వాజుడి ఆతిథ్యం స్వీకరించి, ఆ రాత్రి అక్కడ గడిపి వెళ్లడానికి అనుమతి కోసం ఆయన దగ్గరికి వెళ్లాడు. చేతులు జోడించి తన దగ్గరికి వచ్చిన భరతుడ్ని సంధ్యావందనం పూర్తి చేసుకుని ఆశ్రమం నించి బయటకి వచ్చిన గొప్ప తేజస్సు గల ఆయన చూసి అడిగాడు.
‘పాపం చేయని ఓ భరతా! మా ఆశ్రమంలో ఈ రాత్రి నీకు సుఖంగా గడిచిందా? నీ పరివారం అంతటికీ పూర్తి ఆతిథ్యం లభించిందా? చెప్పు’
ఆ మహర్షికి చేతులు జోడించి నమస్కరించి భరతుడు జవాబు చెప్పాడు.
‘ఓ పూజ్యుడా! మంత్రులతో కూడిన నేను, నా సమస్త సైన్యం, వాహనాలు కూడా నువ్వు ఇచ్చిన సమస్త భోగాలతో తృప్తి చెంది సుఖంగా ఉన్నాం. మా పరిచారికలు దగ్గర నించి మేమంతా కూడా శ్రమ, సంతాపం తొలగి మంచి భోజనాన్ని తిని, మంచి ఇళ్లల్లో సుఖంగా ఉన్నాం. ఓ మహర్షి! నేను ఇక వెళ్లడానికి అనుమతిని కోరుతున్నాను. అన్న దగ్గరికి ప్రయాణమైన నన్ను స్నేహంగా చూడు. ధర్మాలు తెలిసిన నువ్వు ధార్మికుడవైన ఆ మహాత్ముడి ఆశ్రమానికి ఎంత దూరమో, దారేదో చెప్పు’
అన్నని చూసే ఆసక్తిగల భరతుడికి మహర్షి చెప్పాడు.
‘్భరతా! ఇక్కడ నించి ముప్పై మూడున్నర యోజనాల దూరంలో నిర్జన వనంలో అందమైన సెలయేళ్లు, అడవులు ఉన్న చిత్రకూటమనే పర్వతం ఉంది. దాని పశ్చిమ భాగంలో మందాకినీ నది ఉంది. దాని తీరంలో పుష్పించిన వృక్షాలు దట్టంగా కనిపిస్తాయి. దానికి రెండు వైపులా పూలతో వికసించిన అందమైన అరణ్యాలు కూడా ఉంటాయి. ఆ నదికి అవతల చిత్రకూట పర్వతం ఉంది. దానిపైన పర్ణశాలలో రామలక్ష్మణులు నివసిస్తున్నారు. సేనాధిపతైన నువ్వు ఏనుగులు, గుర్రాలు, రథాలు గల నీ సైన్యాన్ని దక్షిణ మార్గంలో కాని, నైరుతీ మార్గంలో కాని నడిపించి వెళ్తే రాముడు కనిపిస్తాడు.’
ప్రయాణం గురించి విన్న దశరథుడి భార్యలు తమ వాహనాల నించి దిగి భరద్వాజ మహర్షి చుట్టూ చేరారు. వారిలో కృశించి, దీనురాలై, వణికే కౌసల్య, సుమిత్ర మహర్షి పాదాలని తాకి నమస్కరించారు. తన కోరిక నెరవేరని, సర్వలోకాలతో నిందించబడ్డ కైకేయి సిగ్గుపడుతూ భరద్వాజుడి పాదాలని తాకి నమస్కరించింది. ఆయనకి ప్రదక్షిణ చేసి దీనమైన మనసుతో భరతుడి దగ్గర నిలబడింది.
భరతుడు నమస్కరించి చెప్పాడు.
