తెలంగాణ

పోలీస్ స్టేషన్ ఎదుట యువకుని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: ప్రేమపేరుతో వేధిస్తున్నట్లు తనపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడిన యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుమందు తాగి సోమవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మారం పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. రామడుగు మండలం రామచంద్రపురానికి చెందిన వినోద్ ప్రేమపేరుతో కొంతకాలంగా ఓ యువతి వెంట పడుతున్నాడు. గతంలో ఆమె ఫిర్యాదు చేసినపుడు పోలీసులు వినోద్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌనె్సలింగ్ జరిపి పంపేశారు. అయినప్పటికీ వినోద్ ఆమెను వేధిస్తునే ఉన్నాడు. దీంతో మరోసారి యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈసారి పోలీసులు తనను కొడతారన్న భయంతో వినోద్ పురుగుమందు తాగి పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు.