తెలంగాణ

పండ్ల పక్వంలో ఆగని రసాయనాల వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పండ్ల పక్వానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఫిబ్రవరి 1వ తేదీన రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. కృత్రిమ పద్ధతుల్లో పండ్లను మగ్గపెడుతున్న అభియోగంపై హైకోర్టు చేసిన సూచనలను చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టుకు నివేదికలు ఇవ్వడం తప్ప కింది స్ధాయిలో రెండు ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి చెప్పుకోదగిన చర్యలు చేపట్టలేదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో కోర్టు నియమించిన అమికస్ క్యూరీ మాట్లాడుతూ కర్నాటక, మహారాష్టత్రో పోల్చితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ సెక్యూరిటీ విభాగంలో తగిన సిబ్బంది లేరన్నారు. వివరాలు సమర్పించేందుకు మరికొంత గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. హైకోర్టు ఆదేశించినట్లుగా ఇథిలిన్ చాంబర్స్ ఏర్పాటుకు 8.3 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని ఏపి ప్రభుత్వం తెలిపింది. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది.