Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ హెచ్చుతగ్గులు మనకేల? హీనమవియు
నవయవములన్ని దేహికి నవసరమ్మె;
దేని ప్రాశస్త్యమద్దానికేను సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: హెచ్చుతగ్గులు అనే భేదభావం ఎంతో హీనమైనది. అవయవ ప్రాశస్త్యం అనేది దేహానికి ఎంతో అవసరం కదా! దేని ప్రాశస్త్యం దానికున్నపుడు ఈ రకమైన భేదభావాలు సరికావని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!
తే.గీ పరులకుపకారమునుఁ జేయవలయునయ్య
ఆశపడబోకు పరద్రవ్యమది పిశాచి!
మలినమవ్వంగరాదుగా మనుజ జన్మ
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం:‘పరోపకారార్థం ఇదం శరీరం’ అని కదా! అందుకే పరోపకార బుద్ధి కలిగియుండాలి. అలాగే పరుల సొమ్ముకు ఆశపడకూడదు. పరుల సొమ్ము పామువంటిదే కాదు పిశాచంవంటిది కూడా అని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు దేవా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262