ఆంధ్రప్రదేశ్‌

నిరాటంకంగా పోలవరం పనులు: దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అభివృద్ధిని అడ్డుకునే వారు ఎన్ని ఆరోపణలు చేసినా పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను నిలిపివేసే ప్రసక్తే లేదని, అనుకున్న గడువుకు పనులను పూర్తి చేస్తామని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా జలాల మట్టం బాగా అడుగంటినందున గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కేందుకు 5 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ బోర్డును కోరామన్నారు. రాష్ట్రంలో ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ఓ ఉద్యమంలా కొనసాగిస్తున్నామని, నీరు-చెట్టు కార్యక్రమానికి అన్ని జిల్లాల్లోనూ మంచి స్పందన కనిపిస్తోందన్నారు.