పజిల్

పజిల్ 600

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.అక్కడ హిమాలయాల్లో ఒకడు పారా
కాస్తుంటేనే, ఇక్కడ మనం ‘...’
తినగలుగుతున్నాం (4)
4.ఆశ్రమం నంబర్ నాలుగు (4)
6.ఎవరెస్టు శిఖరము దీనిపైనే ఉంది (5)
7.నాగలిచే దున్నినా ఇలాంటి విత్తనం వేస్తే ఇలాంటి కాయే కాస్తుంది (2)
8.దేవుడి చుట్టూ చేసేది (4)
10.విదేశవాసం. ‘వల’ పొంచి ఉంది జాగ్రత్త (3)
12.నక్షత్రం. చుక్క... తిక్క మాత్రం కాదు (2)
13.ప్రకంపన సృష్టించే ముండ్లమండ (2)
16.‘...’ ఇసుమున తైలంబు తీయవచ్చు’
అన్నాడు కవి (3)
18.తిరోగతిలో ‘పురోగతి’ (4)
20.తిరగేసిన చెట్టు (2)
21.‘....తుంది’ అనేది ముంచుకొచ్చే
ప్రమాదానికి జాతీయం (5)
23.ఈ రాజు ఒక దిగంబర కవి (4)
24.వ్యర్థమైన ఆశ (4)
*

నిలువు

1.పదబంధ ప్రహేళికలో సగం తిరగబడింది (4)
2.‘...’ రామప్రభో, దేహి రామప్రభో’ కీర్తన (2)
3.ఈ గ్రంథం పేరులోనే మాయ. మరి
మాయలేడి ఉండదా? (4)
4.అలనాటి సినీ గేయకారుడు.
కనిపించడం లేదా ఆ ‘ముద్రా’! (4)
5.విష్ణువు (4)
9.రాజు, భూమీశుడు (4)
10.దీని పలుకే బంగారం కొందరికి
భోంచెయ్యగానే! (2)
11.ఈ స్నానాలు భార్యాభర్తలు కలిసి
నదిలో చేసేవి (4)
14.మార్గము (2)
15.చీనాంబరము (4)
17.ముందు ఆలకించు. అల్లదిగో ఆపై కొండే ఆ ఊరు (4)
18.ఎదురుతిరిగిన అనుమతి (4)
19.ఊరి చివర. బస్తాలు కుట్టే తాడు వంటి దారం గూడా..
ఓ పురుగు కూడా (4)
22.ఆలయము (2)

నిశాపతి