ఆంధ్రప్రదేశ్
అలాంటి తప్పు బిజెపి చెయ్యకూడదు: పవన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 30 April 2016
హైదరాబాద్: అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన తప్పు చేసిందని, ప్రత్యేకహోదా హామీని విస్మరించి నేడు బిజెపి అలాంటి తప్పుచేయకూడదని తాను కోరుకుంటున్నానని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేకహోదా అవసరం లేదంటూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ తన మనోభావాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సరిగ్గా రెండేళ్ల క్రితం సీమాంధ్ర ఎంపీలను తన్ని, పార్లమెంటు నుంచి గెంటివేసి కాంగ్రెస్ ఘోరమైన తప్పు చేసిందని, ఆ అవమానాన్ని సీమాంధ్రవాసులు మరచిపోలేదు, మరచిపోరు కూడా అని ఆయన అన్నారు. ప్రత్యేకహోదాపై ప్రజలు ఉద్యమించకముందే అధికార పార్టీ ఎంపీలు అందరినీ కలుపుకుని పోరాడాలన్నారు.