Others

యూ ట్యూబ్ దారుణ దురంతాలు ( వార్త - వ్యాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సెల్ఫీ’ల తరువాత విపరీతమయిన ‘క్రేజ్’, పిచ్చి వ్యామోహం జనాలలో తీసుకొచ్చినవి ‘యూట్యూబ్’ వీడియోలు.
అతడి పేరు పి.కె. సలీమ్. యాభై సంవత్సరాల వయసున్న హెడ్ కానిస్టేబుల్. మన రాజధాని నగరం ఢిల్లీ మె ట్రోలో తాగిన మైకంలో నానా యాగీ చేశాడంటూ చూపించే- ముప్ఫై ఏడు సెకనులు సాగిన చిన్న వీడియోను లక్షలాదిమంది జనం చూశారు. రోజుకో రెండు లక్షల ‘క్లిక్’లు తగిలాయి. ఆగస్టు 19, 2015 నాటి రాత్రి ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ అనామక విషపూరిత వీడియో ఆధారంగా అతణ్ని నవంబరు 5వ తేదీ నాడు సస్పెండ్ చేశారు. దాంతో సలీమ్ షాకైపోయాడు. ‘నేను తాగి తూలలేదు. ఆ వీడియోలో చూపింది నిజం కాదు. నేను తూలిపోయి పడిపోయి ప్రాణాలతో బయటపడటమే కష్టం అయింది. అది పక్షవాతం స్ట్రోక్..’-అంటున్న అతని రోదన అరణ్యరోదనే అయింది. సలీమ్ ఇంట్లో పక్షవాతాన పడ్డ ఎనభై ఏండ్ల వృద్ధుడైన తండ్రి ఉన్నాడు. పత్రికలన్నీ ప్రముఖంగా వేసిన ఈ వార్తతో అతను మరింత కుంగిపోయాడు. సలీం భార్య బాధతో నీరసించిపోయింది. దాంతో గుండెపోటు వచ్చిందామెకు. సలీం మామూలు మనిషి కాడు. చాలా పరువు ప్రతిష్ఠలున్న వ్యక్తి. దిల్లీ మాజీ సిఎం షీలాదీక్షిత్‌కి, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం వద్ద లోగడ సెక్యూరిటీగా పనిచేసినవాడు. నిరంతర అనారోగ్యం, మెదడుకు చెందిన నరాల వ్యాధి కారణంగా అతను జనరల్ సిబ్బందిలోకి బదలీ తెచ్చుకున్నాడు. శరీరంలోని కొన్ని భాగాలు పక్షవాతానికి గురైపోయాయ. ఆరోజు రాత్రి డ్యూటీలో 9.30దాకా వుండలేకపోయినా ఎలాగో పూర్తి చేసి మరీ మెట్రో రైలెక్కాడు. వొళ్లు తూలడం మొదలయింది. కనులు బైర్లు కమ్ముతున్నాయ్. మంచినీళ్ల బాటిల్‌ని తీసుకుందామని వంగినవాడు అలాగే దొర్లిపోతూ సర్దుకున్నాడు. నరాలు అస్వాధీనమైపోయాయ్. అతని తూలుడు, దుర్భర అవస్థలన్నీ తాగుబోతు చేష్టలనుకుని ‘వీడియోలు’ వినోదంగా తీసిన కొందరు గొప్పగా ‘యూట్యూబ్’లోకి ఎక్కించారు. పత్రికలు, టీవీ చానళ్లు వేలం వెర్రిగా ఈ సంఘటనను ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా పదే పదే ప్రకటించి అతణ్ని, అతని సంసారాన్ని నిర్దాక్షిణ్యంగా ‘బదనామ్’ చేశాయి. కానీ, ఢిల్లీ పోలీసు కమిషనర్ వాస్తవాన్ని తెలుసుకొని ‘బస్సీ’గారు తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నాడు. అయతే, అప్పటికే ఈ కేరళ రాష్ట్ర వాస్తవ్యుడికి సొంత వూళ్లో కూడా పేరు ప్రతిష్ఠలు పోయాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి వ్యక్తి పరువు ప్రతిష్ఠలలో జీవించే హక్కు యిస్తున్నది. సలీం పోరాటానికే సిద్ధపడ్డాడు. సోషల్ మీడియాలు చేస్తున్న ఇలాంటి ఘోర నేరాలను ఎండగడుతూ సుప్రీంకోర్టుకు ఎక్కి లక్షల పరిహారం కోరుతున్నాడు. చిత్రం ఏమిటంటే- నాడు అతడొక తాగుబోతు, తన ఉద్యోగం పట్ల ద్రోహం చేశాడంటూ ‘టాంటాం’ చేసిన మీడియా అతను నిర్దోషిగా విడుదలయితే దాని గురించి ఓ నాలుగు ముక్కలు- ‘సలీం నిర్దోషిగా తిరిగి ఉద్యోగంలో పెట్టుకోబడ్డాడు’ అని వార్త ఇవ్వలేదు. యూట్యూబ్‌కి సదరు వీడియో ఎక్కనూ లేదు. ఇదంతా కలికాలం మహిమ!
స్ర్తిల పాదాలు కడిగే గురువారం
గుడ్‌ఫ్రైడేకి ముందు గురువారం (24 మార్చి) ‘మాండీ గురువారం’ అంటే అది క్రైస్తవులకి పవిత్ర గురువారం. ఇలాగే పై ఏడాదిలో ఈ పవిత్ర గురువారం ఏప్రిల్ 13న పడ్డది. ఈసారి మాండీ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా చర్చిలలో ఫాదర్‌లు అంటే ‘మతగురువులు’ ఎంపిక చేయబడ్డ ఆడవాళ్ల పాదాలు కడుగుతారు. వారు వృద్ధ నారీమణులే కానక్కరలేదు. ఏ వయస్సువారైనా ఆ రోజు ‘ప్రీస్టులు’ వనితల పాదాలను కడగాలంటూ ఆదేశాలందాయి.