‘ఓ మహామునీ. దీనురాలై, శోకంవల్ల, ఉపవాసాల వల్ల కృశించి, దేవతలా ఉన్న ఈమె మా నాన్నగారి పట్టపురాణి కౌసల్య. సింహం లాంటి పరాక్రమంతో నడిచే రాముడ్ని ఈమె, అదితి ధాతని కన్నట్లు కన్నది. విచారించే మనసుతో వనం మధ్యలో పూలు రాలిన చెట్టు కొమ్మలా కాంతిహీనమై కౌసల్య ఎడమ వైపున్నది సుమిత్ర. దేవతలతో సమానులు, వీరులు, సత్యపరాక్రమవంతులైన లక్ష్మణ, శత్రుఘు్నలు ఈమె కొడుకులు. కోప స్వభావం కలది, వివేకం లేనిది, గర్విష్ఠి, తనే అందమైనదనే గర్వం గలది, ఐశ్వర్యం మీద కోరిక కలది, ఆర్యురాలులా కనిపించే అనార్యురాలు, క్రూరురాలు, పాప నిశ్చయం గలదైన ఈమె నా తల్లి కైకేయి. ఈమె వల్లే రామలక్ష్మణులకి మరణం లాంటి అరణ్యవాసం ప్రాప్తించింది. దశరథ మహారాజు పుత్ర వియోగంతో బాధపడుతూ స్వర్గస్థుడయ్యాడు. ఈమె నాకు వచ్చిన ఈ గొప్ప బాధకి మూల కారణం.’
భరతుడు ఎర్రబడ్డ కళ్లతో, గద్గదంగా చెప్పి పగబట్టి బుసలు కొట్టే పాములా నిట్టూర్చసాగాడు. బుద్ధిశాలైన భరద్వాజుడు మంచి, అర్థం గల ఓ మాటని చెప్పాడు.
‘్భరతా! నువ్వు కైకేయి చేసిన దోషాన్ని చూడద్దు. రాముడి అరణ్యవాసం వల్ల ముందు, ముందు సుఖకరమైన మంచి ఫలితం లభిస్తుంది. రాముడు అడవికి వెళ్లడం వల్ల దేవతలకి, పరిశుద్ధ మనసు గల ఋషులకి మంచే కలగబోతోంది.’
భరతుడు మహర్షికి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆయన అనుమతితో ‘ప్రయాణానికి సన్నాహం చేయండి’ అని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. తర్వాత అనేక రకాల ప్రజలంతా ప్రయాణానికి సిద్ధమై, మెరిసే బంగారంతో అలంకరించిన గుర్రాలు కట్టిన రథాలు ఎక్కారు. బంగారు నడుము తాళ్లు, పతాకాలు ధరించిన ఏనుగులు, ఆడ ఏనుగులు వర్షాకాలంనాటి మేఘాల్లా ధ్వనులు చేస్తూ బయలుదేరాయి. చిన్నవి, పెద్దవైన అమూల్యమైన అనేక వాహనాలు కూడా బయలుదేరాయి. కాలిబంట్లు కాలినడకనే వెళ్లారు. కౌసల్య మొదలైన ఆడవాళ్లు రాముడ్ని చూస్తామనే సంతోషంతో ఉత్తమమైన వాహనాలు ఎక్కి వెళ్లారు. శ్రీమంతుడైన భరతుడు చంద్ర, సూర్యుల వంటి కాంతి గల మంగళకరమైన రథాన్ని ఎక్కి సపరివార సమేతుడై వెళ్లాడు.
ఏనుగులు, గుర్రాలు రథాలతో నిండిన ఆ మహాసేన పైకి లేచిన మహామేఘంలా దక్షిణ దిక్కుని ఆవరిస్తూ మృగాలు, పక్షులతో నిండిన అడవుల్ని దాటి గంగ అవతలి ఒడ్డున గల పర్వతాలు, నదుల మీదుగా ప్రయాణం చేసింది. ఉత్సాహంగల ఏనుగులు, గుర్రాలు, యోధులు గల భరతుడి సేన మృగాలని, పక్షులని భయపెడుతూ ఆ మహావనంలోకి ప్రవేశించి ప్రకాశించింది.
(అయోధ్యకాండ 92వ సర్గ)
అడవిలోని జంతువుల నాయకులైన మదించిన జంతువులు వెళ్తున్న ఆ మహాసైన్యాన్ని చూసి భయపడి తమతమ మందలతో పరిగెత్తాయి. పారిపోతున్న ఎలుగుబంట్లు, చుక్కలు లేని పెద్ద కొమ్ముల లేళ్లు, చుక్కల లేళ్ల గుంపులు అడవిలోను, పర్వతాల మీద, నదుల్లో అన్ని వైపులా కనపడుతున్నాయి. ధర్మాత్ముడైన భరతుడు శబ్దం చేసే ఆ గొప్ప చతురంగ బలంతో ఉత్సాహంగా బయలుదేరాడు. సముద్ర ప్రవాహం లాంటి భరతుడి సేన వర్షాకాలంలో మేఘం ఆకాశాన్ని కప్పేసినట్లుగా భూమిని కప్పేసింది. ఆ సమయంలో మహా వేగం గల గుర్రాలు, ఏనుగులు అంతటా వ్యాపించి ఉండటంతో నేల చాలాసేపటి దాకా కనపడలేదు. వాహనాలన్నీ బాగా అలసిపోయేట్లు, చాలా దూరం ప్రయాణం చేసాక భరతుడు మంత్రుల్లో శ్రేష్ఠుడైన వశిష్ఠుడితో చెప్పాడు.
