ఆంధ్రప్రదేశ్‌

పోలీసుల అదుపులో దర్శనం టికెట్ల దళారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఫిబ్రవరి 12: టిటిడి దర్శన టికెట్లను బ్లాక్‌లో విక్రయించిన ఓ దళారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఈ వ్యవహారం బట్టబయలైంది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తన సమీప బంధువైన నవ వధూవరులతో శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. తన సిఫార్సు ఉత్తరంపై తనతోపాటు మరో నలుగురికి దర్శనం టికెట్లు పొంది శుక్రవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద వేచివున్నారు. అక్కడ టికెట్లను టిటిడి సిబ్బంది తనిఖీ చేసే సమయంలో వాటిపై ముద్రించిన భక్తుల పేర్లలో మార్పులు ఉండటంతో వారిని దర్శనానికి అనుమతించలేదు. దీంతో ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి అక్కడున్న సిబ్బందికి నచ్చజెప్పినా ససేమిరా అనడంతో తన సిఫార్సు ఉత్తరాన్ని తిరుమల జెఇఒ ఆఫీసులో దరఖాస్తు చేసిన తన పిఆర్వో, శ్రీనివాసులు అనే మరో వ్యక్తిని అక్కడకు పిలిపించారు. అతన్ని విచారించగా ఎమ్మెల్యే సిపార్సు ఉత్తరంపై దర్శనానికి వెళ్లే భక్తుల పేర్లను మార్పు చేసి మరో బృందానికి చెందిన పేర్లను నమోదుచేసి టికెట్లు పొందినట్లు అంగీకరించాడు. నాలుగు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను రూ.16వేలకు, 2 సుప్రభాత టికెట్లను 5వేలకు గుంటూరుకు చెందిన ప్రకాష్ అనే భక్తునికి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకునట్లు అంగీకరించాడు. విషయం తెలియని ఎమ్మెల్యే తనతోపాటు వచ్చిన భక్తులను దర్శనానికి తీసుకువెళ్లడంతో దళారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆగ్రహించిన ఎమ్మెల్యే అతనిపై కేసు నమోదుచేయాలని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదుచేయగా వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.