తెలంగాణ

పిఎస్‌ఎల్‌వి ప్రయోగంలో సూర్యాపేట శాస్తవ్రేత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 17: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నుండి ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి -సి 29 రాకెట్ ప్రయోగంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన శాస్తవ్రేత్త చెరుకుపల్లి వెంకటరమణ పాల్గొని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సింగపూర్‌కి చెందిన ఆరు ఉపగ్రహాలను అనుకున్న కక్ష్యలోకి పంపి ఈ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో కీలకంగా పనిచేసి ఖ్యాతి పొందారు. పాతికేళ్లుగా అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో పనిచేస్తూ సీనియర్ శాస్తవ్రేత్తగా పేరొందారు. ప్రస్తుతం శ్రీహరికోటలో సతీష్‌ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఆయన పనిచేస్తున్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తూ నిరుపేద కుటుంబంలో జన్మించిన వెంకటరమణ పట్టుదలతో చదివి అత్యున్నత స్థాయికి ఎదిగారు. గణేష్‌నగర్‌కు చెందిన చెరుకుపల్లి లింగయ్య సరోజినిల ప్రథమకుమారుడైన వెంకటరమణ కళాశాల చదవువరకూ ఇక్కడే పూర్తిచేశారు. హైదరాబాద్‌లో ఈఈఈ చేసి 15 ఏళ్ల పాటు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని అంతరిక్ష కేంద్రంలో శాస్తవ్రేత్తగా పనిచేశారు.