‘ఈ పరిసరాలన్నీ కనపడేదాన్ని, నేను విన్నదాన్ని బట్టి మహర్షి చెప్పిన ప్రదేశానికి వచ్చామని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పర్వతమే చిత్రకూట పర్వతం. ఇది మందాకినీ నది. దూరంగా ఉన్న ఆ వనం నీలమేఘంలా ప్రకాశిస్తోంది. పర్వతాల్లాంటి నా ఏనుగులు ఇప్పుడు అందమైన చిత్రకూట పర్వత చరియల్లో నడుస్తున్నాయి. ఈ పర్వత చరియల్లో ఉన్న వృక్షాలు వర్షాకాలంలో నల్లటి దట్టమైన మేఘాలు నీటిని వర్షించినట్లు పూలని వర్షిస్తున్నాయి. శతృఘ్నా! కిన్నరుల సంచార భూమైన ఈ పర్వతం, మొసళ్ల చేత సముద్రం వ్యాపించబడినట్లు, మృగాల చేత వ్యాపించి ఉంది చూడు. సైన్య కోలాహలంతో భయపడి పరిగెత్తే ఈ జంతువుల గుంపులు శరత్ కాలంలో ఆకాశంలో గాలితో చెదరగొట్టబడ్డ మేఘాల పంక్తిలా ప్రకాశిస్తున్నాయి. దక్షిణ దేశపు మనుషులు తమ తలల మీద పరిమళించే పూలని అలంకరించుకున్నట్లుగా, ఈ పర్వత లోయలు పై భాగంలో మేఘాల్లాంటి శిలాఫలకాలని అలంకరించుకున్నాయి. చూడటానికి భయంగా ఉన్న ఈ అడవి ఇంతదాకా పెద్ద శబ్దాలు లేకుండా ఉండి ఇప్పుడు మన రాకతో జనాలతో నిండిన అయోధ్యలా కనపడుతోంది.’

(అయోధ్యకాండ 93వ సర్గ 14వ శ్లోకం దాకా)

హరిదాసు కథ ముగించి స్టేజి దిగాక ఓ వృద్ధ శ్రోత చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.

‘ఈ హరిదాసు తప్పులు చెప్పకుండా హరికథని చెప్పడు కదా? ఈ రోజూ ఏడు తప్పులు చెప్పాడు’
మీరు ఆ తప్పులని కనుక్కోగలరా?
*
1.ఐదు ఆమడల భూమి చదును చేయబడింది. కాని ఈ కొలతని హరిదాసు చెప్పలేదు.
2.రామాయణంలో వాల్మీకి జామ, సీతాఫలం గురించి రాయలేదు. హరిదాసు చెప్పింది తప్పు.
3.సేనాపతి కింది అధికారి పేరు ప్రశాస్తగా వాల్మీకి చెప్పాడు. ఇది హరిదాసు చెప్పలేదు.
4.బ్రహ్మ, కుబేరుడు పంపిన స్ర్తిల సంఖ్య తలో ఇరవై వేల మంది. ఈ సంఖ్యని హరిదాసు చెప్పలేదు.
5.భరతుడి ఎదుట నృత్యం చేసిన నలుగురు అప్సరసల పేర్లు అలంబుస. మిశ్రకేశి,
పుండరీక, వామన. హరిదాసు ఈ పేర్లు చెప్పలేదు.
**
మీకో ప్రశ్న
*
చిత్రకూటం ప్రస్తుతం ఎక్కడ ఉంది?
===== = = = = = = =
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
భరద్వాజుడి తండ్రి ఎవరు? బృహస్పతి

-మల్లాది వెంకట కృష్ణమూర్తి