రెండు వేల సంవత్సరాల తరువాత చర్చిలన్నింటికీ ఈ ఫర్మానా అందింది. ఒకప్పుడు ఏసుక్రీస్తు ‘లాస్ట్ సప్పర్’ తరువాత తన పనె్నండు మంది శిష్యుల పాదాలు కడిగి తన ఆదేశామృతాన్ని వాళ్లకి ప్రసాదించాడు. అందుకు ఈ సాంప్రదాయం వచ్చింది. కానీ, ‘ప్రాచ్య సాంప్రదాయాలు పాటించే ఇండియాలోని కొన్ని క్యాథలిక్కు చర్చ్‌ల మతగురువులు ఇందుకు గట్టిగా తిరస్కరిస్తూ ‘పోప్’కి నేరుగా- ముఖ్యంగా మలబారు చర్చీలవారు ఉత్తరాలు రాసుకున్నారు. పితృస్వామిక సంప్రదాయాలను పాటించే క్యాథలిక్కులు స్ర్తి పాదాలను కడగటమా? అని తటపటాయిస్తూ ఉన్న దశలో ‘వాటికన్ ఉత్తర్వులు’ కొంచెం సడలించారనీ- పురుషులు కూడా ఈ సత్కారానికి అర్హులు అనీ ప్రకటించారు.
నిజానికి పోప్ ఫ్రాన్సిస్‌గారే తాను పోప్‌గా ఎన్నోకోబడిన వెంటనే ‘రోమ్’లో ఉన్న జైలుకి పోయి అక్కడ వున్న ఖైదీల పాదాలు కడిగారనీ, అటువంటిది ఆడాళ్లు , మగాళ్లు అంటూ మిగీతా ఫాదర్‌లు విచక్షణగా తటపటాయించడం ధర్మమా? అని ఆధునిక క్యాథలిక్కు స్ర్తిలు ప్రశ్నిస్తూన్నారట!
ఆవు కోసం ఆలినే వదిలేసిన ‘అలీ’!
గోమాంసం తినడం ఒక వీరోచిత ఘనకార్యంగా ప్రచారం చేయబడుతున్న రుూ రోజుల్లో- ఒక ముసల్మాన్ మహనీయుడు అఫాక్ అలీ- ‘‘నీకు ఆవు కావాలా? ఆలి కావాలా? తేల్చుకో’’ అని భార్య అఫ్రోజ్ జహాన్ నిలదీస్తే, ఆవు మెడ పట్టుకొని తన గుండెలకి హత్తుకున్నాడు. పదమూడు సంవత్సరాలైంది, వెళ్లిన ఆమె ఇప్పటికీ తిరిగి రాలేదు.
ఆలీగారి గ్రామం- కాన్పూర్ దరి ఇటవా జిల్లాలోని బైస్ ఖ్వాజా. ఇతని ఇరుగుపొరుగు రాజీకి ప్రయత్నం చేశారు. ఆమె ‘ససేమిరా’ అంది. అతను ఆవుకోసం శాఖాహారి అయిపోయాడు. ఒక ఆవు కాస్తా అతని దొడ్లో యివాళ 14 ఆవులు అయినాయి. వాటికోసం పచ్చగడ్డి అడవికిపోయి కోసుకొస్తాడు. 55 ఏండ్ల వయసులో కూడా పశుగ్రాసం అంతా స్వయంగా మోసుకొస్తాడు. ఆవుల్ని ఎంతో ప్రాణపదిలంగా చూసుకుంటాడు. వాటిని పశువుల ఆసుపత్రికి తీసుకుపోయి చెక్‌అప్ చేయిస్తాడు.
అతని స్నేహితుడు అన్వర్ మియాఁ ఇలా చెప్పాడు. ‘ ముప్ఫై ఏండ్లుగా అలీ మారలేదు. ఇదే తీరు సాబ్.. ఉత్త ఆవుల పిచ్చోడు మావాడు’.
‘కిలిమంజారో హీరో’ కోరిక!
ఆఫ్రికాలో ఒంటరిగా నిటారుగా నిలబడ్డ ఏకైక అందాల పర్వత శిఖరం కిలిమంజారో. ఇండియాలో ఒక వంద స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మింపజేసే నిమిత్తం అతను ఈ శిఖరాన్ని అధిరోహించాడు. 45 సంవత్సరాల వయస్సుగల ఒక కెనడా ఇండియన్ (ఎన్‌ఆర్‌ఐ) వ్యాపారి ఈ కిలిమంజారో శిఖరాన్ని ధైర్యంగా అధిరోహించి జెండా పాతాడు.
టాయ్‌లెట్స్ లేక లక్షలాదిమంది పిల్లలు అతిసార వ్యాధితో దుర్మరణం పాలవుతున్నారు. మా దేశంలో యిది ఘోర సమస్య అన్నాడు ఫిబ్రవరి 29న కొండ అంచుమీద నిలబడి. ఆ విధంగా అరవై వేల డాలర్‌లు సంపాదించాడు.
ఈ పైకంతో దీనికి మరికొంత చేర్చి ఇండియాలో ఓ వంద స్కూళ్లలో టాయ్‌లెట్స్ కట్టిస్తానన్నాడు. ‘‘మరుగుదొడ్డి లేని కారణంగా ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాను నేను’’ అంటూ కనుకొలకులలో నిల్చిన నీళ్లను ఒత్తుకున్నాడు’’ గిరీష్ అగ్రవాల్. నిజంగా అగ్రగణ్యుడు! శభాష్!!

- వీరాజీ veeraji.pkm@gmail.com